ఐఏఎస్ కాబోయి మెంటార్‌గా మారి ఎంతో మందిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఓ యంగ్ ఇండియన్

ఉత్తరాఖండ్‌లో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన రితేష్ఐఏఎస్ కోసం ప్రిపరేషన్స్‌తో ప్రపంచ పరిజ్ఞానంపాఠాలు నేర్పే సమయంలో ఎదురైన ప్రశ్నతో మారిన జీవితంగ్రామాల్లో వెలుగులు నింపిన వ్యక్తులే రోల్‌మోడల్స్‌వారిని చూసి స్ఫూర్తి పొందేందుకే యువ ప్రేరణ యాత్ర

ఐఏఎస్ కాబోయి మెంటార్‌గా మారి ఎంతో మందిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఓ యంగ్ ఇండియన్

Thursday July 02, 2015,

3 min Read

యూత్‌లో స్ఫూర్తి నింపేందుకు ఏర్పాటు చేసిన.. యువ ప్రేరణ యాత్ర వ్యవస్థాపకుడు రితేష్ గార్గ్. హిమాలయాల్లోని పాదశ్రేణిలో ఐదు రోజులపాటు సాగే బస్సు యాత్ర ఇది. మూలాలు, పునాదుల స్థాయి నుంచి పని చేసేలా.. యువతలో స్ఫూర్తి నింపేందుకే ఈ యాత్ర అంటారు రితేష్.

నీరు పల్లం.. యువత పట్నమెరుగు !

రితేష్ ప్రయాణించేప్పుడు ఎదుర్కున్న అనుభవాలే యువ ప్రేరణ యాత్ర ప్రారంభించడానికి మూలకారణం. “నేనిక్కడ ప్రయాణించేప్పుడు గ్రామీణ ప్రాంతాలవారు చెప్పిన మాటలే కారణం. ‘కొండల్లోని నీరు, ఇక్కడ యువత ఎప్పటికీ ఈ ప్రాంతలకు ఉపయోగపడవు. కొండల్లోని నీరు పల్లపు ప్రాంతాలకు పారతాయి. ఇక్కడి యువతరం అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతారు. కేవలం తమ వార్ధక్యాన్ని గడిపేందుకే ప్రజలిక్కడికి వస్తార’ని అక్కడి జనాలు చెప్పేవారు. దీంతో నేను రెండింటినీ (యువత, ప్రకృతి వనరులు) కలిపి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయచ్చని భావించా. ఇప్పుడు మనం ప్రతీ పనికీ ఫలితాలు, ప్రతిఫలాలను ఆశించే కాలంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకోగలమని నిరూపించాల్సి ఉంది. ఒకసారి ఇది సాధ్యమేనని నిరూపిస్తే... అప్పుడు అందరూ ఇదే కోవలో ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచన కలిగించడానికి ప్రారంభమైనదే యువ ప్రేరణ యాత్ర”అంటున్నారు రితేష్.

రితేష్ జీవిత కథ అనేక మందికి స్ఫూర్తినిచ్చేలా సాగింది. రూర్కూ దగ్గరలోని ఓ పల్లెటూరు పుట్టిన ఈయన.. రెండో తరగతిలోనే డాగ్ హౌస్‌లు రూపొందించడం ద్వారా నిర్మాణం వైపు అడుగులు వేశారు. “కుక్కలకు నిర్మించే చిన్నపాటి ఇళ్లకు పైకప్పు తేలికగా ఉండేలా చూసేవాడిని. ఇలా చేస్తే ఒకవేళ రాత్రిపూట అది కూలి వాటిపై పడ్డా... దెబ్బ తగలదు. మా అమ్మకు అవంటే అలర్జీ. అయినా సరే నేను అదే పని చేసి దెబ్బలు తినేవాడిని. అఫ్‌కోర్స్.. ఇప్పటికీ అదే చేస్తున్నా”నంటారు రితేష్.

యాత్రీకులతో రితేష్ గార్గ్(ఎడమవైపు నిలబడ్డ వ్యక్తి)

యాత్రీకులతో రితేష్ గార్గ్(ఎడమవైపు నిలబడ్డ వ్యక్తి)


గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక... ఢిల్లీ వెళ్లిన రితేష్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించారు కూడా. “ఐఏఎస్‌కు సిద్ధమయ్యేందుకు ముందు వరకూ నాకు ప్రపంచ పటంలో జపాన్, జర్మనీ ఎక్కడుంటాయో తెలీదు. అయినా సరే పట్టుదలగా చదివి ఐఏఎస్ ఇంటర్వ్యూకు వరకూ చేరాను, కానీ ఈ స్టేజ్‌లో ఫెయిలయ్యాన”ని రితేష్ చెప్పారు.

కలలు చూపించడమేనా ? ఇంకేమైనా ఉందా ?

ఐఏఎస్ అటెంప్ట్స్ అయిపోయాక... రితేష్ క్యాట్‌కు ప్రిపేర్ కావడం ప్రారంభించారు. ఈ సమయంలోనే అతని జీవితం అనుకోని మలుపు తీసుకునే అనుభవం ఎదురైంది.

“నేను డెహ్రాడూన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. వారు జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించినపుడు... ఒకరు పోలీస్ అని, మరొకరు ఇంకోటని చెప్పేవారు. ఓ పన్నెండేళ్ల బాలిక మాత్రం పెద్దయ్యాక పెళ్లి చేసుకుని, పిల్లలను కని పెంచుతానని చెప్పింది. 'అన్నయ్యా, మీరు కొన్ని కలలను చూపిస్తున్నారు. ఇలాగే చెబ్తూ ఉంటారా? వీటిని సాకారం చేసుకునేందుకు మాకు ఏమైనా సాయంచేస్తారా ? అని కొన్ని రోజుల తర్వాత మరో బాలిక అడిగింది'. ఆమాటకు బిత్తరపోయి నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించా”నని చెప్పారు రితేష్.
image


భవిష్యత్తును మార్చిన ప్రశ్న

ఈ ప్రశ్న అతని జీవితాన్ని, భవిష్యత్తును మార్చేంది. ఎబిసిడిల నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్న రితేష్.. క్యాట్‌ను కేవలం రెండున్నర నెలల్లోనే 95శాతం పర్సెంటేజ‌తో పూర్తి చేయగలిగారు. ఐఏఎస్ చదువుతున్నపుడు ఆర్జించిన రాజకీయ పరిజ్ఞానంతో... ఏదైనా స్వచ్ఛంద సంస్థకు పనిచేసేందుకు వీలుగా ఉండడం కోసం... మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఫాకల్టీని ఎంచుకున్నారు రితేష్.

ఎంబీఏ పూర్తయిన తర్వాత జైపూర్ రగ్స్ కోసం పని చేసిన ఆయన వారి కార్యకలాపాలు ఉత్తర్ ప్రదేశ్‌లోనూ విస్తరించేందుకు సహాయపడ్డారు. కానీ ఇది ఎక్కువకాలం సాగలేదు. ఆ తర్వాత జాగృతి యాత్ర టీంలో భాగస్వామిగా మారి.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయాణాలకు సంబంధించిన విధులు నిర్వర్తించారు. ఈ యాత్రలో భాగంగా... ఏడాదిలో లక్ష కిలోమీటర్ల పాటు ప్రయాణించారు రితేష్. యువ ప్రేరణ యాత్రకు బీజం పడింది ఇక్కడే.

యువ ప్రేరణ యాత్ర ఇదే

కఠినమైన ఎంపిక విధానం ద్వారా పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేసి.. యువ ప్రేరణ యాత్రకు తీసుకువెళతారు. ఒకసారి సెలక్ట్ అయ్యాక గ్రామీణ ప్రాంతాలకు సేవ చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్తారు. స్వయం స్థిరత్వం సాధించేందుకు స్థానిక వనరులను ఎలా ఉపయోగించుకోవచ్చో.. తద్వారా సమాజంలో ఏ స్థాయిలో మార్పు తీసుకోవచ్చో వారికే అర్ధమయ్యేలా చేస్తారు.

ఈ యాత్ర అంతా కొండ ప్రాంతాల్లో కావడంతో రిస్క్ కూడా ఎక్కువే. యువ ప్రేరణ యాత్రలో పాల్గొనే వ్యక్తులను... ఆయా ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ముందుగా... రెండుసార్లు రెక్కీ నిర్వహిస్తారు. “కాలకృత్యాలు, ప్రకృతి అవసరాల కోసం కొన్ని ప్రాంతాలను ముందుగానే నిర్ణయించుకుంటాం. ప్రయాణ అలసట తెలియకుండా ఉండేందుకు ప్రతీ గంటన్నరా, రెండు గంటలకి ఓ మారు ఆగుతుంటాం. ఈ సమయాన్ని ఉపయోగించుకునేందుకు ఆ గ్రూప్‌లోని కొందరు ఛాంపియన్స్‌తో రాళ్లపై ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తాం. ”-రితేష్

యువ ప్రేరణ యాత్రలో పాల్గొనేందుకు కొంత మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా స్పాన్సర్ చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఫీజుగా ₹రూ. 4,500 చెల్లిస్తే సరిపోతుంది. హాఫ్ స్పాన్సర్డ్ వ్యక్తులు రూ. 11,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పూర్తిగా చెల్లించగలిగే సామర్ధ్యం ఉన్నవారు ₹17వేలు కట్టాలి. విదేశీయులు, ఎన్నారైలకు ఈ ఫీజు $300. యువ ప్రేరణ యాత్రలో స్పాన్సర్‌షిప్ విధానం కోసం సబ్సిడీ మోడల్‌ను అవలంబిస్తున్నారు రితేష్.

ఈ యాత్ర గురించిన మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి:

http://yuvaprernayatra.org