బెంగళూరులో స్టార్టప్ కు ఔట్ సోర్సింగ్ ఇస్తున్నారా? అయితే ఈ పంచసూత్రాలు గుర్తుపెట్టుకోండి

0

దేశ ఐటి రాజధానిగా పేరున్న బెంగళూరు నగరం ఇప్పుడు స్టార్టప్ కు డ్రీమ్ సిటీగా మారింది. దీంతో ఔత్సాహికులంతా అక్కడే స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఇవ్వడానికి చాల సంస్థలు ఎగబడుతున్నాయి. మన హైదరాబాద్ నుంచి కూడా చాలా ప్రాజెక్టులు బెంగళూరు స్టార్టప్ లకు ఔట్ సోర్సింగ్ ఇస్తున్నాయి. బెంగళూరు కేంద్రంగా నడుస్తోన్న స్టార్టప్ లతో ఔట్ సోర్సింగ్ ఇవ్వాలంటే ప్రధానంగా 5 పద్దతులు గుర్తుపెట్టుకోవాలి.

1)మార్కెట్ రీసెర్చి

తెలుసుకోవాల్సిన పద్దతుల్లో ప్రధానమైనది మార్కెట్ రీసెర్చ్. కావల్సిన మంచి ఆర్గనైజేషన్ తెలుసుకోవాలంటే ప్రతి వ్యాపారవేత్త మార్కెట్ రీసెర్చ్ కంపల్సరీగా చేయాలి. ఇది చేయకుండా సంస్థకు ఔట్ సోర్సింగ్ పార్ట్‌ నర్‌ ను వెతుక్కుంటే తర్వాత, ఇంకేదైనా బెస్ట్ కంపెనీ తారసపడితే బాధపడాల్సి ఉంటుంది. ఔట్ సోర్సింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాక మార్కెట్ రీసెర్చి అనేది మొదటి అడుగు గా భావించొచ్చు.

2) కస్టమర్ రివ్యూ

ఒకసారి మార్కెట్ రీసెర్చ్ పూర్తియన తర్వాత మీకు కావల్సిన స్టార్టప్ ల లిస్ట్ దగ్గరుంటుంది. మీ డొమైన్ లో వేరే వ్యక్తులు వారితో పనిచేసిన తర్వాత ఎలాంటి అనుభవాన్ని గడించారనే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇది కూడా ముఖ్యమైన టాస్క్.

3) కాలమానాలు

మన బెంగళూరు ఇప్పుడు అంతర్జాతీయ నగరం. చాలా స్టార్టప్ కంపెనీలు ఆన్ షోర్, ఆఫ్ షోర్ ప్రాజెక్టులు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ కాలమానానికి పనిచేసే స్టార్టప్ ను ఎంచుకుంటే మీకు సాయంగా ఉంటుంది. ఆఫ్ షోర్ సంస్థలు సైతం తమకు అనుకూల మైన కాలమానాల్లో పనిచేసే స్టార్టప్ లను ఎన్నుకుంటున్నాయి. ఆయా సమయాల్లో పనులు చేసుకుంటున్నాయి.

4)స్టార్టప్ బలం, బలహీనత

మార్కెట్ రీసెర్చ్ లోనే స్టార్టప్ కు సంబంధించిన బలం, బలహీనతల్ని గుర్తించొచ్చు. అయితే మొదట్లో చేసిన రీసెర్చి పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చు. తర్వాత దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే అది స్టార్టప్ బలం, బలహీనతలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

5) ఒప్పందం

ప్రాజెక్టు కు కావల్సిన విషయాలపై చర్చించిన దశలోనే ఒప్పందం చేసుకోవడం మంచింది. స్పెసిఫికేషన్స్, రోడ్ మ్యాప్ తోపాటు అవసరం అనుకుంటే డెడ్ లైన్ కూడా ముందుగానే అగ్రిమెంట్ లో రాసుకుని ముందుకు పోతే మంచింది.

బెంగళూరు కేంద్రంగా నడుస్తోన్న ఈ-కామర్స్ సొల్యూషన్ డిగ్ డిజిటల్ (DiggDigital) కు ఫౌండర్ సిఈఓ ఆనంద్ నారాయణప్ప చెప్పిన అభిప్రాయం నుంచి రాసిన ఆర్టికల్ ఇది !

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik