లోదుస్తుల ఆన్‌లైన్‌ వ్యాపారంలో ' ప్రెట్టీసీక్రెట్స్‌' సూపర్ సక్సెస్

లోదుస్తుల ఆన్‌లైన్‌ వ్యాపారంలో ' ప్రెట్టీసీక్రెట్స్‌' సూపర్ సక్సెస్

Wednesday June 10, 2015,

4 min Read

ఆన్‌లైన్ మార్కెట్‌లో ప్రెట్టీసీక్రెట్స్ బ్రాండ్స్‌కు య‌మ క్రేజ్‌.

పీఎస్ బ్రాండ్స్‌కు హై ఎండ్ లేడీస్ నుంచి మంచి స్పంద‌న‌.

ఆన్‌లైన్‌లో 900కు పైగా బ్రాండ్స్‌ను అందిస్తున్న ప్రెట్టీ సీక్రెట్స్‌.

క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు బ్రాండ్ల‌లో మార్పులు.


ఇప్పుడంతా టెక్నాల‌జీ మ‌యం. ఆఫ్‌లైన్ షాపింగ్‌కు క్రేజ్ మెల్లిగా తగ్గుతోంది. అంతా ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. త‌మ ఇంట్లోనే వివిధ బ్రాండ్ల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంపిక చేసుకునే సౌక‌ర్యం ల‌భిస్తుండ‌టంతో దీనికే మొగ్గుచూపుతున్నారు నెటిజ‌న్లు. ఈ-కామర్స్ పెరిగిపోవడంతో అనేక బ్రాండ్స్‌, బిజినెస్‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఈ కామ‌ర్స్ ద్వారా వ్యాపారం చేసే సంస్థ‌ల‌తో పాటు మ‌ల్టీ బ్రాండ్ రీటైల‌ర్స్ ద్వారా అమ్మ‌కాలు జ‌రిపే వ్యాపార‌వేత్త‌లు కూడా ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేమైన బ్రాండ్స్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా బిజినెస్ చేసే జోవీ, ఫ్రీక‌ల్ట‌ర్‌, య‌ప్‌మీల‌కు తోడుగా ముంబైకి చెందిన ప్రెట్టీ సీక్రెట్స్ కూడా ఆన్‌లైన్ లింగ‌రీ బ్రాండ్‌ను 2012లో ప్రారంభించింది.

ప్రెట్టీ సీక్రెట్స్‌ను క‌ర‌న్ బెహాల్ ప్రారంభించారు. క‌ర‌న్ బెహాల్ కుటుంబానిది వ‌స్త్ర వ్యాపారం. మూడు ద‌శాబ్దాలుగా అన్ని ర‌కాల వ‌స్త్రాల‌ను త‌యారు చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. 2005లో ముంబైలోని లింకింగ్ రోడ్‌లో 'ప్రెట్టి సీక్రెట్స్' పేరిట నైట్‌వేర్ బోటిక్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ‌కు చెందిన అన్ని ర‌కాల ఉత్ప‌త్తులు దేశంలోని అన్ని రిటైల్ షాప్స్‌ల్లోకి చేరిపోయాయి. డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్స్ షాప‌ర్స్ స్టాప్‌, గ్లోబ‌స్‌, సెంట్ర‌ల్‌ల‌తోపాటు 200కుపైగా చిన్న షాపుల్లో కూడా ప్రెట్టీసీక్రెట్స్ లింగ‌రీ ప్రాడ‌క్ట్స్ చేరాయ‌ని క‌ర‌ణ్ చెప్తుంటారు.

ప్రెట్టీ సీక్రెట్స్ అందిస్తున్న నైట్‌వేర్స్‌

ప్రెట్టీ సీక్రెట్స్ అందిస్తున్న నైట్‌వేర్స్‌


ప్రారంభంలో కష్టాలు

ప్రెట్టీసీక్రెట్స్ ఆరంభించిన కొత్త‌లో క‌స్ట‌మ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 2009 వ‌ర‌కు హై ఎండ్ లేడీస్‌ స్లీప్‌వేర్ మార్కెట్ చాలా ప‌రిమితంగా ఉండేది. దీంతో డిమాండ్ ఎప్పుడూ ఎక్కువ‌గా ఉండేది. దేశంలో అప్ప‌టివ‌ర‌కు నైట్‌వేర్ రిటైల్ షాప్స్ త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్రెట్టిసీక్రెట్స్ త‌మ సంస్థ‌ల‌ను స్థాపించేందుకు ఆరంభంలో చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 

"సేల్స్ స్టాఫ్‌కు త‌గినంత అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో అప్ప‌టికే ఉన్న రీటైల్స్ బ్రాండ్స్ కూడా చాలా ఇబ్బందులు ప‌డ్డాయి. స‌రైన‌న్ని ట్ర‌య‌ల్ రూమ్స్ లేక‌పోవ‌డం, లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఉండ‌టం, దీనికి తోడు షాపుల‌్లో స‌రైన వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో నైట్‌వేర్ షోరూమ్‌ల‌కు రావాలంటే క‌స్ట‌మ‌ర్లు ఇబ్బందులు ప‌డేవారు. ఇలాంటి వ్యాపార నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక‌మైన వాతావ‌ర‌ణం అవ‌స‌ర‌ముంటుంది. ఐతే ఇలాంటి వ‌స‌తుల‌ను అసంఘ‌టిత మార్కెట్ క‌ల్పించ‌లేక‌పోయింది. అందుకే ఈ ర‌క‌మైన‌ బ్రాండ్‌ల అభివృద్ధి అంత‌గా లేదు" అని క‌ర‌ణ్ ఆవేద‌న వ్య‌క్తంచేస్తారు.

ప్రెట్టీసీక్రెట్స్‌కు తోడుగా "లేస్‌" పేరుతో మ‌రికొన్ని మ‌ల్టీబ్రాండ్ లింగ‌రీ స్టోర్ల‌ను ఏర్పాటు చేశారు క‌ర‌ణ్‌. త‌మ‌ బ్రాండ్ల‌కే కాదు ఇత‌ర కంపెనీల బ్రాండ్ల స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించి, మంచి వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పేందుకు క‌ర‌ణ్ ఈ స్టోర్ల‌ను ఆరంభించారు. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌న్న ఉద్దేశంతో స్టోర్ల‌ను ప్రారంభించిన‌ప్ప‌టికీ, షోరూమ్‌ల‌ను అనుభవం లేని వ్యక్తులు నడపడం వల్ల అంతా వృధా అని త్వరగానే తేలిపోయింది. దీంతో వీటికి కూడా క‌స్ట‌మ‌ర్లు పెద్ద‌గా రాలేదు.

ప్రెట్టీ సీక్రెట్స్ అందిస్తున్న నైట్‌వేర్స్‌

ప్రెట్టీ సీక్రెట్స్ అందిస్తున్న నైట్‌వేర్స్‌


షాపులు మూసేసి.. ఆన్‌లైన్‌లోకే వ్యాపారం

లింగ‌రీ బిజినెస్‌లో చాలా ఏళ్ల అనుభ‌వ‌ం ఉండడంతో 2011లో మైలేస్‌.ఇన్ పేరుతో ఈ-కామ‌ర్స్ రంగంలోకి ప్ర‌వేశించారు క‌ర‌ణ్‌. ఈ ఆన్‌లైన్ సైట్‌కు విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అనుకున్న‌ట్టుగానే క‌ర‌ణ్‌కు గుర్తింపు ల‌భించింది. ఎలాంటి ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూష‌న్ లేకుండానే, బ్రాండ్ నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు చేర‌డంతో మైలేస్‌కు హిట్స్ పెరిగాయి.

"రిటైల్ షాప్స్‌లో మ‌ధ్య‌వ‌ర్తులు, డ్రిస్ట్రిబ్యూష‌న్ పాయింట్స్ వంటి శ్ర‌మ‌తో కూడిన ప‌ద్ధ‌తులుంటాయి. ఈ అడ్డంకుల‌న్నింటినీ ఈ- కామ‌ర్స్ తొల‌గించింది. బ్రాండ్స్ ఎవ‌రికైతే అవ‌స‌ర‌మో.. నేరుగా ఆ క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌రికే చేరిపోయాయి " అని క‌ర‌ణ్ అంటారు. ఈ ర‌క‌మైన విధానంతో త‌మ బ్రాండ్ల‌పై మంచి న‌మ్మ‌కం సాధించిన క‌ర‌ణ్ త‌మ కంపెనీ మొత్తాన్ని ఆన్‌లైన్ చేసేశారు. 250కిపైగా రిటైల్ షాప్‌ల‌ను తీసేశారు. లేస్ స్టోర్ల‌ను మూసేశారు. ఆ త‌ర్వాత ఎక్స్‌క్లూజివ్ లింగ‌రీ బ్రాండ్ PrettySecrets.comను 2012లో ప్రారంభించారు.

ప్రెట్టీసీక్రెట్స్ నైట్‌వేర్స్‌

ప్రెట్టీసీక్రెట్స్ నైట్‌వేర్స్‌


ఆన్‌లైన్‌లో త‌మ బ్రాండ్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ, కొత్త కంపెనీ కోసం మూల‌ధ‌నం అవ‌స‌రం ప‌డింది. దీంతో ఇండియ‌న్ ఏంజెల్ నెట్‌వ‌ర్క్ & హెచ్‌బీఎస్ ఏంజెల్స్ ఇండియా, ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు ఈ ప్రెట్టీ సీక్రెట్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాయి. ఈ పెట్టుబ‌డుల‌కు తోడు రెహాన్ యార్ ఖాన్‌, అనుప‌మ్ మిట్ట‌ల్‌, ఫ‌రూఖ్ ఒమ‌ర్‌భోయ్ వంటి మ‌రికొంద‌రు ఇన్వెస్ట‌ర్లు, ఆంట్రప్రెన్యూర్‌లు కూడా ప్రెట్టీసీక్రెట్స్ ఫ్యామిలీలో చేరారు. ఆ త‌ర్వాత కూడా ఓరీస్ వెంచ‌ర్ పార్ట్‌న‌ర్స్‌, ఇండియా కోషియంట్ అనే సంస్థ‌ల నుంచి కూడా పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

ప్రెట్టీసీక్రెట్స్ అందిస్తున్న వివిధ ర‌కాల బ్రాండ్స్

ప్రెట్టీసీక్రెట్స్ అందిస్తున్న వివిధ ర‌కాల బ్రాండ్స్


ఏటా పెరుగుతున్న మార్కెట్ సైజ్‌

భార‌త్‌లో లింగ‌రీ మార్కెట్ అంత చిన్న‌దేమీ కాదు. దాదాపుగా రూ. 15 వేల కోట్ల‌కు పైనే ఉంది. కంపౌండ్ యాన్యువ‌ల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్‌) 20-25%గా ఉంది. ఈ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ 2018 క‌ల్లా రూ. 30 వేల కోట్ల‌కు చేరొచ్చ‌ని విశ్లేష‌కులు అంచనా. ఇది కూడా ఆఫ్‌లైన్ మార్కెట్ ఒక్కటే. ఇక‌ వ‌చ్చే ఐదేళ్ల‌లో ఆన్‌లైన్ లింగ‌రీ మార్కెట్ సైజ్ రూ. 1200-1500 కోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా.

ప్రెట్టీ సీక్రెట్స్ స‌క్సెస్ సీక్రెట్‌ ?

"ప్రెట్టీసీక్రెట్స్ పూర్తిగా ఆన్‌లైన్ లింగ‌రీ బ్రాండ్ మాత్ర‌మే. ఆన్‌లైన్ క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాలు, వినియోగ ప‌ద్ధ‌తుల‌ను అర్థం చేసుకుని బ్రాండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం మా విజ‌యానికి కార‌ణం. క్యాట‌లాగ్ విడ్త్‌, కాంపిటిటీవ్ ప్రైసింగ్‌, హై ఫ్యాష‌న్‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, యూత్‌ను టార్గెట్ చేసి బ్రాండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాం" అని క‌ర‌ణ్ వివ‌రించారు.

అంద‌మైన బ్రాల‌ను అందిస్తున్న ప్రెట్టీసీక్రెట్స్‌

అంద‌మైన బ్రాల‌ను అందిస్తున్న ప్రెట్టీసీక్రెట్స్‌


బ్రా, బ్రీఫ్స్‌, నైట్‌వేర్స్‌, స్విమ్‌వేర్స్‌, షేప‌ర్స్‌వంటి ప్రాడ‌క్ట్ రేంజెస్ వివ‌రాల‌ను క్యాట‌లాగ్‌లో పొందుప‌ర్చారు. దేశంలో ప‌ది టాప్ బ్రాండ్ల వివ‌రాల‌తోపాటు మొత్తం 900 ప్రాడ‌క్ట్‌ల వివ‌రాలు క్యాట‌లాగ్‌లో ఉన్నాయి.

ప్రెట్టీసీక్రెట్స్ వ్య‌వ‌స్థాప‌కుడు క‌ర‌ణ్ బెహాల్‌

ప్రెట్టీసీక్రెట్స్ వ్య‌వ‌స్థాప‌కుడు క‌ర‌ణ్ బెహాల్‌


ప్రెట్టీసీక్రెట్స్ ప్ర‌స్తుతం జ‌బాంగ్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్ర వంటి ఇత‌ర రిటైల్ సైట్స్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్‌లైన్ మార్కెట్ నిర్ధిష్ట అవ‌స‌రాల‌కు ఈ ప్రెట్టీసీక్రెట్స్ బ్రాండ్ ఏకైక స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌. ఈ రిటైల్ సైట్లు కేవ‌లం ఆన్‌లైన్‌లో అమ్మ‌కాలు మాత్ర‌మే జ‌రుపుతాయి. బ్రాండ్ల‌ను మాత్రం ప్రెట్టీసీక్రెట్సే స‌ర‌ఫ‌రా చేస్తుంది.

భ‌విష్య‌త్ ల‌క్ష్యం

దేశంలోనే అతిపెద్ద లింగ‌రీ బ్రాండ్‌గా ఎద‌గాల‌న్న‌ది ప్రెట్టీసీక్రెట్స్ ల‌క్ష్యం. త‌మ బ్రాండ్ ఈ-కామ‌ర్స్ సైట్‌గా కాకుండా ఓ బ్రాండ్ కంపెనీగా గుర్తుండిపోవాల‌న్న‌ది ఈ ప్రెట్టీ సీక్రెట్స్ ల‌క్ష్యం. " ఈకామ‌ర్స్ అనేది క‌స్ట‌మ‌ర్ల‌ను చేరేందుకు ప్ర‌భావ‌వంత‌మైన మార్గం. అత్యున్న‌త నాణ్య‌త‌, అత్యుత్త‌మ స్ట‌యిల్ క‌లిగిన ప్రాడ‌క్ట్‌ల‌ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు క‌స్ట‌మ‌ర్ల‌కు అందించాల‌న్న‌దే మా సంస్థ ఉద్దేశం. దానికి త‌గ్గ‌ట్టుగానే మా ప‌నితీరు ఉంటుంది" అని క‌ర‌ణ్ చెప్పారు. క‌ర‌ణ్ ఆశిస్తున్న‌ట్టుగానే దేశంలో ప్రెట్టీసీక్రెట్స్ హైఎండ్ లేడీస్ మ‌న‌సు దోచుకోవాల‌ని ఆశిద్దాం..