నాన్నకు ప్రేమతో అంటున్న ‘నిర్మలా కాన్వెంట్’ కుర్రాళ్ల కధ

నాన్నకు ప్రేమతో అంటున్న ‘నిర్మలా కాన్వెంట్’ కుర్రాళ్ల కధ

Tuesday September 13, 2016,

4 min Read


యాక్టర్ కొడుకు యాక్టరయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. హీరో కొడుకు హీరో అయ్యాడు. తరం మారింది అంతే.. లెగసీ మారలేదు. యాటిట్యూడ్ మారలేదు. నిర్మల కాన్వెంట్ పేరుతో తెలుగులో వస్తోన్న ఓ సినిమాలో వారసుల లాంచింగ్, రీలాంచింగ్ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో హీరో, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు పేర్లూ రోషనే. అయితే ఇది కాకతాళీయమే అయినప్పటికీ సినిమా సక్సెస్ కి ఈ ముగ్గురి పాత్ర ఉపయోగపడం విశేషం.

image


నాన్న ప్రోత్సాహంతోనే

“సినిమా స్టోరీని రైటర్ జీకే నాన్నగారికి వినిపించారు. తర్వాత నన్ను ఇందులో హీరోగా తీసుకుంటానని అన్నారు. అదే విషయం నాన్న నాతో చెప్పారు,” రోషన్

ఇలా రోషన్ హీరో అయిపోయాడు. అయితే ఇది యాక్సిడెంటల్ గా కనిపించినప్పటికీ, మనం స్క్రీన్ పై చూసే పెర్ఫార్మన్స్ రావడానికి మాత్రం చాలా కష్టపడ్డానని అంటున్నారు. సినిమాకి ముందు పది పదిహేను రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. కాన్వెంట్ లో జరిగే కధ కాబట్టి తనకు దగ్గరగా ఉండటం.. తాను బయట ఎలా ఉన్నాడో యాక్టింగ్ లో అలా ఉండటానికి ట్రై చేశానని రోషన్ చెప్పుకొచ్చాడు. హార్డ్ వర్క్ చేయాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారని రోషన్ అన్నాడు. అమ్మ ఊహా కూడా నటే. అలా అమ్మ నాన్నల లెగసీని కొనసాగించడమే తన ముందున్న లక్ష్యమన్నాడు.

“సినిమా కమర్షియల్ హిట్ ని నిర్ణయించేది హీరోనే,” రోషన్

స్క్రిప్ట్ పరంగా సినిమా బాగుండొచ్చు. కానీ కలెక్షన్స్ రావాలంటే హీరోని బట్టే ఉంటుందని రోషన్ అంటున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలను చూస్తూ పెరిగిన తనకు హీరోగా ఇది మొదటి సినిమా కావడం.. దానిలో నాగార్జున లాంటి పెద్ద హీరో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. హీరోతో పాటు స్క్రీన్ పై ఉండే యాక్టర్లంతా సమపాళ్లలో నటిస్తేనే సినిమా కమర్షియల్ హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

image


సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా కష్టమైన పని

మన సినిమాలు గతంలో లాగా లేవు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ టేస్ట్ కు తగినట్లు మ్యూజిక్ అందిండంలోనే అసలు సత్తా బయటకు వస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ అన్నాడు. మెలోడీ మేస్ట్రో కోటి అబ్బాయి అయిన రోషన్ కి ఇది రెండో సినిమా. ఇప్పటికే మ్యూజిక్ మార్కెట్ లో రిలీజై మంచి రెస్పాన్స్ వచ్చింది.

“కొన్ని మ్యూజిక్స్ వినిపించి అలాంటి ట్యూన్స్ కావాలని మ్యూజిక్ డైరెక్టర్లను డిమాండ్ చేసే కాలం ఇది” రోషన్

అలాంటి సమయంలో మ్యూజిక్ కాపీ అనేది చాలా సింపుల్ అవుతోంది. అంతకంటే మంచి సంగీతం అందించే టాలెంట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరున్నప్పటికీ.. సరైన అవకాశం రావడం లేదు. అయితే ఈ విషయంలో తాను చాలా లక్కీ అని.. తన వెంట కోటి ఉండటం చాలా కలసొచ్చిందని అంటున్నారు. మ్యూజిక్ కలర్ ని తీసుకొని, దాన్ని ఇన్ స్పైర్ గా తీసుకొని వేరే ట్యూన్ ని ప్రిపేర్ చేయమని నాన్న చెప్పడం.. నేను అదే ఫాలో అవడం వర్కవుట్ అయిందన్నాడు. సినిమా హిట్ లో మ్యూజిక్ డైరెక్టర్ కి ఓ సముచిత పాత్ర ఉందని అంటున్నాడు.

“నాన్నగారి మెలోడీనే నేనూ ఫాలో అవుతన్నా, అవకాశం వస్తే మరిన్ని వేరియేషన్స్ చూపిస్తా,” రోషన్

ప్రస్తుతానికి తాను చేసిన రెండు సినిమాలు మెలోడీలే అని, స్క్రిప్ట్ డిమాండ్ చేసి ఫాస్ట్ బీట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని రోషన్ చెప్పాడు. మొదట్లో సినిమా చేయడానికి భయపడ్డాడు. పైగా నాగార్జున ఉండటంతో ఇంకా టెన్షన్ పట్టుకుంది. నాన్నగారు సపోర్ట్ తో మ్యూజిగ్ చేయగలిగానని అన్నాడు. తన ట్యూన్ కి నాగార్జున పాట పాడటం జీవితంలో మరిపోలేని అనుభూతి అని అంటున్నాడు.

“హార్డ్ వర్క్ అంటే నాగార్జున దగ్గర నేర్చుకోవాలి,” రోషన్

ఎన్ని టేక్స్ చెప్పిగా ఓపికతో నాగార్జున పాట పాడారు. రికార్డింగ్ కు సహకరించారు. పని తెలిసినా, తెలియక పోయినా దాన్ని కష్టపడి చేయాలి. డెడికేటెడ్ గా చేయాలని ఆయన చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చాయి, వాటిని అమలు చేస్తున్నానని అన్నాడు.

image


నా క్యారెక్టర్ ఏంటో చెప్పకుండా నన్ను యాక్టర్ చేశారు

రాజీవ్ కనకాల, సుమ కొడుకు మరో రోషన్ అంటున్న మాటలివి. సినిమా కధ వినిపించి యాక్ట్ చేయాలని చెప్పాడు. నాన్నగారు సరే అనడంతో నేను యాక్టర్ ని అయిపోయా. సీన్లలో ఎలా ఇన్వాల్వ్ కావాలనే విషయాలు నాన్న చక్కగా ఎక్స్ ప్లెయిన్ చేసేవారు. సినిమాకంటే ముందు ట్రెయినింగ్ ఇచ్చారు. అప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ తర్వాత నా క్యారెక్టర్ ఏంటనేది చెప్పారు.

“డైలాగ్స్ ముందురోజే ప్రాక్టీస్ చేసి షూటింగ్ కి వెళ్లే వాడిని,” రోషన్

స్క్రిప్ట్ ముందు రోజే తీసుకునే వాడట రోషన్. డైలాగ్స్ కష్టంగా ఉన్నా, సులభంగా ఉన్నా, ముందే ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యేవాడని అంటున్నాడు.

రెండో సినిమాకు ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని అనుకోలేదు

ఈ సినిమాకు హీరోయిన్ గా చేస్తున్న శ్రీయ శర్మకు హీరోయిన్ గా ఇది రెండో సినిమా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సుపరిచితమై శ్రీయ రోషన్ పక్కన లీడ్ రోల్ చేస్తుంది.

“చాలా బాధ్యతగా నేను నటించాను,” శ్రీయ శర్మ

మొదటి సినిమాకంటే ఈ సినిమా తనలో బాధ్యత పెంచిందని అంటోంది. చిన్ననాటి నుంచి ఫ్యాన్స్ ఉన్నారని, హిందీలో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని చెబుతోంది. నిర్మలా కాన్వెంట్ సినిమా కధ నచ్చడం వల్లనే రోల్ ఒప్పుకున్నానని శ్రీయ చెప్పింది.

మొత్తానికి టీనేజీ యాక్టర్లతో జనం ముందుకొస్తున్న ఈ సినిమా ఇప్పటికే అంచనాలకు మించి దూసుకు పోతోంది. సినిమా రంగంలో మరో తరానికి వెల్ కమ్ చెప్పడానికి అటు అన్నపూర్ణ స్టుడియోస్ తో పాటు కింగ్ నాగార్జున అందిస్తోన్న మద్దతు దీనికి తోడవుతోంది. ఫ్రెష్ టాలెంట్ ను వెతుక్కుంటూ పరిగెత్తే నాగార్జున ఇప్పటికీ హిట్ హీరోగా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా కూడా భారీ కలెక్షన్స్ వస్తాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. నాగార్జున పాడిన పాటకు కూడా సూపర్ రెస్పాన్స్ రావడం మరో ప్లస్ పాయింట్. హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ గా, సపోర్ట్ హీరోగా సినిమాకు వెనకుండి నడిపిస్తున్నారాయన. ఇప్పుడీ సినిమాకు కూడా నాగార్జునే బ్యాక్ బోన్.

నాగార్జున పాడిన ఆ పాట తాలూకు వీడియో