రోజంతా నిలబడి పనిచేసే వారికి ప్రత్యేక రోబోటిక్ కుర్చీ

యూకేలో ప్రారంభమైన స్టార్టప్కార్మికులు, నిల్చొని పనిచేసే వారికోసం ప్రత్యేక టూల్పేటెంట్ పొందిన రోబోటిక్ మేగ్నటిక్ డివైజ్అలసి సొలసిన జీవితాలను సేదతీర్చే అద్భుత సాధనం

0

ఎక్కువ సమయం పనిచేస్తే అలసిపోతాం. వెంటనే అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చొని సేదతీరుతాం. ఇంటికొచ్చాక మంచంపై పడుకొని రిలాక్స్ అవుతాం. ఇంటికి వచ్చే అవకాశం లేకపోతే.. ఆఫీసులోనే కుర్చీలో కూర్చొని ఉండిపోతాం. కానీ చాలా టైం నిల్చోవాల్సిన పనివస్తే. పని తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత కూర్చోడానికి ఆసక్తి చూపుతాం. కానీ ఆ అవకాశం లేకపోతే. అలాంటి పరిస్థితుల్లో సేదతీర్చడానకి ఈ కుర్చీ కాని కుర్చీ సిద్ధపడుతోంది.

గంటలకొద్దీ నిల్చొని ఉండటం ఆరోగ్యానికి అసలు పనికిరాదు. నిల్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడైతే ఇక చెప్పనక్కర్లేదు. వేర్ హౌసింగ్ ల విషయానికి వస్తే.. అక్కడ పనిచేసే కార్మికులకి కూర్చోడానికి సీటును కేటాయించడం చాలా కష్టం. ఎందకంటే అక్కడ కుర్చీలేస్తే.. పనికి అంతారాయం కలుగుతుంది. ఇలా రోజులో ఎక్కువసేపు కూర్చోకుండా పనిచేస్తే ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు రావడమే కాదు. ఆఖరికి ఏపని చేయడానికీ పనికిరాకుండా పోతారు. దీనికి కూడా పరిష్కరం ఉంటే. మనం కూర్చోవాలనుకున్నప్పుడు కుర్చీ ఉండి. పనిచేసేటప్పుడు అది కనపడకుండా చేయగలిగితే. ఇక్కడెలాంటి మ్యాజిక్ లేదు. ఓ చిన్న లాజిక్ ఉంది. దాన్ని తెలుసుకుంటే పైన చెప్పినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుర్చీ ప్రత్యక్షం అవుతుంది.

కుర్చీ కాని కుర్చీ ఉపయోగించే విధానం
కుర్చీ కాని కుర్చీ ఉపయోగించే విధానం

కుర్చీకాని కుర్చీ

నూనీ అనేది జూరిష్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్. బ్రియాన్ అనాస్టీసియాడ్స్, కేత్ గునురా లు దీనికి కో ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కుర్చీ కాని కుర్చీ తయారు చేయాలనే ఆవిష్కరణతో ముందుకొచ్చారు. ఒక ఎలక్ట్రోమెకానికల్ రోబోటిక్ డివైజ్ ఉంటుంది. దీన్న మన శరీరానికి కలుపుతారు. మనం కూర్చోవాలనుకున్నప్పుడు కుర్చీ కనిపిస్తుంది. దానిపై కూర్చోవచ్చు. లేదన్నప్పుడు కుర్చీ కనపించదు. ఈ డివైజ్ పై నూనీకి పేటెంట్ ఉంది. ఒక బటన్ ప్రెస్ చేస్తే మీ కాళ్లకు ఎటాచ్ చేయబడిన కుర్చీ బయటకు వస్తుంది. దానిపై కూర్చొని సేద తీరొచ్చు. అయితే ఇదెలాంటి సమస్యను తీసుకు రాదు. సౌకర్య వంతంగా దీనిపై కూర్చునే వెసులుబాటుంది.

నాకప్పుడు పదిహేడేళ్లనుకుంటా. యూకేలోని ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో నేను పనిచేస్తున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొనేలాంటి కుర్చీ ఒకటుంటే బాగున్ననే ఆలోచన నా మదిలో మొదలైందక్కడ. వర్కర్లు ఎక్కువ మంది ఉన్నప్పటకీ వారికి కావల్సినన్ని కుర్చీలు లేవు. అదే విధంగా ఎప్పుడు బడితే అప్పుడు కూర్చోడానికి అవకాశం లేదు. పాదాలపై భారం పడి నొప్పులు పెట్టేవి. కనీసం నాగురించైనా ఓ కుర్చీని తయారు చేసుకోవాలని నేననుకున్నా. అని కేత్ గునురా సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇప్పుడతనికి 29ఏళ్లు. ‘నూనే’ కంపెనీకి సీఈఓ కోఫౌండర్గా ఉన్నారు.

ఈస్టార్టప్ ,పెట్టుబడులను కూడా ఆకర్షించింది. వెంచర్ కిక్ అనే కంపెనీ ఇందులో పెట్టుబడులుపెట్టింది. వెంచర్ కిక్ అనేది స్విస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. స్విస్ ఫెడరల్ సూపర్విజరీ బోర్డ్ ఆఫ్ ఫౌండేషన్ కింద ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీంతోపాటు ఇతర కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

మరో గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు కానీ ఈ డివైజ్ కనీసం ఉన్నట్లు అనిపించదు. కాళ్ల టైస్ కు దీన్ని జతచేస్తారు. సాధారణ పరిస్థితుల్లో ఇది నేలను తాకదు. స్టేషనరీ అయినప్పుడు మాత్రమే ఇది గ్రౌండ్ ను టచ్ చేస్తుంది. ప్రస్తుతానికి డివైజ్ బ్యాటరీ లేకుండా 24గంటు పనిచేస్తుంది. ఇదికార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. దీని బరువు రెండు కిలోలు మాత్రమే.

ఈ ప్రాడక్ట్ మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురాడానికి ప్రణాళికలు చేస్తున్నారు. చాలా రకాలై కండిషన్స్ ను మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచుగా దెబ్బలు తగలడాన్ని,యాక్సిడెంట్ లు జరగడాన్ని ఇది నివారిస్తుంది. దీంతో పాటు అలసట తీర్చడానికి దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ కారణాలన్నీ కనిపించని ఈ కుర్చీ ప్రొడక్టవిటీ పెంచుకోడానికి ఎంగానో సహకరించనున్నాయి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik