టూరిస్టులకు ఫిట్‌నెస్ సొల్యూషన్స్ అందిస్తున్న బోన్‌సోల్

టూరిస్టులకు ఫిట్‌నెస్ సొల్యూషన్స్ అందిస్తున్న బోన్‌సోల్

Thursday July 09, 2015,

3 min Read

దైనందిన జీవితంలో రోజురోజుకూ ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ మధ్య జనాల్లో ఫిట్నెస్ కాన్షియస్‌నెస్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఇంటి దగ్గరుంటే వ్యాయామం చేసుకోవడం సులభమే. కానీ.. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే.. ఫిట్‌నెస్ సెంటర్లు, స్పా, సెలూన్ల వివరాలు తెలుసుకునేదెలా.. ? అందుకే ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తూ.. వాటన్నింటి సమాచారాన్ని బోన్ సోల్ అనే స్టార్టప్ అందిస్తోంది.

ఇంటర్నెట్ రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచ వ్యాప్త సమాచారం అరచేతిలో ఇమిడిపోయింది. ఎక్కడెక్కడి సమాచారమో.. కదలకుండా కూర్చుని తెలుసుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ స్టార్టప్ కంపెనీలు దూసుకొస్తున్నాయి. అలాంటి సంస్థే బోన్ సోల్. ఆరోగ్యం, బ్యూటీ, వెల్నెస్ రంగాలకు సంబంధించిన వివరాలను ఫింగర్‌ టిప్స్‌పైనే అందిస్తోంది. ఫిట్‌నెస్ సెంటర్లు, స్పా, సెలూన్లకు సంబంధించిన వివరాలను అందించే ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ బోన్ సోల్. సెలూన్ల వివరాలతో పాటు ఎప్పుడు విజిట్ చేయాలి, ఆ సంస్థ రేటింగ్ ఏంటి, చికిత్సలో కొత్త విధానాలు సహా.. అనేక వివరాలను కూడా బోన్ సోల్‌లో లభిస్తాయి.

బోన్‌సోల్ వెబ్‌సైట్‌

బోన్‌సోల్ వెబ్‌సైట్‌


బోన్‌సోల్ ప్రయాణం గురించి దాని వ్యవస్థాపకురాలు అలేఖ్య నాదేండ్ల యువర్‌స్టోరీకి వివరించారు. సంస్థ ఏర్పాటుకు స్ఫూర్తి ఎవరు, ఏ ఏ నగరాల్లో దీని సేవలున్నాయి.. తదితర వివరాలను తెలిపారు..

హర్‌స్టోరీ: బోన్ సోల్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఈ సంస్థ స్థాపించడానికి స్ఫూర్తి ఏమిటి ? ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేశారు ?

అలేఖ్య నాదెండ్ల - వాస్తవానికి మా కుటుంబ వ్యాపారంలో నాన్నతోపాటు పనిచేసేదాన్ని. నాన్నతో పని అంటే.. చాలా ప్రయాణాలు ఉంటాయి. నాకు కూడా అలాంటి వర్క్ అంటేనే ఇష్టం. అయితే అప్పటికే నేను వ్యాయామం చేస్తూ ఉన్నాను. వివిధ రకాలైన ఫిట్‌నెస్ క్లాస్‌లకు వెళ్లడమంటే ఇష్టం. ఒకవైపు నగరాలకు తిరిగాల్సి రావడంతో క్లాస్‌లకు సమయం దొరికేది కాదు. నెలలో 5-10 క్లాస్‌లకు మాత్రమే వెళ్తుండేదాన్ని. దీంతో నెల మొత్తానికి ఫీజు చెల్లించే బదులుగా, ఎక్కడికి వెళ్లినా ఒక రోజు ఫిట్‌నెస్‌కు డబ్బులు చెల్లించి వ్యాయామం చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. క్లాస్‌లను పూర్తిగా మానివేసిన తర్వాత దీనిపై మరింత ఎక్కువగా దృష్టిపెట్టాను. ఈ రంగంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశంపై మరింత సమగ్రంగా ఆలోచించాం. ఇది ప్రారంభించాలని అనుకున్నప్పుడు, ముందుగా ఫిట్‌నెస్ సెంటర్లతోనే చర్చలు మొదలు పెట్టాలనుకున్నాను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాటికే పరిమితం కాకుండా, మొత్తం రిలాక్సింగ్‌కు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలనుకున్నాం. స్పా, సెలూన్స్.. అన్నింటి వివరాలను ఒకే చోట పొందుపర్చాలనుకున్నాం.

హర్‌స్టోరీ: సంస్థకు బోన్‌సోల్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది ?

అలేఖ్య నాదెండ్ల: సంస్థ కోసం చాలా పేర్లను పరిశీలించాం. వాస్తవానికి bookmyclass.com పెట్టాలనుకున్నాం. ఒక్క ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా స్పా, సెలూన్స్‌తోపాటు ఇతర సేవలను కూడా అందిస్తున్నాం. దీంతో బుక్‌మైక్లాస్ పేరు సరిపోదని భావించాం. ముఖ్యంగా మేం డాట్ ఇన్ కంటే మా సంస్థకు డాట్ కామ్ అయితేనే బాగుంటుందని మొదటి నుంచి అనుకున్నాం. దీంతో బోన్ సోల్‌ అయితే బాగుంటుందని నిర్ణయించాం. అందరి మనసులను సంతోషపెట్టడమే మా ఉద్దేశం. మంచిగా ఫీలవ్వాలన్నదే మా లక్ష్యం. దీంతో బోన్ సోల్‌ అయితే బాగుంటుందనుకున్నాం.

హర్‌స్టోరీ: మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి ?

అలేఖ్య: చెన్నైవీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆటోమెటిక్ లైట్స్, ఫ్యాన్స్, కర్టైన్స్ అంటే నాకు పిచ్చి. దీంతో స్మార్ట్ హౌజింగ్ రంగం వైపు వెళ్దామనుకున్నాను. స్మార్ట్ హౌజింగ్ కంటే ముందు, దానికి మరో అర్హత కూడా జోడించాలనుకున్నాను. డిజైన్‌లో డిగ్రీ చేయాలనుకున్నాను. న్యూయార్క్‌లోని న్యూ స్కూల్ ఫర్ డిజైన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత 8-10 నెలలపాటు మియామిలో పనిచేశాను. ఆ తర్వాత నాన్నతో కలిసి పనిచేసేందుకు తిరిగి వచ్చాను. తర్వాత హైదరాబాద్ ఐఎస్‌బిలో ఎంబీఏ పూర్తిచేశాను.

హర్‌స్టోరీ: స్పా, సెలూన్లకు జొమాటో వెబ్‌సైట్‌లా కావాలన్నది మీ ఉద్దేశమా ?

అలేఖ్య: జొమాటో లేదా ఇతర స్పా, ఫిట్‌నెస్ వెబ్‌సైట్ల మాదిరిగా సంస్థను నడుపాలనుకోవడం లేదు. ఒకవేళ జమాటోలాగా కావాలనుకుంటే, దాని తర్వాతే అవుతాం. అప్పుడు వారి విధానాలతో వారు ముందుకెళ్తారు. అందుకు వారికి కావాల్సింది కొందరిని మచ్చిక చేసుకోవడమే (నవ్వుతూ). ఏదైనా వెబ్‌సైట్‌తో పోల్చుకుంటే వారి తర్వాతే మనముంటాం. జొమాటో ఎప్పటికైనా, ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగవడం ఖాయం. కాబట్టే స్పా,సెలూన్ల రంగంలో జమాటోగా కాకుడదని అనుకున్నాం.

హర్‌స్టోరీ: ప్రస్తుతం మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి?

అలేఖ్య: మా సేవలను ఇతర నగరాలకు కూడా మళ్లించాలనుకుంటున్నాం. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పూణె నగరాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరించాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సేవలు అందించాలన్నదే మా లక్ష్యం

ఫిట్‌నెస్, స్పా, సెలూన్ల వివరాలు అందించాలన్న ఉద్దేశంతో నెలకొల్పిన బోన్ సోల్ సంస్థ మరింత వృద్ధి చెందాల‌ని ఆశిద్దాం..

website