ఒరాకిల్‌కు గుడ్‌బై చెప్పి స్టార్టప్స్ బాటపట్టిన మాన్సీ గాంధీ

ఒరాకిల్ జాబ్ టూ సీరియల్ స్టార్టప్స్ఐపోన్ యాప్‌ల వరస విజయాలతో హైదరాబాదీ అమ్మాయి సంచలనంసౌండ్ బాక్స్ యాప్‌తో ‌ లక్ష డౌన్ లోడ్ల సూపర్ సక్సెస్లేడీ ఆంట్రప్రెన్యూర్లకు స్ఫూర్తిగా మాన్సీ గాంధీడాక్టర్ సీ యాప్‌తో మూడో స్టార్ట్ అప్

ఒరాకిల్‌కు  గుడ్‌బై చెప్పి స్టార్టప్స్ బాటపట్టిన మాన్సీ గాంధీ

Wednesday June 24, 2015,

5 min Read

మాన్సీ గాంధీ... వరస ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లతో దూసుకుపోతున్న యంగ్ లేడీ.. ! ఇప్పుడు ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై డాక్టర్ సీ అనే మరో యాప్‌తో ముందుకు వచ్చింది..

డాక్టర్ సీ అనే సంస్థను స్థాపించడమే కాకుండా..దానికి ఆపరేషన్స్ చీఫ్‌గా పని చేస్తున్న మాన్సీ గాంధీ.. 2009లో స్నేహితులతో కలసి తన మొదటి వెంచర్ ప్రయత్నాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాన్సీ కుటుంబ నేపధ్యం కూడా బిజినెస్ రంగానికే చెందినది కావడంతో ఈ రంగంలో సులువుగా ఇమిడిపోయారు. వ్యక్తిత్వం వికాసం, సొంత ఆలోచనలు, స్వేఛ్చగా జీవించే తత్వం అలవడటంలో విద్యారణ్య హైస్కూల్లో గడిపిన రోజులు బాగా దోహదపడ్డాయని చెప్తారామె. ప్రతీ అంశంలో ప్రశ్నించే తత్వం తనకు అక్కడే అలవడిందంటారు.

మానసీ గాంధీ - డాక్టర్ సీ వ్యవస్థాపకురాలు

మానసీ గాంధీ - డాక్టర్ సీ వ్యవస్థాపకురాలు


వ్యక్తిత్వానికో రూపమిచ్చిన బాల్యం..తల్లిదండ్రుల ప్రోత్సాహం

బాల్యంలో ఎక్కువ సైన్స్ ప్రయోగాలు చేస్తూ ల్యాబుల్లో గడపడం, అడ్వంచరస్ గేమ్స్ ఆడటంతోనే సమయం గడిపేదాన్నని మాన్సీ గుర్తు చేసుకుంటుంది. అలానే క్రియేటివ్ ఆర్ట్స్‌లో కూడా మంచి ప్రవేశం ఉంది తనకి. సంగీతం,పెయింటింగ్ వంటి లలిత కళలు నేర్చుకోవడంలో తన తల్లి ఎంతగానో ప్రోత్సహించేవారని చెప్తారామె. ఆమె ప్రోత్సాహంతోనే తన వ్యక్తిత్వంలో సృజనాత్మకతను, కొత్తగా ఏదైనా చేసే తత్వం అలవడిందని వివరిస్తారు. 

" మా నాన్నగారు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేసేవారు. వింగ్స్ ఇన్ఫో నెట్‌ను ఆయనే స్థాపించారు. ఆయన నుంచే నేను బిజినెస్‌కు సంబంధించిన అనే మెళకువలు, వ్యాపారంలో మిగిలినవారితో ఎలా మెలగాలి, అసలు లైఫ్ అంటే ఏంటో కూడా నాన్న దగ్గర్నుంచే నేర్చుకున్నా. నాకు చిన్నప్పట్నుంచే నేనో బిజినెస్ ఆంట్రప్రెన్యూర్ అవుతానని ఓ నమ్మకం" అని గుర్తు చేసుకున్నారు మాన్సీగాంధీ

వెంచర్ ప్రారంభించడానికి ముందు ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ అప్లికేషన్స్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఐతే ఐఫోన్ యాప్స్‌పై పరిశోధనలు చేస్తూ... ఏదైనా కొత్తగా పని చేయాలనే తపన మాత్రం అప్పట్నుంచీ మాన్సీకి ఉండేది. అలా ఆమె వెబ్ మైంక్స్ అనే ఫస్ట్ స్టార్టప్ ప్రారంభించారు. అక్కడ ఐఫోన్, ఐపోడ్ కు అలా చాలా మొబైల్ యాప్స్ తయారు చేశారు.. "అప్పట్లో యూట్యూబ్‌కు మేం తయారు చేసిన సౌండ్ బాక్స్ అనే యాప్‌కు మంచి స్పందన లభించింది. అది మా ప్రొడక్ట్ అని చెప్పుకోవడానికి ఇప్పుడూ గర్వపడతాం" అని మాన్సీ గాంధీ చెప్తారు. సౌండ్ బాక్స్ అనే ఐపోడ్ యాప్.. నెట్ ప్రపంచంలోని ఫ్రీ మ్యూజిక్‌ను కలెక్టివ్‌గా అందించే యాప్. లక్ష డౌన్ లోడ్స్ తో సూపర్ సక్సెస్ సాధించిందా మొబైల్ యాప్..

మొదటి యాప్ సక్సెస్ తర్వాత తన భర్త నెహర్‌తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో లో స్లీపీ హెడ్ పేరుతో రెండో వెంచర్ ప్రారంభించారు మానసి. మొబైల్ యాప్స్ మాత్రమే కాకుండా.. షార్ట్ ఫిల్మ్‌తో పాటు గ్రీన్ బండిట్స్ అనే ఫీచర్ ఫిల్మ్ కూడా రూపొందించారు మాన్సీ. దాని గురించి మాట్లాడుతూ "80మందితో కలిసి గ్రీన్ బండిట్స్‌ను నిర్మించాం. రెండేళ్లపాటు సాగిన ఈ చిత్రనిర్మాణం మరిచిపోలేని అనుభవం మిగిల్చింది. ఓ స్టార్టప్‌కి సినిమా నిర్మాణానికి ఎంత పోలిక ఉందో తెలిసి వచ్చింది" అని చెప్పారు

ఇప్పటికే రెండు స్టార్టప్ వెంచర్లు చేసిన మాన్సీ. .తన పైప్ లైన్ లో మూడో స్టార్టప్ కూడా ఉంచారు. అదే ' షౌట్ '.. దీనితోనే పూర్తి స్థాయి ఆంట్రప్రెన్యూర్‌గా మారారామె. షౌట్ ప్రారంభించిన తర్వాతే ఒరాకిల్ లో ఉద్యోగం వదిలేశారు మాన్సీ..అంతకు ముందు రెండు సంస్థలు ప్రారంభించినా జాబ్ మాత్రం వదల్లేదు.. షౌట్ తర్వాతే ఇండియాకు తిరిగి వచ్చేశారు

డాక్టర్ సీ ఏర్పాటైన తర్వాత చాలా హ్యాపీ మూమెంట్స్ చోటు చేసుకున్నాయని చెప్పారు మాన్సీ గాంధీ. భారత ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేది మాన్సీ బలమైన కోరిక. ఆ కోరికే టెక్నాలజీని వాడుకుని డాక్టర్ సీ అనే యాప్ తయారు చేేసేలా చేసింది మాన్సిని. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో తనకి ఉన్న అనుభవం.. హెల్త్ కేర్ ప్రొవైడర్లకూ..కామన్ యూజర్లకూ ఇద్దరికీ ఉపయోగపడే ఓ మోడల్‌ను తయారు చేయడానికి ఉపయోగపడిందంటారామె.

టెక్నాలజీ+ ఇంజనీరింగ్ =మొబైల్ యాప్ సొల్యూషన్

టెక్నాలజీ...బిల్డింగ్..( ఇంజనీరింగ్) మోడల్స్... ఇవంటే మాన్సీ గాంధీకి ప్యాషన్. ఇంజనీరింగ్ అనేది చాలా సమస్యలను సాల్వ్ చేయడానికి ఓ లాజికల్, అనలిటికల్‌గా ఆలోచించి ఓ ఫ్రేమ్‌వర్క్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ఆమె నమ్మకం. అసలు టెక్నాలజీని, ఇంజనీరింగ్‌ను ఎవరైనా ఎందుకు ప్ర్రేమించరని ప్రశ్నిస్తారు మాన్సీ. కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఎలక్ట్రిక్ కార్స్, మిషన్ టూ మార్స్. ఇలాంటి ప్రతీ అంశమే ఇంట్రస్టింగ్‌గా అన్పిస్తుందని మాన్సీ చెప్తారు. ఇదే మానసి గాంధీ నమ్మే సూత్రం

ఆరంభంలో సవాళ్లు

అందరు ఆంట్రప్రెన్యూర్లలానే..మాన్సీకి కూడా.. బిజినెస్‌ను బిల్డప్ చేయడంలో..దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు. వాటన్నింటిలో పెద్దది. సరైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడమే పెద్ద సవాలుగా తోచిందన్నారు మాన్సీ. ఓ మహిళ ఆంట్రప్రెన్యూర్ అయినప్పుడు ఉండే ఇబ్బందులు సరేసరి..

" లింగ వివక్ష, వీళ్లేం చేస్తార్లే అనే ఓ ముద్ర వేయడం..సాధారణంగా ఈ రంగంలో మేం ఎదుర్కొన్న సవాళ్లు..వాటిలో నిజానిజాలెలా ఉన్నా.. నేనూ నా భర్త మా పని మేం చేసుకుపోయేవాళ్లం. ఎక్కడ ఎవరిని కలవడానికి వెళ్లినా ఓ విషయం గమనించేదాన్ని. నేను ఇంకో మేల్ ఎగ్జిక్యూటివ్ కలిసి నెగోషియేషన్స్ కి వెళ్లినా..నా ఉనికినే పట్టించుకునేవాళ్లు కాదు. నేను ఎప్పుడైతే గొంతు విప్పి మాట్లాడతానో..అప్పుడే నేనోదాన్ని ఉన్నానని పట్టించుకున్నట్లు ప్రవర్తించేవాళ్లు..."

మానసీ గాంధీ

మానసీ గాంధీ


ఈ పరిణామాలు మొదట్లో మాన్సీని బాగా బాధపెట్టేవి. ఐతే ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేయడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్తారు మాన్సీ. డిప్లమేటిక్‌గా బిహేవ్ చేయడం, సహనం కోల్పోకపోవడం అలాంటి పరిస్థితుల నుంచి బైటపడటానికి సాయపడతాయని చెప్తారు. "ఇప్పుడు మహిళలు చాలా ముందంజ వేశారని చెప్తున్నారు కానీ, మన దేశంలో మహిళలను కూడా పురుషులతో పాటు సమానంగా చూడాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఆడవారిని ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఇంకా సమయం పడుతుంది" అని మాన్సీ గాంధీ తన అనుభవాలను పంచుకున్నారు. బయట అంశాలను పక్కనబెడితే..మాన్సీ గాంధీ ఇంట్లోకానీ..కంపెనీలోనూ ఆమె మాటకు తిరుగులేదని చెప్పొచ్చు..

తాను ఎదుర్కొన్న అనుభవాలతో మానసి..తన కంపెనీలో టాప్ సిక్స్ పొజిషన్స్‌లో మూడింటిని మహిళలకే కేటాయించారు. అసలు మొత్తం ఈ రంగంలో మహిళల ఉద్యోగితా శాతం 14. కంపెనీ బోర్డుల్లో సగం మంది మహిళలకే చోటు కల్పించాలంటారు. కానీ ప్రస్తుతం బిజినెస్ రంగంలో మహిళలు 6 శాతానికే పరిమితమైందని ఆవేదనగా చెప్పారామె.." ఎటువంటి వివక్షా లేకుండా అది ఆడా,మగా..లేక ఎల్జీబీటీనా( లెస్బియన్, గే,బైసెక్సువల్, ట్రాన్స్ జండర్ ) అనే వివక్షా లేేకుండా ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం" అని మానసి చెప్పారు

ఓ ఆంట్రప్రెన్యూర్‌గా ఎవరూ ఉపయోగపడవని చెప్పినవాటి నుంచి..ఏదైనా కొత్తగా తయారు చేయడం..గర్వంగా ఉందంటారు ఆమె.. ఐతే దీనికి చాలా ప్యాషన్ కావాలంటారు.. కష్టపడే తత్వం, సృజనాత్మకత ఉన్నప్పుడే ఇది సాధ్యమంటారు" ఎన్నో ఒత్తిళ్లు..సవాళ్లను వృత్తిలోనో..వ్యాపారంలోనో ఓ భాగంగా భావించినప్పుడే అందులోని మజాను ఆస్వాదిస్తామని మానసి చెప్తారు. డాక్టర్ సీ అనే యాప్ కోసం ఓ కొత్త మార్కెట్ ను క్రియేట్ చేయడం, డయాగ్నోసిస్ సెంటర్లతో టై అప్ పెట్టుకోవడానికి తెలివితేటలు కావాలంటాారామె. ఐతే ఓసారి డాక్టర్ సీ మోడల్ సమర్ధవంతంగా వివరించడం మొదలుపెట్టిన తర్వాత.. ఒప్పందాలు సులభంగా కుదిరిపోయాయంటారు.." చాలా పెద్ద సంఖ్యలో మెడికల్ టెక్నీషియన్స్ తో ఈ సందర్భంగా కలిసి పనిచేయడం ఓ ఛాలెంజింగ్ ఎక్స్ పీరియెన్స్ " అని మానసి చెప్పారు..

మహిళా ఎంట్ర్రప్రెన్యూర్ల కోసం

" మీరు పని చేస్తున్నప్పుడు మీరో ఎంట్రప్రెన్యూర్ అని మాత్రమే గుర్తుంచుకోండి..మహిళా ఎంట్రప్రెన్యూర్ గా కాదు.." అని సాటి మహిళా ఎంట్రప్రెన్యూర్లకు మానసి గాందీ చెప్తారు


ఆలోచనల నుంచి మహిళ,పురుషుడు అనే అంశాన్ని తొలగిస్తే చాలు..మిగిలిన సమస్యలన్నిటికీ వాటంతట అవే పరిష్కారాలు లభిస్తాయని మాన్సీ నమ్ముతారు. అలానే మన ఆలోచనలు, ఆశయాలను సపోర్ట్ చేసే వ్యక్తులు, వ్యవస్థ మనం దీర్ఘకాలం మనగలగడానికి దోహదం చేస్తాయంటారు. "నాకు తెలిసి చాలా మంది మహిళలకు అటు ఇంటి పనులను చక్కబెట్టుకోవడం, ఆఫీస్ పనులను చూసుకోవడం కష్టంగా మారుతుంది. నా వరకూ చూస్తే..నా భర్త నెహర్ (ఈయనే డాక్టర్ సీ సహవ్యవస్థాపకుడు) సహకారం ఎనలేనిది. ఆయన ఇంట్లో..ఆఫీస్‌లో సమానంగా సహకరిస్తారు కాబట్టే..ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయ్. " అని మానసి చెప్పారు

ఈ ఆరేళ్ల విజయాల పరంపరలో మూడు అంశాలు తనకి బాగా కలిసి వచ్చాయని చెప్తారు.. టీమ్, వర్క్ కల్చర్, వేగం....ఓ గొప్ప కంపెనీని తయారు చేయాలంటే అందుకు తగ్గ టీమ్ ని ఎఁపిక చేసుకోవడంతో అది ప్రారంభమవుతుందని మానసి విశ్వసిస్తారు.. అలాంటి నిబద్దత,నిజాయితీ మంచి లక్షణాలు కలిగిన ఉద్యోగులే మంచి పని వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు..దాని తర్వాత చేసే పనిలో వేగం..వచ్చిన ఐడియాలను ఎంత వేగంగా మనం అమలు చేశామన్నదే బిజినెస్ లో తర్వాత స్టేజ్ కు త్వరగా తీసుకెెళ్తుందన్నది ఆమె చెప్పే మాట..

మరి మాన్సీ గాంధీ విజయాల పరంపర చూసిన తర్వాత మీలో కూడా ఏదైనా సాధించాలనే ఆసక్తి కలిగితే ఈ స్టోరీ మిమ్మల్ని ఎలా ఉత్తేజితులను చేసిందో మాకు రాయండి..మీకు తెలిసిన మీ సర్కిల్ లో ఎవరైనా మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఉంటే మాతో వారి వివరాలు పంచుకోండి..