స్టార్టప్ రంగంలోకి దూకడం మంచిదేనా..?

0


ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న 70శాతం మంది ఉద్యోగులు.. తాము చేస్తున్న ఉద్యోగానికి చదివిన చదువుకు పొంతన లేదని చెబుతూంటారు. ఎన్నో సర్వేల్లో ఈ విషయం నిరూపితమైంది కూడా. యువతరం కొత్త ఆలోచనలతో స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న దశలో ఇప్పుడు విద్యార్హతలు ప్రధానాంశం కాదు. ఆలోచనలు, అనుభవమే ముఖ్యం. స్టార్టప్ లు పెట్టి ఫెయిలయిన వాళ్లు, స్టార్టప్ ఛాలెంజ్ లో నిలబడానుకునేవాళ్లు, MNC కంపెనీల్లో మంచి జీతం పొందుతున్నవాళ్లు.. ఇలా అనేక మందికి స్టార్టప్ లలో ఆఫర్లు వస్తుండటం ఇప్పుడు కామన్. అయితే వీరందరికి ఒకటే సందేహం.

తాము స్టార్టప్ లలో ఇమడగలమా..? స్టార్టప్ ఉద్యోగంలో చేరడం మంచిదేనా...?

కొన్ని అంశాలలో తమనుతాము విశ్లేషించుకుంటే తుది నిర్ణయం తీసుకోవడం సులువంటున్నారు ప్రదీప్ గోయల్. స్టార్టప్ వ్యవస్థలో ఎత్తుపల్లాలు చూసిన ప్రదీప్ గోయల్ ఇస్తున్న సూచనలు..సలహాలు ఇవే..

# ఆహా.. నాకేంటట..? నాకేంటి..?

స్టార్టప్ కంపెనీలో చేరేముందు మొట్టమొదటగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఆ స్టార్టప్ కి మనవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి..?. మనం ఆ స్టార్టప్ కి కొత్తగా చేర్చే వాల్యూ ఏమీ లేదని భావిస్తే అందులో చేరాల్సిన అవసరమే లేదు. మనకి అన్ని రకాల స్కిల్స్ ఉన్నప్పటికీ ఏ విధంగా వాటిని స్టార్టప్ కు ఉపయోగపడేవిధంగా ఎలా ఉపయోగించాలనేదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రావీణ్యం కన్నా ముందుగా స్టార్టప్ లో పనిచేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే స్టార్టప్ లో జాయినవడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు కాన్ఫిడెంట్ గా ఉండే స్టార్టప్ ఫౌండర్లకు మరింత స్పష్టత వస్తుంది. అప్పుడు ది బెస్ట్ అవుట్ పుట్ రావడానికి అవకాశం ఉంటుంది.

# నేను ఎవరితో పనిచేయబోతున్నాను..?

రెండో అత్యంత ముఖ్యమైన విషయం.. మనం ఎవరితో పనిచేయబోతున్నామనేది తెలుసుకోవడం. స్టార్టప్ ఫౌండర్స్, నిర్వహణ బృందం గురించి వారి బ్యాక్ గ్రౌండ్, పనితీరుపై మనం స్పష్టమైన అవగాహన తెచ్చుకోగలగాలి. మంచి వాళ్లు మరింత మంచివాళ్లను ఆకర్షిస్తారనేది సిద్దాంతం. అందుకే వారు మరింత మంచి టీంను రెడీ చేసుకుంటారు. పనిని అస్వాదించే అవకాశం లేని వ్యక్తుల దగ్గర చేరకపోవడమే మంచిది. మంచి వ్యక్తులతో పనిచేసేటప్పుడు వచ్చే ఆనందం మరెక్కడా రాదు.

# స్టార్టప్ లో నా రోల్ ఏమిటి..? నేను న్యాయం చేయగలనా..?

స్టార్టప్ లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఆలోచించాల్సిన మొట్టమొదటి విషయం ఇది. 

నేను మొదటగా ఓ స్టార్టప్ లో చేరినప్పుడు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పోస్టింగ్ ఇచ్చారు. నేను ఎగ్జైట్ అయిన ఆఫర్ ఇది. అయితే రిమోట్ లొకేషన్ నుంచి పనిచేయాల్సి వచ్చింది. మిగతా టీం అంతా ఢిల్లీ ఆఫీస్ నుంచి వర్క్ చేసేవారు. దీంతో నా కమ్యూనికేష్ అంతా స్కైప్, స్లాక్ ద్వారా నడిచేది. కొన్ని రోజులకు ఇది నాకు, నా పనితీరుకు, నా ఆలోచనలకు సరైన పొజిషన్ కాదనిపించింది అంటారు ప్రదీప్ గోయల్.

నిజానికి ఒకే ఆఫీస్ స్పేస్ లో పనిచేసేవారికి ఆలోచనలు పంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. టీ, లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవచ్చు. ఇన్ ఫార్మల్ మీటింగ్స్ లో అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఇంకా అవసరం అనుకుంటే దగ్గర కూర్చుని పని చేయించుకోవచ్చు. 

సేమ్ నేను కూడా ఇలాగే.. కొన్ని చర్చల తర్వాత నాకు హెడ్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ కరెక్ట్ పొజిషన్ అని అంచనా వేసుకోవచ్చు. ఆ పొజిషన్ లో చేరి నా సామర్థ్యాన్ని స్టార్టప్ అభివృద్ధికి ఉపయోగించా"-ప్రదీప్ గోయల్ 

# నా లక్ష్యాలు, కంపెనీ లక్ష్యాలు సరిపోతాయా..?

ప్రతి ఉద్యోగికి చేస్తున్న పనిపట్ల ఎలాంటి స్పష్టత ఉంటుందో.. సాధించాల్సిన లక్ష్యాలపట్లే అంతే స్పష్టత ఉండాలి. అదే విధంగా కంపెనీ తన నుంచి ఆశిస్తున్న లక్ష్యాలేమిటి అనేదానిపైనా స్పష్టమైన అవగాహన ఉండాలి. వ్యక్తిగత లక్ష్యాల కన్నా సంస్థ ఆశిస్తున్న వాటిపైనే ఉద్యోగి దృష్టిపెట్టాలి. అవసరమైతే వ్యక్తిగత లక్ష్యాలను పోస్ట్ పోన్ చేసుకున్నా తప్పేం కాదు.

# ప్రావీణ్యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందా..?

నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఏ అంశాన్ని పూర్తిగా తెలుసుకోలేం. స్టార్టప్ లో మన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంమలోనే మనకు ఆసక్తి, స్కిల్స్ ఉన్న రంగాల్లో మరింత నేర్చుకోవడానికి అవకాశం పొందే విషయంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా పెంచుకుంటే మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. మరింత సమర్థంగా స్టార్టప్ కి సేవలు అందించవచ్చు. చేస్తున్న పని నుంచే ప్రావీణ్యం పెంచుకునే ప్రయత్నం చేయగలగాలి. ఆ అవకాశం లభిస్తుందో లేదో అంచనా వేసుకోవాలి.

# ప్రతిఫలం ఎలా ఉంటుంది..?

చివరిగా చెప్పుకుంటున్నా... ముఖ్యమైనది ప్రతిఫలం. ఈక్విటీ కానీ శాలరీ కానీ మన కంట్రిబ్యూషన్ కు అనుగుణంగా స్టార్టప్ నుంచి మనకు సంతృప్తికర స్థాయిలో ప్రతిఫలం వస్తుందో లేదో అంచనా వేసుకోవాలి. అయితే దీని గురించి చర్చను వీలైనంత త్వరగా ముగించాలి. వ్యక్తిగత సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే అంశాలలో ఇదే మొదట ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే స్టార్టప్ లో చేరే సమయంలో దీని గురించి చర్చించడం అనవసరం. మీ అవసరాన్ని గుర్తించి వారెంతో అఫర్ చేస్తారో.. దానికి ఓకే అయితే చేరిపోవడం మంచి లేదంటే...ఆఫర్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

చివరి మాట...

అన్నింటితో పాటు స్టార్టప్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ముందుగానే ఓ ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. మంచి టీమ్ తో పనిచేయడానికి మీరు సిద్ధపడి స్టార్టప్ లో చేరి ఉంటారు. కానీ తర్వాత మనకు సరిపడని వాళ్లు, పనితీరు నచ్చని వాళ్లు వచ్చి చేరితో మనకు అసౌకర్యం. ఇష్టం లేని వ్యక్తులతో పనిచేయడం దుర్భరం. అందుకే ఈ విషయంపైనా క్లారిటీతో ఉండాలి. స్టార్టప్ లో చేరే అవకాశం వచ్చినప్పుడు ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే మెమరబుల్ జర్నీగా ఉండొచ్చు.

As an IT engineering graduate... i am passionate to know about new and innovative ideas and explore them.....

Related Stories

Stories by SOWJANYA RAJ