ఈ సైంటిస్ట్ కరెంటు తయారు చేసే చెట్టును కనుగొన్నాడు..!!

ఈ సైంటిస్ట్ కరెంటు తయారు చేసే చెట్టును కనుగొన్నాడు..!!

Monday October 24, 2016,

2 min Read


కరంటు కోతలు. ఎండాకాలం వస్తే చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నరకం అంతా ఇంతా కాదు. వేళాపాలా లేకుండా ఎడాపెడా కరెంటు కోసేస్తారు. ఎనర్జీ క్రైసిస్ ఒక్క ప్రాంతమని కాదు.. దేశమంతా ఇదే సంక్షోభం. రైతులు మొదలుకొని చిరువ్యాపారుల మీదుగా పెద్దపెద్ద పరిశ్రమలు సైతం కరెంటు సమస్యలను ఎదుర్కొన్నారు. మన దగ్గర ఆ మధ్య పవర్ హాలిడే కూడా ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో సోలార్ వాడకం చూస్తున్నా.. రూరల్ ఏరియాలో సౌర విద్యుత్ మీద అంతగా అవగాహన లేదనే చెప్పాలి. అందుకే ఒక సైంటిస్ట్ ఒక చక్కని పరిష్కారాన్ని కనుగొన్నాడు.

సోలార్ పవర్ ట్రీ. దుర్గాపూర్ సెంట్రల్ ఇంజినీర్స్ రీసెచ్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ)లో చీఫ్ సైంటిస్టుగా పనిచేస్తున్న శిబ్ నాథ్ దీని ఆవిష్కర్త. పెద్దగా లాండ్ అకుపై కాకుండా, కేవలం నాలుగంటే నాలుగు చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు ఇళ్లకు కావల్సినంత కరెంటు అందించేలా సోలార్ పవర్ ట్రీని తయారు చేశాడు. ఒక చెట్టు ద్వారా మూడు నుంచి ఐదు కిలోవాట్ల విద్యుత్ తయారు చేసేలా రూపొందించాడు. ఒకసారి ట్రీ ఏర్పాటు చేస్తే 25 ఏళ్ల వరకు దాన్ని ముట్టుకోనవసరం లేదు. ఈ సోలార్ పవర్ ట్రీ గత మే నెలలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. వినూత్న ఆలోచన కేంద్రమంత్రికి నచ్చడంతో ఢిల్లీలోని పలు చోట్ల ఇలాంటి ట్రీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

image


దుర్గాపూర్ మున్సిపాలిటీ వాళ్లు తమకు 10 సోలార్ పవర్ ట్రీస్ కావాలని సీఎంఈఆర్ఐని అడిగారు. బెంగాలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే టైంలో కూడా ఇలాంటివి 120 ట్రీస్ కావాలని కూడా రిక్వెస్ట్ అందింది.

కేవలం ఇళ్లకే కాదు.. భవిష్యత్ లో వ్యవసాయానికి కూడా ఉపయోగపడేలా చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మధ్యనే ముంబైకి చెందిన ఒక జంట సోలార్ పవర్ ట్రీ లాంటిదే.. ఉల్టా చాటా అనే ప్రాడక్ట్ ని తయారు చేశారు. అది సోలార్ పవర్ జెనరేట్ చేయడమే కాకుండా, ఏడాదికి లక్ష లీటర్ల రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే అటు సైంటిస్టులు.. ఇటు ఆంట్రప్రెన్యూర్ కలిస్తే దేశంలో కరెంటు సమస్యలే లేకుండా చేస్తారడనంలో సందేహం లేదు.