పేద పిల్లల ఆకలి తీర్చడానికి KFC ‘యాడ్ హోప్’

అక్షయ పాత్ర లాంటి సంస్థలతో కలసి పనిచేస్తున్న KFC

 పేద పిల్లల ఆకలి తీర్చడానికి KFC ‘యాడ్ హోప్’

Wednesday May 11, 2016,

2 min Read

ప్రతి ఏడాది కెఎఫ్సీ రెస్టారెంట్ తన మార్కెటింగ్ నుంచి కొంత మొత్తాన్ని పేదపిల్లల కోసం వెచ్చిస్తోంది. చిన్నారులకు భోనాలను సమకూరుస్తుంది. భారత్ లో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా శ్రీకారం చుట్టారు. కెఎఫ్సీ భారత ఎండీ రాహుల్ షిండే దీన్ని ప్రారంభించారు.

20మిలియన్ చిన్నారులు

భారత్ లోని యాడ్ హోప్ కార్యక్రమం ద్వారా 20మిలియన్ల మంది చిన్నారుల ఆకలి తీర్చడమే టార్గెట్ పెట్టుకున్నట్లు షిండే ప్రకటించారు.

“2020నాటికి మా టార్గెట్ కు రీచ్ అవుతాం,” రాహుల్

దీనికోసం కెఎఫ్సీ వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం(డబ్యూ ఎఫ్ పి), అక్షయ పాత్ర ఫౌండేషన్, ఇండియన్ ఫుడ్ బ్యాంకింగ్ నెట్ వర్క్(ఐఎఫ్ బిఎన్) లాంటి సంస్థలతో కలసి పనిచేస్తుంది. దేశం వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు షిండే తెలిపారు. రెండు కోట్లను డబ్యూ ఎఫ్ పి తో పాటు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ కు ఈ సందర్భంగా అందజేశారాయన.ప్రతి రోజు లక్షల మంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలిని తీర్చే కనీస బాధ్యతను తాము చేపడుతన్నామని అన్నారు షిండే. యాడ్ హోప్ ప్రధాన ఉద్దేశం ఇదే అని చెప్పుకొచ్చారు.

కస్టమర్ల బిల్ నుంచి 5రూపాయలు

యాడ్ హోప్ కోసం తమ కస్టమర్ల దగ్గరి నుంచి 5రూపాయిలను వసూలు చేస్తున్నట్లు షిండే అన్నారు. ఐదువందల బిల్ చేసిన కస్టమర్లకు ఐదు రూపాయిలు పెద్ద లెక్క కాకపోవచ్చు. కానీ ఆ ఐదు రూపాయిలకే అక్షయ పాత్ర మధ్యహ్న భోజనాన్ని అందిస్తుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న 300లకు పైగా ఉన్న కెఎఫ్ సీ రెస్టారెంటులో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ అద్భుత కార్యక్రమానికి తమ మద్దతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారు వాలంటరీగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందించదగిన విషయంగా ఆయన అభివర్ణించారు.

యాడ్ హోప్ కు పూర్తి మద్దతు

image


కెఎఫ్సీ ప్రకటించిన ఈ కార్యక్రమానికి అక్షయ పాత్ర తో పాటు ఇతర సంస్థలు పూర్తి మద్దతు ప్రకంటించాయి.

“ప్రపంచం ఆకలి తీర్చడానికి కెఎఫ్సీ ముందుకు రావడం హర్షణీయం. దీనికి మా మద్దతు ఉంటుంది,” డా. హమీద్ నూర్

యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం భారతీయ డైరెక్టర్ అయిన హమీద్ యాడ్ హోప్ ను సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ గా చెప్పారు.

“భారత దేశంలో మా సంస్థ చేస్తున్న కార్యక్రమానికి కెఎఫ్ సీ కలసి రావడం సంతోషమైన విషయం,” సందీప్ తల్వార్,

అక్షయ పాత్ర ఫౌండేషన్ కు సందీప్ సిఎంఓ. కెఎఫ్సీ తోడు కావడంతో దేశం నుంచి ఆకలిని తరిమి కొట్టాలనే తమ ప్రధాన సవాల్ ని అధిగమించడం మరింత సులభతరం అవుతుందని అన్నారు.

"మాలాంటి విజన్ తోనే కెఎఫ్ సి ముందుకు రావడం శుభపరిణామం," వందనా సింగ్

ఇండియ ఫుడ్ బ్యాంకింగ్ నెట్ వర్క్ కి వందన సిఈఓ. యాడ్ హోప్ తో మరింత గా తమ కార్యక్రమాన్ని విస్తరిస్తామని అ న్నారామె. తమ రెస్టారెంట్ లనుంచి ట్రక్ లతో ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తామని అన్నారు షిండే. దీన్ని అక్షయ పాత్ర ఏర్పాటు చేసిన స్టాల్స్ తో పాటు డబ్యూ ఎఫ్ పి లకు హ్యాండోవర్ చేస్తారు. అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనికి వాలంటీర్లుగా కెఎఫ్ సి ఉద్యోగులు పనిచేస్తారని షిండే ముగించారు.

image