ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ గురించి ట్రాయ్‌కి లెటర్ పుతున్నారా? అయితే, ఒక‌సారి ఇది జాగ్ర‌త్త‌గా చ‌ద‌వండి !!

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ గురించి ట్రాయ్‌కి  లెటర్ పుతున్నారా? అయితే, ఒక‌సారి ఇది జాగ్ర‌త్త‌గా చ‌ద‌వండి !!

Saturday January 09, 2016,

3 min Read

ప్రతి సారి ఫేస్ బుక్ లో లాగిన్ అయినప్పుడు, ఎవరో ట్రాయ్ కి మెసేజ్ పెట్టినట్లు రకరకాల అప్ డేట్స్ వస్తుంటాయి. మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ఫలానా వ్యక్తి ఫ్రీ బేసిక్స్ కి మద్దతిస్తూ ట్రాక్ కి లెటర్ పంపారు, మీరు పంపరా అనే క్యాంపైన్ కనపడుతుంది. ఫ్రీ బేసిక్స్ అనగానే లక్షల రూపాయిలు మనం అకౌంట్ లో పడిపోయినంత సంతోషంగా మనలో చాల మంది దాన్ని క్లిక్ చేస్తున్నారు. వారు కూడా పంపేస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రీ బేసిక్స్ ఎంతవరకూ మనకు ఉపయోగపడతాయి? అసలు ఫేస్ బుక్ మాత్రమే ఎందుకు క్యాంపెయిన్ చేస్తోంది.

image


ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ లాజిక్కేంటి?

సాధారణంగా మనకు అత్యవసరమైన కొన్ని విషయాల్లో ఇంటర్నెట్ ను కూడా చేరుస్తోంది ఈ క్యాంపెయిన్. అందరికీ ఇంటర్నెట్ అందాలి అనేది వీరి నినాదం. ఇక్కడ వరకూ బాగానే ఉంది. ఇంగ్లీష్ తోపాటు తెలుగు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ వేసి మరీ ఫ్రీ బేసిక్స్ పై ఫేస్ బుక్ ప్రచారం చేస్తోంది. ఇన్ని మిలియన్ డాలర్లను ఖర్చు చేయడం వల్ల ఫేస్ బుక్ కి వచ్చే ప్రయోజనమేంటి? ఇదే విషయంపై మన టెకీలు, ఇతన ఇంటర్నెట్ నిష్ణాతులు పూర్తి స్థాయిలో పరిశోధన చేశారు.

అసలీ ఫ్రీ బేసిక్స్ వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాల కంటే భవిష్యత్ లో దీని పర్యావసానాలే ఎక్కువని వారు అంచనా వేస్తున్నారు. ఈజిప్ట్ దేశంలో జరుగుతోన్న ఫ్రీ బేసిక్ క్యాంపైన్ పై అక్కడి ప్రభుత్వమే నిషేధం విధించింది. యూరప్ లోని చాలా దేశాల్లో క్యాంపెయిన్ ప్రారంభం కోసం చేసుకున్న ధరఖాస్తులనే పరిగణలోకి తీసుకోలేదు. ఇంటర్నెట్ డాట్ ఆర్గ్(internet.org) అనేది ఫేస్ బుక్ తాలూకు నాన్ ఫ్రాఫిట్ ఇనిషియేటివ్. అందరికీ ఇంటర్నెట్ ను అందించడం దీని ఉద్దేశం. ఫేస్ బుక్ అడిగింది కదా అని చాలా మంది ట్రాయ్ కి లెటర్లు పంపుతున్నారు. నెట్ న్యూట్రాలిటీకి మద్దతిచ్చేస్తున్నారు. కానీ అది ఎంతవరకూ సబబు. ఇంటర్నెట్ అంటే కేవలం ఫేస్ బుక్ మాత్రమే కాదు కదా? భవిష్యత్ లో అది ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ ఇంటర్నెట్ ప్లేస్ లో మరొకటి రాదు.

స్టార్టప్ లకు ఫ్రీ బేసిక్స్ తో ఉపయోగం ఎంత?

అందరికీ ఇంటర్నెట్ అందించడం నిజంగానే గొప్ప విషయం. డిజిటల్ ఇండియా క్యాంపైన్ ఉద్దేశం కూడా ఇదే. కానీ ఇందులో కొన్ని విషయాలను తరచి చూడాల్సిన అవసరం ఉందని స్టార్టప్ కంపెనీలంటున్నాయి. ప్రారంభ దశలో ఉందే కంపెనీలకు ఫ్రీ బేసిక్స్ వల్ల ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువనేది కొందరి అభిప్రాయం. దీనిపై హైదరాబాద్ టెకీలు, స్టార్టప్ కమ్యూనిటీలో మిశ్రమ స్పందన వస్తోంది. ఫేస్ బుక్ వేదికగానే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

"ఫ్రీ బేసిక్స్ పై మరింత చర్చ జరగాలి. అందరినీ ఇందులో భాగస్వామ్యులను చేయాలి, " రవికోరుకొండ

పర్పుల్ టాక్స్ ఫౌండర్ రవికోరుకొండ ఫ్రీ బేసిక్స్ విషయంలో తన అభిప్రాయం చెబుతూ ఈరకంగా అన్నారు. ఏకాభిప్రాయం రావాలని అంటున్నారాయన.

“ఫేస్ బుక్ ప్రారంభించడానికి ముందు ఫ్రీ బేసిక్స్ ఉండుంటే అసలు ఫేస్ బుక్ లాంటి ఫ్లాట్ ఫాం మనకు లభించేది ఉండేదో కాదో,” హ‌రి కృష్ణ‌న్

హ‌రి కృష్ణ‌న్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యువర్, డెవథాన్ అండ్ ఒవియూమ్ టెక్నాలజీస్ కి కో ఫౌండర్. ఆయన చెప్పిన ప్రకారం ఫ్రీ బేసిక్స్ వల్ల కొత్తగా ఏదైనా ఇన్నో వేషన్ ప్రారంభమైతే అది జనం ముందుకు రావడం కష్టమవుతుంది. ఫ్రీ బేసిక్స్ మద్దతిచ్చే వాటికే అక్కడ చోటుంటుంది. కొత్త వాటికి అసలు ఎంట్రీ ఉండదన్న మాట.

image


కొంత మంది టార్గెట్ ఆడియన్స్ కి ఫేస్ బుక్ మాత్రమే ఇంటర్నెట్ అనేలా స్థాయిలోఉంది. ఇంర్నెట్ ను మొదటి సారి ఉపయోగించే వారికి మాత్రం ఫేస్ బుక్ తెలియాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఏదైనా వెబ్ సైట్ ప్రారంభించి ముందుకు పోవాలన్నా అది ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యం కాదు. ఫేస్బుక్ ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ద్వారా మాత్రమే భవిష్యత్ లో పనిచేయాల్సి ఉంటుంది. అలా ఫేస్బుక్ తెలిసిన వారికే తెలుస్తుంది.

“స్టార్టప్ లకు ఫ్రీ బేసిక్స్ ఓ గొడ్డలి పెట్టు లాంటిది,” రాజీవ్ దావన్

సీరియల్ ఆంత్రప్రెన్యువర్ అయిన రాజీవ్ వాట్స్ ఇన్ ఎ నేమ్ ఫౌండర్. ఫ్రీ బేసిక్స్ వల్ల స్టార్టప్ లకు లాభమా నష్టమా అనే సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేం. భవిష్యత్ లో ఇప్పుడున్న లాభాలైతే ఉండవని చెప్పగలనని అంటున్నారాయన. ట్రాక్ కి గుడ్డిగా మెసేజ్ చేసే ముందు అందులో ఉండే టర్మ్స్ చదవాలని ఆయన సలహా ఇస్తున్నారు.

"ఫ్రీ బేసిక్స్ లో ఉండే మంచిని మాత్రం గ్రహించాలి. వాటని మాత్రమే ఓకే చేసి ఓటు వేయండి," శివాని

గీక్ ఏంజిల్స్ సభ్యురాలైన శివానీ ఫ్రీ బేసిక్స్ లో ఉండే కొన్నివిషయాలను మద్దతివ్వాలని అంటున్నారు. భవిష్యత్ లో మనకు ఇబ్బందిని కలిగించే బేసిక్స్ లను మద్దతివ్వొద్దంటున్నారు. అలా అయితే ఫ్రీ బేసిక్స్ మనకు ఉపయుక్తమని వివరించే ప్రయత్నం చేశారు.