అందమైన మనసున్న ఫెయిర్&లవ్లీ హైదరాబాద్ వచ్చేసింది !!

0

దేశ వ్యాప్తంగా ఎందరో అమ్మాయిల చదువు కోసం స్కాలర్షిప్ అందిస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ తన 12వ ఎడిషన్ ని హైదరాబాద్ లో చేపట్టింది. ఈ సందర్భంగా అమ్మాయిలకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి స్కాలర్ షిప్ అందిస్తారు

“అమ్మాయిల చదువుతోనే సమాజం ఎడ్యుకేట్ అవుతుంది,” రుచిక శర్మ

బీయింగ్ ఉమర్ కో ఫౌండర్ అయిన రుచిక ఈ స్కాలర్షిప్ ఆడిషన్స్ కి ప్యానెల్ జడ్జిగా వ్యవహరించారు. ఆమెతో పాటు పాపులర్ డిజైనర్ సునీలా యేటి, రాబిన్ హుడ్ హైదరాబాద్ ప్రాజెక్ట్ హెడ్ స్ఫూర్తి రెడ్డి పాల్గొన్నారు.

ఈ స్టోరీ కూడా చదవండి

లక్షరూపాయిల స్కాలర్షిప్

అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రయాణించి షార్ట్ లిస్ట్ తీసుకుంటారు. ఇందులోంచి ఫైనలిస్టుల పేర్లను ప్రకటిస్తారు. హైదరాబాద్ లో ఇప్పటికి పది మంది షార్ట్ లిస్ట్ చేశారు. మరికొంత మంది పేర్లను ప్రకటించనున్నారు. ఫైనలిస్టులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందిస్తారు. ప్రతి ఏడాది వేల మంది అమ్మాయిలకు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఒక్కో ఏడాది పూర్తయ్యే సరికి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేజీ నుంచి పీజీ దాకా అన్ని వయసుల వారూ దీనికి అర్హులే.

“స్కూల్, కాలేజీ ఫీజులకు గానూ లక్ష దాకా సాయం అందిస్తాం,” రుచిక

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రుచిక. లక్ష రూపాయిల దాకా సాయం అందుకునే అవకాశం ఉందని, ఈ కార్యక్రమం లో తమ సంస్థకూడ పాలుపంచుకుందని ప్రకటించారామె.

చేతులు కలిపిన స్వచ్ఛంద సంస్థలు

ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ప్రధాన కారణం, స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలే. చాలా ఆర్గనైజేషన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ తో కలసి పనిచేశాయి.

“నాలాంటి అమ్మాయికి ఎడ్యుకేషన్ పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ చాలా మందికి అదొక జీవన్మరణ సమస్య,” స్ఫూర్తిరెడ్డి

స్ఫూర్తి రెడ్డి ఓ ఎన్జీఓను రన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెలాగా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినిలకు స్కూల్ , కాలేజీ ఫీజులందించే విషయంలో ఈ సంస్థలన్నీ కలసి వచ్చాయి.

“మాతో కలసి వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు,” శ్రీనాథన్ సుందరమ్

హిందుస్తాన్ యూనీలివర్ స్కిన్ అండ్ మేకప్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న శ్రీనాథన్ మరిన్ని సంస్థలు ముందుకొస్తే మరింత మందికి సాయం అందిస్తామన్నారు.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories