మీరు ఏదైనా ఆర్డరివ్వండి.. చిటికెలో డెలివర్ చేసేస్తారు..

0


ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ మాధవన్ చెన్నై వెళ్లారు. జ్వరం వచ్చి హోటల్ నుంచి కదలలేని పరిస్థితి. చెన్నైలో తెలిసిన వారెవరూ లేరు. కనీసం టాబ్లెట్స్ తీసుకురాడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. సాయంకాలానికి హోటల్ మేనేజర్ సాయంతో ఎలాగోలా మాత్రలు తెప్పించుకొని రిలాక్స్ అయ్యాడు. అప్పుడు అనిపించింది.. ఇలాంటి సాయం అందించే వెబ్ సైట్ ఉంటే బాగుండని. కచ్చితంగా వర్కవుట్ అవుతుందని నమ్మకం కూడా కలిగింది. అలా మొదలైందే.. వీ డెలివర్‌ ప్రస్థానం .

“డెలివరీ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా.. మినిమం ఆర్డర్ అనే ప్రశ్న ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టా” శ్రీనివాస్.

వీడెలివర్ మొదటగా ప్రారంభించిన సర్వీస్ ఏంటంటే.. రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ని తీసుకురావడం. చెన్నైలో ఏ సమయంలో అయినా ఫుడ్ ఆర్డర్ ఇస్తే దాన్ని తెచ్చిపెట్టారు. ఇలా ఫుడ్ తెప్పించే ఓ రెగ్యులర్ కస్టమర్ కోల్ కతా వెళ్తూ.. విడెలివర్ టీం కి ఓ చీరను తీసుకొచ్చే బాధ్యత అప్పజెప్పాడు. అవసరమైతే సర్వీసు చార్జీలు ఇస్తామని రిక్వెస్ట్ చేశాడు. అలా అతని రిక్వెస్ట్ మేరకు చీరను0 డెలివరీ చేశారు. ఆ క్షణం నుంచి ఫుడ్ నుంచి ఇతర వస్తువుల సర్వీస్ కూడా మొదలు పెట్టారు. 

వీ డెలివర్ టీం

వీ డెలివర్ ఫౌండర్ శ్రీనివాస్ మాధవన్ సొంతూరు కడప. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలో బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్‌లో పనిచేశారు. తర్వాత వీ డెలివర్ స్టార్టప్ మొదలుపెట్టారు. ఎఎస్‌కె చైతన్య రెడ్డి కంపెనీ కి కో ఫౌండర్. మెకానికల్ ఇంజనీర్ అయిన చైతన్య.. ముంబైలో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇంజనీర్‌గా పని చేశారు. వీ డెలివర్‌ ఆపరేషన్స్ చూస్తున్నారు. 2014లో ప్రశాంత్ టీంలో కో ఫౌండర్ గా చేరారు. బిట్స్ పిలానీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన ప్రశాంత్‌ కు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో 12 ఏళ్ల అనుభవం. యూకే నుంచి వచ్చిన ప్రశాంత్ వీ డెలివర్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఇతర కీలక బాధ్యతలు తీసుకున్నారు. వీరితో పాటు 30మంది ఉద్యోగులున్నారు.

డాక్యుమెంట్ డెలివరీకి కేరాఫ్

తమిళనాడులోని చాలా ప్రాంతాల నుంచి వొడాఫోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను వీ డెలివర్ బట్వాడా చేస్తారు. కొరియర్ సర్వీసుకంటే నాణ్యమైన సేవలను అందిస్తున్న ఈ సంస్థ.. డాక్యుమెంట్లను అందించడంలో ముందుంది. ఐదు కిలోమీటర్ల లోపు ఒక ఛార్జ్, ఆపై ప్రతీ కిలోమీటర్‌కూ కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో కిలోమీటర్‌కు కనీసం రూ.10, బేస్‌ప్రైజ్‌కు అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ఐదు కిలోమీటర్లలోపు దూరం ఉంటే గంట సేపట్లో డెలివరీ చేస్తారు.

పూర్తిస్థాయి కొరియర్ కంపెనీగా మారడానికైతే వీ డెలివర్ సిద్ధంగా లేదు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లను అందించడంలో పోస్టాఫీస్ తర్వాత నమ్మదగిన కంపెనీ తమదేనని ఫౌండర్ శ్రీనివాస్ కాన్ఫిడెంట్‌గా చెబ్తున్నారు. తమ కంపెనీ పేరుతో గతంలో మరో స్టార్టప్ ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైందని.. అయితే అదిప్పుడు మూతపడిందని అంటున్నారు. 

భవిష్యత్ ప్రణాళికలు

నాలుగున్నరేళ్ల ప్రయాణంలో లక్షల సంఖ్యలో ప్రొడక్ట్స్ డెలివెరీ చేసిన అనుభవంతో యాప్ కల్చర్‌ని యడాప్ట్ చేసుకొని ముందుకు పోతోంది వీ డెలివర్. హైదరాబాద్, చెన్నై తోపాటు బెంగళూరులో సేవలను అందిస్తోంది. విశాఖపట్టణాని ఇటీవలే విస్తరించారు. ఆంధ్ర, తెలంగాణల్లో ఇతర చిన్న నగరాల్యలో సేవలు పెంచాలనే యోచనలో ఉన్నారు.

website

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories