కబాలి టార్గెట్ రూ. 500 కోట్లు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కలైపులి కాన్ఫిడెన్స్

కబాలి టార్గెట్ రూ. 500 కోట్లు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కలైపులి కాన్ఫిడెన్స్

Friday July 01, 2016,

4 min Read

కబాలి. ఇప్పుడు వాల్డ్ వైడ్ టాపిక్. ఏ మాత్రం తగ్గని రజనీకాంత్ వేడిని, వాడిని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 'కబాలిలో రా.. ' అంటూ రజనీ చెప్పిన టీజర్‌ డైలాగ్ సెన్సేషన్ అయింది. అందుకే లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ 2 కోట్ల మందిని దాటింది. ఆడియో రైట్స్, మర్కండైజ్, ఎయిర్ ఏషియా ప్రత్యేక ఫ్లైట్లు, ఫ్లైట్లపై స్పెషల్ లివరీ వంటివన్నీ ఓ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ సినిమాతో భారత దేశ బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలవుతాయనేది కబాలి సినిమా ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను కాన్ఫిడెన్స్. క్రియేటివిటీ తనలో ఇన్‌బిల్ట్‌ అంటున్న టాప్ ప్రొడ్యూసర్.. ఓ చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు. బ్రాండింగ్, మార్కెటింగ్, ప్రమోషన్లలో ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైంది అంటున్నారు ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్‌, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్‌లో కింగ్ అనిపించుకున్నారు కలైపులి.

మీ బ్రాండింగ్ డిఫరెంట్‌గా ఎలా ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన మొదటి సమాధానం ఇది ''చిన్నప్పటి నుంచి నాలో క్రియేటివిటీ ఎక్కువ. స్కూల్లో ఉండగానే నాకు మ్యూజిక్, స్పీచ్ సహా చాలా కాంపిటీషన్లలో అవార్డులు దక్కాయి. ఆర్ట్స్ అంటే నాకు ముందునుంచే ఎందుకో చెప్పలేనంత అభిమానం. అదే నన్ను సినిమా పరిశ్రమవైపు మళ్లించింది. చాలా చిన్న వయస్సులోనే సినిమాలో డిస్ట్రిబ్యూటర్‌గా చేరాను'' అంటారు ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్.

image


ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కలైపులి చాలా పాత్రలే పోషించారు. డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటే చాలు అని అనుకోకపోవడం వల్లే చాలా ప్రయత్నాలు చేశారు. 'నేను చాలా సినిమాలకు పాటలు రాశాను. హిట్ అయిన చాలా సినిమాలకు క్యాచీ టైటిల్స్ ఇచ్చింది నేనే. స్టోరీ లైన్ ఇవ్వడం, స్క్రిప్ట్, డైలాగ్స్ కూడా రాశాను. ఆ పయనంలో ఉండగా 1978లో భైరవి అనే రజనీకాంత్ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అప్పట్లో రజనీ స్టైల్‌కు మతిపోయింది. అప్పుడే 'సూపర్ స్టార్' అనే టైటిల్‌ను ఆయన పేరుకు తగిలించాను. సూపర్ స్టార్ అనే పేరుతోనే పోస్టర్లు ముద్రించి, సిటీ అంతా అంటించాము. అది అప్పట్లో ఓ సెన్సేషన్'' అంటూ తన జర్నీని వివరించారు కలైపులి.

ఈ వయస్సులోనూ అంత చురుగ్గా మార్కెటింగ్,ప్రమోషన్, బ్రాండింగ్‌పై ఎలా దృష్టిసారిస్తారు అని అడిగితే.. ''నేను ఏదైనా ప్రాజెక్టులో ఉన్నానంటే ఇక రాత్రింబవళ్లూ దాని గురించే ఆలోచిస్తా. సృజనాత్మకంగా ప్రమోషన్ ఎలా ఉండాలి అనే ఆలోచనే ఉంటుంది. అది పోస్టర్ కావొచ్చు, ట్రైలర్ కావొచ్చు.. జనాల మనస్లులో నిలిచిపోవాలి. అది చూడగానే వాళ్లు సినిమాకు ఖచ్చితంగా వెళ్లేలా ఉండాలి. అందుకే మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్లకు నేను చాలా ప్రాధాన్యతనిస్తాను. క్రియేటివిటీ నా ఇన్‌బిల్ట్. అందుకే ఇది నాకు చాలా సులువైన పని. అన్నింటికంటే ముఖ్యంగా పరిమితికి మించని బడ్జెట్లో, ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా చేస్తాను'' అంటారు.

30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నారు కదా.. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అని అడిగినప్పుడు ''ఈ రోజుల్లో ఒకేసారి చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందుకే మన సినిమా వాటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉండేట్టు చూసుకోవాలి. వీటన్నింటితోపాటు ఎవరికీ నష్టం రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకే నా ఎడ్వర్టైజ్‌మెంట్లతో నా సినిమా ప్రత్యేకమని చెప్పకనే చెప్పి జనాలను థియేటర్లకు రప్పించాను. దాని వెంటే లాభాలు కూడా వచ్చాయి'' అంటారు.

సక్సెస్ సీక్రెట్ ఏంటి ?

''నేను ఇప్పటికీ ప్రతీ రోజూ ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేస్తాను. రొటీన్ వర్క్ మొదలుపెట్టి, ఈ రోజు నిన్నటితో పోలిస్తే ప్రత్యేకంగా ఏం చేయగలను అని ఆలోచిస్తాను. ఏదైనా పనిలో దిగితే ఇక ఇదే నాకు సర్వస్వం అనేట్టు కష్టపడతాను. అదే నా బలం. అంతే కాదు రాత్రి ఒంటి గంట వరకూ కష్టపడతాను కూడా''.

బ్రాండింగ్‌ ట్రెండ్ మొదలుపెట్టిందే ఈయనే !

'' కండుకొండేన్.. కండుకొండేన్ (ప్రియురాలు పిలిచింది) సినిమాను రాజీవ్ మీనన్ డైరెక్టర్ చేశారు. 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, తబ్బూ, మమ్ముట్టి వంటి స్టార్స్ ఉన్నారు. అప్పట్లోనే ఈ సినిమా కోసం ఫెయిర్ అండ్ లవ్లీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాళ్ల అడ్వర్టైజ్‌మెంట్లలో ఈ సినిమాను ట్యాగ్‌లైన్‌లా పెట్టుకున్నారు. సినిమాను ఓ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ వినియోగించుకుంటా. అదే నా సక్సెస్ సీక్రెట్'.


image


ఇక కబాలి గురించి

రజనీకాంత్‌తో 35 సంవత్సరాలకుపైగా అనుబంధం ఉన్నా ఎస్.తను ఇంతవరకూ ఓ పెద్ద సినిమా తీయలేదు. ఇద్దరికీ ఉన్న సాన్నిహిత్యంలో ఇప్పటికే చాలా సినిమాలు తీయాల్సి ఉన్నా ఎందుకనో మెటీరియలైజ్ కాలేదు అంటారు. ఆత్రపడకుండా అవకాశం కోసం ఎదురుచూశారు. కొద్దికాలం క్రితం రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి కబాలి కోసం తనతో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారట. ఆ క్షణాలను మరిచిపోలేను అంటారు కలైపులి ఎస్ తను.

అంత బిజినెసా.. నిజమేనా ?

ఇక వ్యాపారం విషయానికి వస్తే.. కబాలి అప్పుడే రూ. 200 కోట్లు వసూలు చేసిందని వస్తున్న వార్తలు నిజమేనా అని యువర్ స్టోరీ అడిగింది. ''సినిమా బ్రాండింగ్ పూర్తిగా భిన్నంగా చేశాం. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో సూపర్ స్టార్ రజనీ ఉన్నారు. అదే గొప్ప అసెట్' అంటారు.

కబాలీ సినిమాకు ఎంత హంగామా క్రియేట్ చేస్తోందో ఎయిర్ ఏషియాను చూస్తే అర్థమవుతుంది. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ సినిమా కోసం ఓ ఫ్లైట్ సంస్థ అఫిషియల్ ఎయిర్‌లైన్‌ పార్ట్‌నర్‌గా చేరింది. కస్టమైజ్డ్ ఇన్‌ఫ్లైట్ మెనూ, మూవీ మర్కండైజ్ వంటివి కూడా ఏర్పాటయ్యాయి. 'ఫ్లై లైక్ ఎ సూపర్ స్టార్' అనే ఆఫర్‌తో రూ. 786కే ఢిల్లీ, బెంగళూరు నుంచి డొమెస్టిక్ డెస్టినేషన్స్‌కు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది ఎయిర్ ఏషియా.

రజనీకాంత్‌పై తమ అభిమానానికి గుర్తుగా స్పెషల్ లివరీని ఎయిర్ ఏషియా రూపొందించింది. ఇది భారత సినిమాకు దక్కిన గౌరవం కూడా. తన రీబ్రాండెడ్ ఫ్లైట్‌ను ఎయిర్ ఏషియా ఆవిష్కరించింది.


image


ప్రత్యేక స్టిక్కర్స్‌తో కబాలి సినిమా, రజనీ ఫోటోలతో ఫ్లైట్‌ను ముస్తాబు చేశారు. భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో తిరిగే ఫ్లైట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి సినిమా చూసేందుకు చెన్నైకి వచ్చేలా కూడా ఈ విమానయాన సంస్థ ఏర్పాట్లు చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో చూసేందుకు వీలుగా ఐ5 అనే సంస్థ బెంగళూరు నుంచి చెన్నైకి ప్రత్యేక ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్లు +91 80 41158492/8493 ఈ నెంబర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.


image


అయితే మీడియాలో వస్తున్నట్టు అప్పుడే రూ. 200 కోట్ల బిజినెస్ జరిగిందనే విషయాన్ని మాత్రం ఎస్.తను ధృవీకరించలేదు. ''బిజినెస్ ఇప్పుడే మొదలైంది. యూఎస్ఏ రైట్స్‌ను రూ.8.5 కోట్లకు అమ్మాం, ఆస్ట్రేలియా రైట్స్ రూ.1.65 కోట్లకు విక్రయించాం. వివధ దేశాలు, రాష్ట్రాలతో ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా కబాలికి ఈ సారి నా బాక్సాఫీట్ టార్గెట్ రూ. 500 కోట్లు. సినిమాలో రజనీ ఉండడం, అనుకున్నదానికంటే సినిమా అత్యద్భుతంగా రావడంతో ఈ భారీ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రికార్డులన్నీ బద్దలు చేయడం ఖాయం '' అంటూ ధీమాగా చెబ్తున్నారు ఎస్.తను.

చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ఏం చెబుతారు ?

''ఏదైనా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు అందులో జీరో స్థాయి నుంచి ప్రతీ అంశాన్నీ తెలుసుకోండి. వ్యాపార స్వభావమేంటో పూర్తిగా ఆకళింపు చేసుకోండి. ఆ తర్వాత మెంటర్స్‌ను ఫాలో అవండి. డబ్బు సంపాదన ఒక్కటే విజయానికి తార్కాణం కాదు. మన అనుభవం, మన అంకితభావమే మనల్ని నష్టాల నుంచి గట్టెక్కిస్తాయి'' అంటూ ముగించారు కలైపులి ఎస్. తను. 

ఇంటర్వ్యూ - ఇందుజా రఘునాధన్