డ్రైవర్స్‌ కార్ట్ చేతికి డ్రివెన్

ఆన్ డిమాండ్ చఫర్స్ రంగంలో వారంలోనే రెండో మెర్జర్

డ్రైవర్స్‌ కార్ట్ చేతికి డ్రివెన్

Thursday May 12, 2016,

2 min Read


మంత్లీ పేరోల్ మాదిరిగా కాకుండా గంటల ప్రాతిపాదికన హైర్ చేసుకునే తాత్కాలిక డ్రైవర్లకు సంబంధించిన ఎగ్జిస్టింగ్‌ రియల్ టైమ్ అగ్రిగేటర్ డ్రైవర్స్‌ కార్ట్. ఇంటర్వ్యూలు నిర్వహించి, బ్యాక్‌గ్రౌండ్స్ చెక్, పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత డ్రైవెన్ 67 మంది డ్రైవర్లను ఎంపికచేసింది. 

ఆగస్ట్ 2015లో అరుణ్ గాంధీ, అమన్ సాంచేటి, గౌరవ్ దేశ్‌ముఖ్, నిఖిల్ తవోరా, శివాలికా సేన్‌ డ్రివిన్‌ను ప్రారంభించారు. ప్రతి నెలలో వెయ్యి మంది కస్టమర్లకు సేవలందిస్తూ ఒక్కో రైడ్‌కు సగటున 400 రూపాయలను ఆర్జిస్తోందీ ఈ సంస్థ. గెట్ డ్రివిన్ టెక్నాలజీ ద్వారా నడుపబడుతున్న చెన్నైకి చెందిన డ్రైవర్స్‌ కార్ట్ ప్రతి నెలలో 10 వేల రైడ్స్‌ను నిర్వహిస్తోంది. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణెలలో సేవలందిస్తోంది. 

ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్థి వినిత్ శ్రీవాత్సవ 2015 సెప్టెంబర్‌లో ఈ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 డ్రివెన్ టీమ్..

డ్రివెన్ టీమ్..


 స్థాన బలం..

ఆన్ డిమాండ్ డ్రైవర్ మార్కెట్‌ ప్లేస్‌లో దేశంలోనే మార్కెట్ లీడర్‌గా ఉంది డ్రైవర్స్‌ కార్ట్. అది కూడా డ్రివెన్‌ను సొంతం చేసుకోకముందే. సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీలు జూమ్ కార్, జస్ట్ రైడ్ లంటి సంస్థలకు మాత్రమే డ్రైవర్స్‌కార్ట్ చఫర్లను ప్రొవైడ్ చేస్తూ బీ2బీ, బీ2సీ రంగాల్లో మంచి పట్టు సాధించింది. 200 మంది ప్రొఫెషనల్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫైడ్ డ్రైవర్లతో మంచి నెట్‌వర్క్ కలిగి ఉంది. యాండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్ రెండింటిలోనూ డ్రైవర్స్‌ కార్ట్ యాప్ అందుబాటులో ఉంది.

డ్రైవర్లకు డిమాండ్..

ఆశ్చర్యకరంగా ఆన్ డిమాండ్ డ్రైవర్స్ సర్వీస్ మార్కెట్‌లో ఒక్క నెలలోనే రెండు మెర్జర్లు, అక్విజిషన్ డీల్స్ జరిగాయి. కాల్ ఎట్ హోమ్‌ను బెంగళూరుకు చెందిన డ్రైవ్ యూ సొంతం చేసుకున్న వారంలోపే డ్రివెన్‌ను డ్రైవర్స్‌కార్ట్ సొంతం చేసుకుంది.

గుర్గావ్‌లో మంచి పట్టు సాధించాలన్న లక్ష్యంతో డ్రైవ్ యూ ఉంది. ఈ మెర్జర్‌తో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 డ్రైవర్ పార్ట్‌నర్లున్నారు. మరోవైపు డ్రివెన్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ముంబై మార్కెట్‌ను కాప్చర్ చేసుకోవాలన్నది డ్రైవర్స్‌ కార్ట్ వ్యూహం.

కస్టమర్ల ఫీజు రూపంలో గంటకు 99 రూపాయలను, రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడుగంట మధ్య 50 నుంచి 250 రూపాయలు సర్జ్ ప్రైజ్‌ను డ్రైవ్ యూ వసూలు చేస్తోంది. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లకు 30 వేల ట్రిప్స్ ద్వారా సేవలందించింది. ఇందులో 60 శాతం మహిళా కస్టమర్లే కావడం విశేషం.

గత నెలలోనే డ్రైవర్స్‌ కార్ట్‌ లో నమిత్ అగర్వాల్, ప్రిమార్క్ గ్రూప్, లీడ్ ఏంజెల్స్, అహ్ వెంచర్స్, సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్లు ప్రి సిరీస్ ఏ పెట్టుబడులు పెట్టారు.

డ్రైవర్స్‌కార్ట్ వ్యవస్థాపక టీమ్

డ్రైవర్స్‌కార్ట్ వ్యవస్థాపక టీమ్


ఇక ఈ రంగంలో ఉన్న మరో స్టార్టప్ డ్రైవ్‌బడ్. ఫుల్ టైమ్ డ్రయివర్లకు బదులుగా ప్రత్యామ్నాయా విధానాలను ఈ గుర్గావ్‌కు చెందిన సంస్థ అవలంబిస్తోంది. 25 మంది డ్రైవర్లు పే రోల్‌లో ఉండగా, 80 మంది డ్రైవర్లు ఫ్రీలాన్స్ బేసిస్‌లో పనిచేస్తున్నారు. ఈ సంస్థకు 1500 మందికిపైగా రిజిస్టర్డ్ కస్టమర్లున్నారు.

రోజు రోజుకు దేశంలో కార్ల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వెరిఫైడ్, ప్రొఫెషనల్ డ్రైవర్ల అవసరం ఎంతో ఉంది. ఇది ఆన్ డిమాండ్ డ్రైవర్ సొల్యూషన్ ప్రొవైడర్లకు వరంలా మారింది. ఇక 2025 కల్లా ప్రతి వెయ్యి మందిలో 35 మంది కార్లు కొనుక్కుంటారని ఓ అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఆన్ డిమాండ్ డ్రైవర్ సొల్యూషన్ రంగం మరింత విస్తరిస్తుంది.

వెబ్‌సైట్: