కర్నాటక రవాణా రంగాన్ని వణికిస్తున్న 'లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్'

రవాణారంగ దిగ్గజాలకు వణుకు..లాజిస్టిక్స్‌లో కొత్త తరహా సేవలను పరిచయం చేసిన 'లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్ '..కస్టమర్ అవసరాలను అర్ధం చేసుకుంటే విజయం ఖాయమంటున్న టీం..లాంఛ్ అయిన అనతి కాలంలోనే మరో కంపెనీని టేకోవర్ చేయడమంటే మాటలా ?రవాణా రంగాన్ని పునర్ నిర్వచిస్తామంటున్న లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్..

0

మన దేశం రవాణా రంగం మార్కెట్ విలువ 130 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది దాదాపు ₹8 లక్షల కోట్లు. నగరాల్లో అంతర్గత రవాణా మార్కెట్ విలువ ₹60వేల కోట్లకుపైగానే. ఇంట్రాసిటీ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో ప్యాకర్స్, మూవర్స్ లాంటి కంపెనీలకు కరువు లేకపోయినా... ఈ రంగంలోకి వచ్చిపడుతున్న కొత్త కంపెనీల సంఖ్య మాత్రం ఎక్కువే. ఇలా నిన్నకాక మొన్న వచ్చిన ఓ కంపెనీ... మొత్తం కర్నాటక రవాణా రంగాన్నే భయపెడుతోంది. ఇంతకీ ఏంటా కంపెనీ ? బడా కంపెనీలను వణికించడం ఎలా సాధ్యమైంది ఆ స్టార్టప్‌కి ?

"ఇప్పుడున్న కంపెనీల కంటే మెరుగైన సేవలు అందిస్తూ, ఉత్తమమైన సొల్యూషన్ చూపించి, మెరుగైన సర్వీసులు అందించగలిగితే... కస్టమర్లను ఆకట్టుకోగలగడం అంత కష్టం కాదు. ఇవన్నీ చేయగలిగితే.. అసలు పోటీ పెద్ద విషయమేం కాదు" అంటున్నారు 24 ఏళ్ల ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ పుష్కర్ సింగ్.

లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్.ఇన్.. ఇదీ పుష్కర్ ప్రారంభించిన టెక్నో లాజిస్టిక్స్ వెంచర్ పేరు. పోటీ ప్రపంచంలో ఎలా నిలబడాలో ఈయనకు బాగానే తెలుసు. ఐఐటీలో తన బ్యాచ్‌మేట్స్ సుదర్శన్ రవి(ఎకనమిక్స్ 2013), అంకిత్ పరషెర్(ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 2012)లతో కలిసి... లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ వెంచర్ ప్రారంభించారు. ప్రతీ నెలా 90శాతం సగటు వృద్ధి నమోదు చేస్తోందంటే.. ఈ కంపెనీ ఎంతలా దూసుకుపోతోందో అర్ధం చేసుకోవచ్చు.

లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ టీం
లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ టీం

ఆఖరి నిమిషంలో రవాణా సదుపాయాలు వెతుక్కునేవారికైనా, ముందుగానే బుక్ చేసుకునే వారికైనా.. ఏ విభాగంవారికైనా సరే.. ఇంట్రాసిటీ డెలివరీల మార్కెట్‌ను టార్గెట్ చేసింది లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్. ప్రస్తుతం బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ... నమ్మదగిన, చవకైన, నాణ్యమైన ప్రొఫెషనల్ సర్వీసులను... ఇటు కస్టమర్లకు, అటు వ్యాపారులకు అందిస్తోంది.

“రవాణా రంగంలో ఇలాంటి ప్రమాణాలు కలిగిన ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ చాలా అవసరం. సొంత సదుపాయాలు కలిగిన మాకూ... ఇతర కంపెనీలకు భిన్నమైన బిజినెస్ మోడల్ ఉంది. క్లయింట్‌ అవసరాలను అర్ధం చేసుకుని తగిన విధంగా సేవలందించేందుకు.. అవసరమైన సాంకేతికత, సదుపాయాలు మాకున్నాయి. ఈ రంగంలో అభివృద్ధి అవకాశాలు అపారంగా ఉన్నాయి. సరైన బిజినెస్ మోడల్ కోసం... ఈ రంగం ఎదురుచూస్తోంది” అంటున్నారు లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ సీఈఓ పుష్కర్.

బడా కంపెనీల కమర్షియల్ అవసరాల నుంచి సాధారణ గృహావసరాల వరకూ... కర్నాటక వ్యాప్తంగా రవాణా రంగానికి వన్‌స్టాప్ షాప్‌గా ఎదిగేందుకు లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ దగ్గర పక్కా ప్రణాళికలున్నాయి. లాజిస్టిక్స్ రంగాన్ని పునర్ నిర్వచించాలన్నది ఈ కంపెనీ కాన్సెప్ట్. వ్యాపారాల నుంచి కస్టమర్ల వరకూ అందరికీ ఇబ్బందులు లేని రవాణా పరిష్కారాలను చూపించాలని.. అది కూడా కేవలం క్షణాల్లో సౌకర్యాలను కల్పించాలన్నది ఈ స్టార్టప్ లక్ష్యం.

లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్‌ ప్రత్యేకమైన సేవలు

క్లయింట్లకు సాధారణ రవాణా సేవలు అందిస్తూనే... వాటితోపాటే పలు వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా ఆఫర్ చేస్తోందీ లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్. ముందుగానే స్క్రీనింగ్ చేసిన డ్రైవర్లు, ఆడిట్ చేసిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, పాయింట్ టూ పాయింట్ బిల్లింగ్, స్టేటస్ అప్‌డేట్స్, 24×7 సర్వీసులు, డిమాండ్‌కు తగిన సామర్ధ్యం, అన్నింటికంటే మించి.. అతి తక్కువ ధరలకే సేవలు అందించగలగడం... ఈ కంపెనీ స్పెషాలిటీ. ఉదాహరణకు మొదటి ఐదు కిలోమీటర్లకు లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ చేసే మొత్తం ₹350. ఇతర లోకల్ కంపెనీలు ఏవైనా సరే ₹800 వసూలు చేస్తాయి. ఇతర పోటీ కంపెనీలు కూడా ఐదు కిలోమీటర్లకు ₹450 ఛార్జ్ చేస్తున్నాయి.

“కస్టమర్ల అవసరాలను అర్ధం చేసుకుని.. ఈ రంగానికి సంబంధించి డీఎన్ఏను కూడా మార్చగలిగే మోడల్ ఇది”అంటున్నారు పుష్కర్.

రవాణారంగం 2020వరకూ 12.17శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందనే అంచనాలున్నాయని రీసెర్చ్ & మార్కెట్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ రంగంలో చాలా స్టార్టప్‌లు పుట్టుకొచ్చినా... పెద్దగా నిలబడలేకపోయాయి. పెద్ద కంపెనీల ధాటికి అల్లాడిపోయాయి. కానీ ఈ లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ మాత్రం విభిన్నమైనది. ఈ కంపెనీ కార్పొరేట్ స్థాయి ఉన్న వాటిని కూడా వణికిస్తోంది. దీనికి కారణం... ఇంతటి సామర్ధ్యం ఉన్న ఈ రంగంలో తాము కొత్త తరహా సేవలను పరిచయం చేశామని చెబుతోంది లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్. ఇతర స్టార్టప్‌లు విఫలమైన ప్రతీ అంశాన్నీ తాము ముందుగానే గుర్తించామని, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలను సిద్ధం చేసుకోవడంతోనే.. ఇప్పుడున్న స్థాయి సాధ్యమైందని చెబుతోంది.

“ఈ వెంచర్ ప్రారంభానికి ముందే ఆపరేషన్స్, బిజినెస్ విభాగాల్లో వ్యవస్థాపక సభ్యులకు అనుభవం ఉండడంతో... లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్‌కోసం తమ అనుభవాన్ని రంగరించి మరీ ఉపయోగిస్తున్నారు. తమ నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తున్నారు. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా... ప్రొడక్ట్ డిజైన్ చేయగలగడం కూడా... కీలక పాత్ర పోషించింది ఈ విజయంలో”అన్నారు పుష్కర్.

లెట్స్ ఫండ్ ఇట్

ఇప్పటివరకూ ఈ వెంచర్‌కు వ్యవస్థాపక సభ్యులు, వారికి అనుబంధంగా ఉన్నవారే నిధులు సమకూర్చుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధి, ఐఐటీలు, ఎన్ఐటీ, బిఐటీల నుంచి తీసుకున్న నిపుణులైన వ్యక్తులతో టీం నిర్మాణానికి తగిన మొత్తమే వెచ్చించారు. సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న పుష్కర్ కూడా గతంలో ఐటీసీలో విధులు నిర్వహించారు. ఇప్పటికే ఈ స్టార్టప్‌లో పెట్టుబడులకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని.. కొన్నింటితో చర్చలు తుదిదశలో ఉన్నాయని పుష్కర్ చెబ్తున్నారు.

ఇదే రంగంలోకి ప్రవేశించిన మరో కొత్త సంస్థ షిఫ్టర్‌ను టేకోవర్ చేసి... తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పింది లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్. షిఫ్టర్ కూడా బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న మిని ట్రక్ ప్రొక్యూర్మెంట్ సర్వీసే. ఐదు నెలల క్రితం లాంఛ్ అయిన ఈ కంపెనీ... ఆన్‌లైన్, ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా.. అవసరమైన సేవలు అందిస్తుంది.

షిఫ్టర్‌ను 2014లో రూబల్ సిద్ధు, ప్రశాంత్ గుప్తాలు ప్రారంభించారు. టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫాంపై ఏర్పాటైన ఈ సంస్థ... ట్రక్ రెంటల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవర్లకు తగినంత ఆదాయం లభించేలా రూపొందించిన ఈ వెంచర్... అనతికాలంలోనే తగిన అభివృద్ధి నమోదు చేసింది. ఇలాంటి కంపెనీని టేకోవర్ చేయడం ద్వారా... లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్‌కు.. వాహనాల సంఖ్య, కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందేకాదు.. ఇతర నగరాలకు విస్తరించేందుకు తగిన మౌలిక సదుపాయాలు కూడా జతయ్యాయి.

కస్టమర్ రెస్పాన్స్

తమ స్టార్టప్‌కు కస్టమర్ల నుంచి తగిన ఆదరణ లభిస్తుందని పుష్కర్ విశ్వసిస్తున్నారు. “ఇప్పటికే మేం సేవలందించినవారి నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. బిజినెస్ టర్నోవర్ కూడా చాలా వేగంగా పెరుగుతోంది దీని కారణం.. ప్రస్తుత మా క్లయింట్లు ఇతరులకు మా సేవలను రిఫర్ చేయడమే”నని చెప్పారు పుష్కర్.

ఈ రంగంలో సవాళ్లు లేకపోలేదని, అయితే వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని పుష్కర్ అంటున్నారు. కస్టమర్ అవసరాలను అర్ధం చేసుకుని... వారికి తగిన సేవలను, సరసమైన ధరలతోపాటు, సౌకర్యవంతగానూ అందించగలిగితే... విజయం దానంతట అదే లభిస్తుందని చెబ్తున్నారు.

“నిర్వహణ విషయంలో తగినంత సిద్ధంగా ఉండడంతోపాటు... కస్టమర్లను సరిగా అర్ధం చేసుకోగలిగితే.. ఈ టెక్నాలజీ ఆధారిత రవాణా ప్లాట్‌ఫాం ద్వారా.. అనేకమందింకి సేవలందిచవచ్చు”అని చెప్పారు పుష్కర్.

వెబ్‌సైట్

All about me, family & freinds

Related Stories

Stories by Krishtan