అభాగ్యురాలికి అన్నీ తానై నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు

అభాగ్యురాలికి అన్నీ తానై నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు

Thursday July 06, 2017,

1 min Read

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలో అమ్మానాన్న, చెల్లెళ్లను కోల్పోయి అనాధగా మిగిలిన లక్ష్మీ ప్రసన్న అనే యువతికి ఏపీ సర్కారు అండగా నిలిచింది. ఆ కుటుంబంలో మిగిలిన ఒక్క‌గానొక్క ఆడ‌బిడ్డ‌కు ధైర్యంగా నిలిచారు సీఎం చంద్రబాబు. ఆ అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రిగా ఒక బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఆమె బ్యాంకు ఖాతాలో రూ.20లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా రిజర్వ్‌ చేసి మెంటరింగ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా తండ్రిగా నేనున్నా అనుకో అని ఆమెకు చంద్రబాబు ప్రసన్నకు ధైర్యం చెప్పారు. ఆమె భవిష్యత్ తీర్చి దిద్దే బాధ్యత తనదే అని అన్నారు.

image


ఏపీ సీం చంద్రబాబుని కలవలేకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునేదాన్ని అని ప్రసన్న ఉద్వేగ స్వరంతో చెప్పింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడనది కోరుకుంది. చంద్రబాబు ఇచ్చిన భరోసారతో అమ్మాయి పెద్ద చదువులు చదువతానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అమ్మ కోరిక మేరకు ఐఐఎంలో చేరి మేనేజ్ మెంట్ కోర్స్ చేస్తానని తెలిపింది.

కొద్ది రోజుల కిందట అనంతరపురం జిల్లాలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక, భార్య పిల్లల్ని నరికి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లని అతి కిరాతకంగా చంపాడు. సుత్తి తీసుకుని తలమీద కొట్టాడు. చిన్నారులు ఎంత పెనుగులాడినా వినకుండా స్క్రూడైవర్ తీసుకుని తలమీద గుచ్చిగుచ్చి చిత్రహింసలు పెట్టి చంపాడు. ఆ రోజు ప్రసన్న తిరుపతిలో ఉండటంతో తండ్రి చేతిలో చావు నుంచి తప్పించుకుంది. 

ఆవేశంలో తండ్రి చేసిన తప్పుకి ప్రసన్న ఒంటరిదైంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నన్నపనేని రాజకుమారి, అమ్మాయి బంధువులు ఓదార్చి ధైర్యం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సాయంతో చంద్రబాబుని కలిసి తన గోడు చెప్పుకొని విలపించింది. చంద్రబాబు పెద్దమనసుతో ఆడపిల్లకు కొండంత అండగా నిలాచారు. తండ్రిలాంటి బాధ్యత తీసుకుని ఆమె జీవితాన్ని తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు.