నిజం.. ఈ కుర్చీలో కూర్చుంటే ఏ జబ్బూ దరికిరాదు..

నిజం.. ఈ కుర్చీలో కూర్చుంటే ఏ జబ్బూ దరికిరాదు..

Sunday March 06, 2016,

3 min Read

                            


కూర్చుంటే భూత కాలంలోకో...భవిష్యత్ కాలంలోకో తీసుకెళ్లే కుర్చీల గురించి ఫాంటసీ కథల్లో, సినిమాల్లో చూసుంటాం. కానీ ఈ కుర్చి మాత్రం అలాంటి ఫాంటసీ కాదు. రియల్.. హండ్రెస్ పర్సంట్ రియల్. దేశంలో టెక్నాలజీ విప్లవం ప్రారంభమైన తర్వాత యువతకు వాటిల్లో జాబ్ సంపాదించడమే ప్రధాన టార్గెట్. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి అడుగుపెడితే లైఫ్ స్టైలే మారిపోతుంది. ఐదు రోజులు కష్టపడటం రెండు రోజులు కరో కరో జల్సా. అయితే ఈ "కష్టపడటం" అంతా మైండ్ తోనే. శారీరకమైన కష్టం ఇసుమంత కూడా ఉండదు. కడుపులో చల్ల కదలకుండా పని చేసుకుంటారు. దానికి తోడు గంటకోసారి పిజా, బర్గర్లు. ఇక ఒంట్లో చేరే రకరకాల కొవ్వులు బయటకుపోయేదెలా..

ఎక్కువ సేపు కూర్చువడం వల్ల బ్యాక్ పెయిన్..!

శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం..!

కొవ్వు పెరగడం వల్ల స్థూలకాయం ..!

బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు..!

ఇలా చెప్పుకుంటే టెక్నాలజీ కంపెనీల్లో పనిచేసేవారికి వచ్చే ఆరోగ్య సమస్యలు మరే ఇతర రంగంలో పనిచేసేవారికి రావు. వీటి వల్లే ఐటీ కంపెనీల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అనేక పరిశీలనల్లో వెల్లడయింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే లక్ష్యంతోనే "హెల్త్ ఛైర్" కి రూపకల్పన చేశారు HOD.life వ్యవస్థాపకులు. ఈ హెల్త్ ఛైర్ తో శరీరంలో ప్రారంభదశలో ఉన్న రోగాలేంటో.. వాటికి మందులేమిటో... డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తే వారి అపాయింట్మెంట్.. ఇలా అన్నీ పనులను చక్కబెట్టుకోవచ్చు. హెల్త్ చైర్ తో వెయిట్, ఫ్యాట్, బీఎంఐ, లంగ్ ఫంక్షన్, బ్లడ్ సుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఈసీజీ సహా 20కిపైగా టెస్టులు చేసుకోవచ్చు.

కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఎన్నో చేస్తున్నాయి. అయితే అవన్నీ "హెల్త్ ప్లాన్" ల దగ్గరే ఆగిపోతూంటాయి. ఏదైనా అవసరం వస్తే ఉద్యోగులు ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే. ఈ పరిస్థితి చూసిన అంకిత్ కంబాటి చేసిన ఆలోచనే HOD.life వ్యవస్థాపనకు దారి తీసింది. ముంబైలో గత ఏడాదే దీన్ని ప్రారంభించారు.

               హెల్త్ ఛెయిర్ <br>

               హెల్త్ ఛెయిర్


మేకిన్ ఇండియా హెల్త్ ఛైర్

ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఏదైనా చేద్దామనుకుంటున్న అంకిత్ కంబాటికి ప్రొడక్ట్ డిజైనర్ అభిజిత్ కుమార్ నాప్ కిన్ పై డిజైన్ చేసిన కుర్చీ భలే నచ్చేసింది. ఆరోగ్యాన్ని ప్రసాదించే కుర్చీగా దాని నమూనాను తయారు చేయడానికి మాత్రం పది నెలల సమయం తీసుకున్నారు. ఇక ఆ కుర్చీతోనే "HOD.life స్టేషన్" లను ప్రారంభించారు. క్వాలిఫైడ్ ఫిజీషియన్ అవసరం లేకుండానే ఆ కచ్చితత్వానికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ కుర్చీ హెల్త్ టెస్టుల రిపోర్టులు అందిస్తుంది.

కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఆయా కంపెనీల్లోనే HOD.life హెల్త్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి హెల్త్ స్టేషన్ లోనూ ఓ పైలట్ ఉంటాడు. అతను కుర్చీని ఆపరేట్ చేస్తాడు. అన్ని టెస్టులు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో పూర్తయిపోతాయి. ఈ రిపోర్టులన్నింటినీ యాప్ కి లింక్ చేసేస్తారు. టెస్టులు చేయించుకున్న ఉద్యోగి యాప్ డౌన్ లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. టెస్టులను యాప్ అనాలసిస్ చేసి... ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో... ఏ విషయంలో డాక్టర్ ను సంప్రదించాలో... ఎలాంటి పోషకాహారం వాడాలో సూచిస్తుంది. డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉంటే వెంటనే... ఆయా స్పెషలైజ్ కేటగిరిలో అంటుబాటులో ఉన్న డాక్టర్లను కూడా యాప్ సూచిస్తుంది. వెంటనే వారికి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ ఖరారు చేసుకోవచ్చు. బలవర్ధక ఆహారం తీసుకోవాలని హెల్త్ చైర్ సజెస్ట్ చేస్తే... వాటిని ఆన్ లైన్ లో నే కొనుగోలు చేసేందుకు యాప్ లో అవకాశం ఉంది. ఇలా హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా అన్నీంటికి ఒక్క కుర్చీతోనే పరిష్కారం చూపుతున్నారు HOD.life రూపకర్తలు. ప్రతి యూజర్ కి పర్సనల్ హెల్త్ స్కోర్ ను HOD.life అందిస్తుంది. దీన్ని MEW ( మోటివేషన్ ఎంగేజ్ మెంట్ వెల్ బీయింగ్ ) స్కోర్ గా వ్యవహరిస్తారు. ఈ స్కోరుతోనే యాప్ ఎప్పటికప్పుడు యూజర్ ని అలర్ట్ చేస్తూ ఉంటుంది.ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే ఆరు MNC కార్పొరేట్ కంపెనీల్లో హెల్త్ స్టేషన్లను ప్రారంభించారు.

image


' ప్రతి హెల్త్ స్టేషన్ లోనూ హెల్త్ డేటా ఉంటుంది. యూజర్ల వెయిట్, ఫిట్ నెస్, మానసిక ఆరోగ్యం, ఇతర రోగాలను మేనేజ్ చేయడానికి మాదైన పద్దతిలో సహకరిస్తాం.HOD.life హెల్త్ స్టేషన్ లో ఎకౌంట్ ప్రారంభించడం ఫేస్ బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసుకున్నంత సులువు"-అంకిత్ కంబాటి, HOD.life ఫౌండర్

ఒప్పందం చేసుకోని కంపెనీల ఉద్యోగులకూ HOD.life హెల్త్ స్టేషన్ సేవలందిస్తోంది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే కూపన్లతోనే హెల్త్ చైర్ సేవలు తీసుకోవచ్చు. అవి లేకపోతే HOD.life లో అకౌంట్ రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది చివరికల్లా కనీసం రెండు వందల కార్పొరేట్ కంపెనీల్లో ఈ హెల్త్ చైర్ ను పెట్టాలని HOD.life టీం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు లక్షల మంది యూజర్లు...వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తోంది.

మార్కెట్ చాలా పెద్దది

2020 కల్లా ఇండియా హెల్త్ కేర్ రంగంలో సాఫ్ట్ వేర్ వాటా మార్కెట్ 10 నుంచి 12 బిలియన్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో హెల్త్ కేర్ రంగంలో స్టార్టప్స్ అనూహ్యంగా పెరిగాయి. ఎంత వినూత్నంగా ఆలోచిస్తే అంత మార్కెట్ . ఆ విషయంలో HOD.life ఒకడుగు ముందుకు వేసింది.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి