'డబ్‌రూ' తోడుంటే డబ్బింగ్ చాలా ఈజీ

డబ్బింగ్ టూల్ 'డబ్‌రూ' ను రూపొందించిన ముగ్గురు సోదరులుడబ్‌రూ సాయంతో సులభంగా మారిన ఆడియో డబ్బింగ్విద్యా సంబంధిత అంశాలకు డబ్‌రూను వినియోగిస్తున్న నిఖిల్ బ్యాచ్డబ్‌రూ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే పూర్తయిన 40 వీడియోల డబ్బింగ్

'డబ్‌రూ' తోడుంటే డబ్బింగ్ చాలా ఈజీ

Monday August 03, 2015,

4 min Read

ఆర్కిమెడిస్ సూత్రం కానీ, న్యూటన్స్ లాస్ కానీ అనుకోకుండా వచ్చినవే.. స్నానం చేస్తుండగా ఆర్కిమెడిస్ సూత్రం కనుగొంటే.. చెట్టుపై నుంచి యాపిల్ పడటాన్ని గమనించి న్యూటన్.. సూత్రాన్ని సిద్ధాంతీకరించారు. అలాగే ముగ్గురు సోదరులు అనుకోకుండా ఓ రోజు బాతాఖానీ కొడుతూ దేశ విద్యారంగంలోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ భాషలోకైనా డబ్బింగ్‌కు సహకరించే టూల్ డబ్‌రూను రూపొందించారు.

అది శీతాకాలం.. ఓ వైపు చల్లని గాలి.. మరోవైపు మంచు.. ఇలాంటి సందర్భాల్లో పక్కన మనసుకు నచ్చిన స్నేహితులుంటే.. కొత్త ఆలోచనలు చక్కర్లు కొడతాయి. ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్న‌ డబ్‌రూ కూడా ఇలా ఆవిర్భించినదే కావడం విశేషం.

నిఖిల్ కులకర్ణి, కిరణ్, కిషోర్ పాటిల్.. ముగ్గురు కజిన్ సోదరులు. సమయం దొరికితే ఈ ముగ్గరు సరదాగా ముచ్చటించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అలా ఓ రోజు ఈ ముగ్గురు టైంపాస్ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే వారికి ముగ్గురిలో ఒకరికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. ఫన్నీ స్పూఫ్స్‌ను రూపొందించి స్నేహితులకు పంపితే ఎలా ఉంటుందని ఈ ముగ్గురు ఆలోచించారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ వీడియోలను పంపేందుకు సరైన ప్లాట్‌ఫామ్‌ లేకపోవడం ఆ ముగ్గురిని నిరాశపరిచింది. ఇది కొద్ది సేపు బాధించినా, ఆ తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌ను తామే రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు వచ్చారు. అప్పటివరకు పూర్తిస్థాయి ఉద్యోగాలు చేస్తున్న ఆ ముగ్గురు యువ ఇంజినీర్లు ఓ డబ్బింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని డిసైడయ్యారు.

image


సామాజిక కోణంతో కూడిన ప్రాజెక్ట్‌లో పనిచేయడం నిఖిల్‌కు అదే తొలిసారి కాదు. లెర్నింగ్ ఇంగ్లిష్ బై టాకింగ్ ఆన్ ఫోన్ (ఎల్ఈబీటీఓపీ) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి గతంలో వార్తల్లో కూడా నిలిచారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పరస్పరం ఫోన్‌లోనే ఇంగ్లిష్‌ను నేర్పించడం, చెప్పడం వంటివి చేసుకున్నారు యూజర్లు. ఆగస్ట్ 2013 నుంచి జూలై 2014 మధ్య కాలంలో 20 వేల కాల్స్ ఈ ప్లాట్‌ఫామ్‌లో చోటుచేసుకున్నాయి. అలాగే 3500కు పైగా కాలర్స్ ఉన్నారు. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్ ఎక్కువ కాలం నిలవలేదు.

సొంతంగా వ్యాపారం నిర్వహించడంలో ఉన్న మజా తెలుసుకున్న నిఖిల్, బాబా ఆటామిక్ సెంటర్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలేశారు. దేశమంతా వందరోజులపాటు పర్యటించారు. కొన్నిరోజులు ఆశ్రమాల్లో గడిపారు. ఖాఠ్మాండులో విపాసన కోర్సు నేర్చుకుని ప్రపంచంతో తన సంబంధాలను తెంచేసుకున్నారు. అరువిల్లె (పాండిచ్చేరి)లో కొంతకాలం వాలంటీర్‌గా కూడా పనిచేశారు. ఎంత తిరిగినా, ఏదో కోల్పోతున్నమన్న భావన ఆయన మదిలో మెదులుతూనే ఉండేది.

‘‘మూడేళ్లపాటు వివిధ సంస్థల్లో పనిచేశాను. కొత్త ఆలోచనలను కార్యరూపం దాల్చడం, వివిధ ప్రాంతాలకు వెళ్లడం. ఈ రెండే అంశాలు నన్ను ఎప్పుడూ కట్టిపడేసేవి. ఈ సమయంలో ఏదైనా మంచి పనిని ప్రారంభించాలని అనుకున్నాను. ఐడియాలతో నా నోట్‌ప్యాడ్ అంతా నిండిపోయింది. ఆ తర్వాత మా కజిన్స్‌ను కలుసుకునేందుకు బెంగళూరు వెళ్లాను’’ అని నిఖిల్ వివరించారు.
నిఖిల్, డబ్‌రూ సహ వ్యవస్థాపకుడు

నిఖిల్, డబ్‌రూ సహ వ్యవస్థాపకుడు


డబ్‌రూ ఆలోచన

ఈ ముగ్గురు సోదరులు కలిసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక మరింత పెరిగింది. అలా నిఖిల్ నోట్‌ప్యాడ్‌లో నిండిన ఐడియాలపై తీవ్రంగా చర్చించారు. ఆ సమయంలో డబ్ వీడియోస్‌ను స్ఫూప్స్‌గా మార్చాలన్న ఐడియా వారికి తట్టింది.

‘‘మా స్నేహితుల వాయిస్‌ ఓవర్లు, క్రికెటర్ల బ్యాడ్ లిప్ రీడింగ్ మమ్మల్ని ఎంతో నవ్వించేంది. అలాంటి వీడియోలు మాకు బాగా నచ్చేవి. ఇతరుల ఆడియోలతో వీడియోలను మిక్స్ చేయాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది’’ అని నిఖిల్ వివరాంచారు.

అప్పుడే వీడియో ఆడియో సింకింగ్ ప్లాట్‌ఫామ్ డబ్ రూను రూపొందించారు. ఆరు నెలలు గడిచిన తర్వాత విద్యకు సంబంధించిన అంశాలను వివిధ భాషల్లోకి మార్చేందుకు ఈ ప్రాడక్ట్‌ను ఉపయోగించాలని వారు నిర్ణయించారు.

‘‘డబ్బింగ్ అనేది చాలా కష్టమైన పని. మొదట వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకుని ఆ తర్వాత దానికి వాయిస్ ఓవర్‌ను కలపాల్సి ఉంటుంది. దీన్ని మేం సింపుల్ చేసేశాం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని చాలా ఈజీగా డబ్బింగ్ పనులు పూర్తి చేయొచ్చిప్పుడు. నిజానికి ప్రపంచ తొలి డబ్బింగ్ టూల్ మాదే’ అని నిఖిల్ గర్వంగా చెప్తారు.

వీడియోను సెలెక్ట్ చేయాలంటే యూజర్లు సాధారణంగా వీడియో యూఆర్ఎల్‌ను కానీ లేదంటే వెబ్ సైట్‌లో కాని సెలెక్ట్ చేసుకుంటారు. వీడియోకు వాయిస్‌ ఓవర్‌ను యాడ్ చేయాలంటే డబ్ రూ టూల్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. రికార్డింగ్ దానంతటదే స్టార్ట్ అయి మైక్రో ఫోన్ల ద్వారా వాయిస్ వీడియోలకు సింక్ అవుతుంది.

‘‘ఒక్కసారి రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆడియోతో కలిపే వీడియో రన్ అవుతుంది. ఆ వీడియో చూస్తుంటే దానికి డబ్బింగ్ ఎఫెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇయర్ ఫోన్స్ ఉన్నప్పుడు మ్యూట్ చేసిన టెలివిజన్ చూస్తున్నట్టుగానే ఇది ఉంటుంది’’ అని నిఖిల్ వివరించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటికి 40 డబ్బింగ్ వీడియోలను పూర్తిచేశారు.

‘‘భారత్‌లో విద్య అభివృద్ధికి ఎంతో చేయాల్సి ఉందని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. డబ్ రూను ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారో ఆలోచిస్తేనే నాకు ఆశ్చర్యమేస్తుంటుంది. వాస్తవానికి ఇంగ్లిష్ అన్యభాష. చాలామందికి అది అంటరానిదే. అయితే విద్యా రంగంలో హై క్వాలిటీ కంటెంట్ ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా ఉన్నాయి’’ అని నిఖిల్ వివరించారు.

ఆసక్తికరమైన అంశాలను నేర్చుకోవాలంటే చిన్నారులకు తప్పనిసరిగా ఇంగ్లిష్‌పై పట్టు అవసరమా? అని నిఖిల్‌కు అనిపించేది. ఆ గ్యాప్‌ను తగ్గించేందుకు ఈ డబ్ రూ చక్కగా ఉపయోగపడుతున్నది.

‘‘ఖాన్ అకాడమీ తయారు చేసే నాణ్యమైన విద్యా సంబంధిత అంశాలు దేశంలో చాలా గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయి. అయితే భాష, యాక్సెంట్ చిన్నారులు పూర్తిగా నేర్చుకోకుండా అడ్డువస్తున్నాయి. ఈ పరిస్థితులను డబ్ రూ చక్కగా సమన్వయం చేస్తున్నది’’ అని నిఖిల్ వివరించారు. విద్యా రంగంలో ఈ డబ్ రూకు ఎంతో భవిష్యత్ ఉందని నిఖిల్ భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం కజిన్ కిరణ్ తన ఉద్యోగాన్ని వదులుకునేలా నిఖిల్ కన్వీన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ ముగ్గరు సోదరులు దేశవ్యాప్తంగా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లతో కొలబరేట్ అవుతున్నారు.

image


ఎంతో భవిష్యత్..

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో 200 మిలియన్ల విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్తున్నారు. స్థానిక భాషపై పట్టు ఉంటే బహుభాషా కార్యక్రమాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు.

‘‘ఈ నంబర్లు చూస్తే సేవ చేసేందుకు ఎంతో అవకావం ఉందని నాకు అనిపిస్తున్నది. 22 భాషల్లో డబ్ రూను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది. ఇది చిన్న పని కాదు. ఎంత కష్టమైనా దీన్ని చేసేందుకు మేము సిద్దంగా ఉన్నాం’’ అని నిఖిల్ వివరించారు.

భవిష్యత్ ప్రణాళిక..

వీడియో షేరింగ్ కమ్యునిటీగా డబ్ రూను మార్చాలన్నదే ఈ త్రిమూర్తుల ఆలోచన. ‘‘ఆన్‌లైన్‌లో ఎవరైనా ఏ భాషలోకైనా వీడియోలను డబ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ కంటెంట్‌ను డబ్ చేసేందుకు మేం పెద్ద లైబ్రరీనే రూపొందించాం. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చే సాధికారతను కల్పించాం. ప్రతి ఒక్కరు స్థానిక భాషలో అంశాలను డబ్ చేసుకునేందుకు సాయం చేస్తే.. దేశం దానంతటదే పురోగమిస్తుంది’’ అని నిఖిల్ వివరించారు. ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న నిఖిల్ పెట్టుబడిదారుల సాయం కోసం చూస్తున్నరు.

''ప్రజలు ఉపయోగించే స్థానిక భాషల్లోనే ఐడియాలు ఉండాలి. ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే నేర్పించాలి. వారికి ఆలోచనలు రేకెత్తించాలి. అప్పుడే వారు సమాచారాన్ని రాబడతారు’’ అని స్వామి వివేకానంద కోట్స్‌ను ఈ సందర్భంగా నిఖిల్ గుర్తుచేశారు. 

website