పిల్లల కోసం ఉద్యోగాలు వదిలేసిన ఇద్దరు తల్లుల వినూత్న బిజినెస్ ప్లాన్స్

పిల్లల సంరక్షణ - ఉద్యోగం రెండు కత్తీ మీద సామే..మామ్ బిజ్‌ను మొదలుపెట్టిన మాధవిఆర్డరిస్తే ఇంటికే అన్నీ పిల్లలకు అవసరమైన వస్తువుమై బేబీ కార్ట్ మొదలుపెట్టిన మృదులఇద్దరూ కార్పొరేట్ రంగంలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన వారే...

0

తప్పుటడుగులు వేసే చిన్నారిని సంరక్షించడం ఫుల్ టైం ఉద్యోగంగా మారిన తరువాత ఆఫీస్ కెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. చాలా సార్లు ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న బిడ్డను ఓ సారి చూసి వద్దామని అనుకున్నా.. అప్పటికే ఆఫీసులో నెత్తినేసుకున్న బాధ్యతలు అక్కడ నుంచి కదలనివ్వవు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, పని ఒత్తిళ్లు అలాంటివి. వద్దన్నా మన దృష్టిని మరల్చనియ్యవు.

ఓ ఉద్యోగం చేస్తున్న తల్లి పరిస్థితి ఉద్యోగం చేస్తున్న మరో తల్లికి తప్ప ఏ ఒక్కరికి అర్థం కాదు. అలాంటి ఇబ్బందుల నుంచే వినూత్నమైన ఆలోచనలతో అద్భుతాన్ని సృష్టించారు మాధవి పాటిల్, మృదులా అరోలా. ఆ ఇద్దరు తల్లుల కథే ఇప్పుడు మీరు చదవబోతున్నారు.

ముంబైకి చెందిన మాధవి పాటిల్ '' మామ్ బిజ్‌ ''ను ప్రారంభించారు. ఇది కేవలం తల్లులకు మాత్రమే పరిమితమైన ఓ ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్. యాధృచ్చికంగా మదర్స్‌డే రోజే ప్రారంభం కావడం విశేషం. ఈ బిజినెస్‌లో తనకు అన్ని విధాలా సహాయ సహకారాలందించేందుకు తన స్నేహితురాలు ప్రచి పట్నాకర్ సాయం కూడా తీసుకున్నారు.

13 ఏళ్ల సుదీర్ఘ కాలం ఐటీ రంగంలో పని చేశాక... తన శక్తినంతటినీ ఆ కార్పొరేట్ సంస్థలకు ధారపోయడం శుద్ధ దండగ అనిపించింది. అందుకే తనకు తానుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకున్నారు మాధవి.

" పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా లాంటి తల్లులకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన మనస్సును తొలి చేస్తునే ఉంటుంది. నా వరకు అయితే నా కొడుక్కి మూడు నాలుగేళ్లు వచ్చేంత వరకూ వచ్చిన తరువాత కచ్చితంగా ఏదో ఒకటి మొదలు పెట్టాలని అనిపించింది. ఆ పని కూడా నా సృజనాత్మకతను ప్రతిబింబించేలా ఉండాలి " అంటారు మాధవి.

ప్రపంచమంతా వెబ్‌లో చిక్కుకున్న తర్వాత మాధవి ఓ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను ప్రారంభిం తన లాంటి వాళ్లను ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లో చేరమని ఆహ్వానించేవారు.

" తల్లులు ఇంట్లోంచి కాలు కదపకుండానే షాపింగ్ చేసే పద్ధతికి ఆమె శ్రీకారం చుట్టారు. వాళ్లు ఆర్డరిస్తే చాలు... వాళ్ల చెప్పిన చోటుకు చెప్పిన విధంగా వస్తువులు వచ్చేస్తాయి. ఆర్డర్లు తీసుకోవడం, వాటిని సరైన సమయానికి సరైన చోటుకు కావాల్సిన వ్యక్తికి అందించడం అంతా మా లాజిస్టిక్ భాగస్వాములు చూసుకుంటారు " అని చెబుతారు మాధవి.

పార్టీలకు సంబంధించిన ఆభరణాల దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే బ్యాగులు, ఎడ్యుకేషనల్ టాయ్స్ ఇలా ప్రతీ వస్తువు మామ్ బిజ్ పోర్టల్లో దొరుకుతుంది.

ఇది ముంబై, ఢిల్లీ, గుజరాత్, అహ్మాదాబాద్‌లకు చెందిన 2 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లల తల్లులకు సరైన వేదిక. త్వరలో ఎన్జీఓలను కూడా భాగస్వాములు కాబోతున్నారు. వాళ్లు తయారు చేసే వస్తువులను కూడా తన పోర్టల్లో అమ్మకానికి ఉంచాలనకుంటున్నారు.

మృదుల అరోరా, మై బేబీ కార్ట్ వ్యవస్థాపకురాలు
మృదుల అరోరా, మై బేబీ కార్ట్ వ్యవస్థాపకురాలు

మృదులా ఆరోరా ప్రారంభించిన మై బేబీ కార్ట్ కథ కాస్త భిన్నం. " బజార్లో పిల్లలకు సంబంధించిన వస్తువులు ఎన్నో దొరుకుతున్నాయి. కానీ కొన్ని వస్తువులకు మాత్రం రెగ్యులర్ మార్కెట్లో ఎప్పుడూ కొరతే. ఒక వేళ దొరికినా రేట్లు కొండెక్కి కూర్చుంటాయి. ఏ తల్లి అయినా తన బిడ్డకు కావాల్సిన వస్తువును తానే డిజైన్ చేస్తే ఆ అనుభూతే వేరన్నది నా అభిప్రాయం ".. అంటారు మృదుల.

మృదుల కూడా 12 ఏళ్ల పాటు ఐటీ రంగంలో పని చేశారు. అందరు తల్లులాగే తన బిడ్డల సంరక్షణ కోసం ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఆ ఖాళీ సమయాలే ఆమెలో సృజనాత్మకతను తట్టి లేపాయి. అలా 2012లో పుట్టింది మై బేబీ కార్ట్.

అన్ని వనరులూ ఉండి ... సృజనాత్మకంగా ఆలోచించే వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే సత్తా ఉన్న తల్లులకు చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అర్థమయ్యింది. అంటారు మృదుల. ప్రస్తుతం మై బేబీకార్ట్ రూపు రేఖలు ఇలా కనిపిస్తున్నా.. వచ్చే రెండేళ్లలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అని చెబుతున్నారు.

మా మై బేబీ కార్ట్‌లో పిల్లల తల్లులు తయారు చేసిన వస్తువులు, వ్యక్తిగత బహుమతులు, ఇంటికి, పిల్లల గదులకు అవసరమయ్యే అలంకరణ వస్తువులు అన్నీ ఉంటాయి. ఇవి ఎంతగానో అందరి తల్లులకూ ఉపయోగపడ్తాయని ముగించారు మృదుల.


ఇలా కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చిన ఇద్దరు యువతులు.. తల్లులైన తర్వాత.. చేసిన చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఆశాజనకంగానే కొనసాగుతున్నాయి. ఊరికే ఇంట్లో కూర్చున్నామనే ఫీల్ రాకుండా.. ఏదో ఒకటి వినూత్నంగా చేపడితే.. మనతో పాటు ఎంతో మందికి ఉపయుక్తం. మీ దగ్గర కూడా అలాంటి ఆలోచన ఏదైనా ఉందా.. ? ఇంకెందుకు ఆలస్యం మొదటి అడుగు వేయండి..