రూ.25 పెట్టుబడితో రూ.600 సంపాదించి చూపిన సీనియర్ సిటిజన్

యువరైతులకి ఆదర్శంగా నిలిచిన రుక్మణీ దేవియాభై సెంట్ల స్థలంలోనే వ్యవసాయంఆర్థిక ప్రగతి సాధనతో ఆదర్శప్రాయురాలిగా నిలిచిన మహిళఆఫ్ సీజన్ పంటల పెంపకంతో ఆర్థిక స్వావలంబన

రూ.25 పెట్టుబడితో రూ.600 సంపాదించి చూపిన సీనియర్ సిటిజన్

Thursday April 16, 2015,

2 min Read

రుక్మణీ దేవి ఓ సీనియర్ సిటిజన్. ఉత్తరాంచల్‌లోని సోంధార్ గ్రామంలో నివాసముంటారు. ఆమెకు 50 సెంట్ల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. ఒక ఇల్లు, ఒక గేదె మాత్రమే ఆమె ఆస్తులు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులనుంచి ఆమె తన జీవితాన్ని మెరుగుపరచుకునేందుక మార్గాలను అన్వేషించారు. ఈ నేపధ్యంలో తను అనుసరించిన పద్ధతులు ఆమె జీవితాన్నే మార్చేయడంతో పాటు ఇప్పుడు ఎంతోమంది యువరైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.


image


పొరుగున ఉన్న రైతుల మాదిరిగానే రుక్మణీ కూడా తన క్యాబేజ్‌నే పండించేవారు. అయితే ఈ క్యాబేజ్ పంట ఆమెకు తగిన ఆదాయాన్ని సమకూర్చేది కాదు. ఈసమయంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు ఆ గ్రామంలో పర్యటించారు. వాళ్లు చెప్పింది పూర్తిగా ఆకళింపు చేసుకున్న రుక్మిణీ వాటిని వెంటనే అమల్లో పెట్టడం ప్రారంభించారు. అంతే ఆమె జీవితం కొత్త మలుపులు తిరిగింది. జీవనశైలి ప్రగతిబాట పట్టింది. ఖరీఫ్ సీజన్‌లో రైతులు లబ్ధి పొందేందుకు రాణిచౌర్ హిల్ కేంపస్‌లో ఓ వర్క్‌షాప్ నిర్వహించారు ప్రతినిధులు. మొదటగా 28మంది రైతులకు సోయాబీన్ పెంపకంపై అవగాహన కల్పించారు. ఒక్కో హెక్టార్‌కు 1000 కిలోలకు పైగా ఉత్పత్తి సాధించవచ్చనే విషయాన్ని తెలియచేశారు. గతంలో వారు పండించిన క్యాబేజ్‌తో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

ప్రయోగాత్మకంగా అమలు చేసిన తొలి దశలో ఆశించిన స్థాయిలో ఫలితాలొచ్చాయి. దీంతో రెండో దశలో భాగంగా రబీ సీజన్‌లో మరింత ఉత్పత్తి సాధించేలా వీరికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ఒక్కో హెక్టార్‌కు 23 క్వింటాళ్ల దిగుబడి సాధ్యమైంది. ఆయా సీజన్ల ప్రకారం పంటలు పండిచడమే తప్ప.. ఆఫ్ సీజన్ పంటలపై రైతులకు అవగాహనే లేదన్న విషయం కృషి వికాస కేంద్ర ప్రతినిధులకు అర్ధమైంది. అందుకే నాన్ సీజనల్ కూరగాయల పెంపకంపై అవగాహన కల్పించారు ప్రోత్సహించారు. ఇందులో భాగంగా 28మంది రైతులకు క్యాబేజ్, టొమాటోలను వెర్మికోస్ట్, సేంద్రీయ పద్ధతుల్లో పెంచడం నేర్పడమే కాకుండా, దాని ఉపయోగాలను వివరించారు. ఈ సమయంలో ఈమెకు 100 మొక్కలు అందించారు కూడా.

ఆమెకున్న యాభై సెంట్ల స్థలంలో క్యాబేజ్ పెంపకం కోసం వెచ్చించిన మొత్తం రూ. 25.50. ఆమెపై రుక్మిణీ దేవి ఆర్జించిన మొత్తం వింటే ఆశ్చర్యం వేస్తుంది. 60కేజీల పంట చేతికందడంతో... ఒక్కో కిలో 10రూపాయల చొప్పుల రూ. 600 సంపాదించారు రుక్మిణి. అంటే ఒక్కో హెక్టార్‌కు 240 క్వింటాళ్ల చొప్పుల దిగుబడి సాధించినట్లు లెక్క. "ఈ స్థాయిలో ఆర్జించడం జీవితంలో మొదటిసారి. ఆర్థిక స్వాతంత్రానికి బాటలు వేసిన సైంటిస్టులకు జీవితాంతం రుణపణి ఉంటా"నంటారు రుక్మణీ దేవి.

ఆఫ్ సీజన్‌లో క్యాబేజ్ పెంపకం ఎప్పుడూ లాభసాటి వ్యవహారమే. ఇప్పుడు అనేక మంది రైతులు ఆ పరిశోధకుల వద్దకు వస్తున్నారు. ఇందుకు కారణం రుక్మణి దేవి సాధించిన అద్భుత విజయమేనని ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. 

(నేషలన్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ చేపట్టిన ఉమ్మడి కార్యక్రమం)