నాలుగు ముక్కల్లో వార్తలను చెప్పే 'వే2న్యూస్'

ఆన్ లైన్ న్యూస్‌లో కొత్త ఒరవడి రంగం సిద్ధం చేస్తున్న వే2ఎస్ఎంఎస్ సంస్థప్రాంతీయ భాషల్లో షార్ట్ న్యూస్ అన్ని వర్గాల ప్రజలకి చేరువవ్వడానికి ప్రయత్నిస్తోంది

నాలుగు ముక్కల్లో వార్తలను చెప్పే 'వే2న్యూస్'

Tuesday September 08, 2015,

4 min Read

కొన్ని శతాబ్దాల క్రితం, ఇంటర్నెట్ మనిషి జీవితంలో భాగం కాలేదు. అప్పట్లో ప్రజలు సమాచారం కోసం కేవలం రేడియోలు, న్యూస్ పేపర్ల మీద ఆధారపడేవారు. అప్పుడు చాలా పరిమితమైన అవకాశాలే ఉండేవి. దానిని కాస్త ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే డిజిటల్ ఎరా, ఇప్పుడు అవసరానికి మించిన సమాచారం కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. ఎక్సెలోకామ్ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఇంటర్నెట్ లో నిమిషానికి 320 కొత్త ట్విటర్ ఎకౌంట్లు తెరుస్తున్నారు. దాదాపుగా 5,47,000 ట్వీట్స్ షేర్ చేస్తున్నారు. 8,433 షేర్లు, 1.03 మిలియన్ వీడియో లూప్స్ నెట్ లోకి వస్తున్నాయి.


Image credit - shutterstock

Image credit - shutterstock


ప్రజల అవసరాలు తీర్చేందుకు, పెద్ద సంఖ్యలో ఫ్లాట్‌ఫామ్స్ స్థానిక, ప్రపంచ స్థాయి వార్తలతో కూడిన డేటాతో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొంత మంది ఉన్న విషయాన్ని యథాతథంగా ప్రచురిస్తున్నారు. ఇతరులను దానికి కాస్త మార్చి అందరికి పంచుతున్నారు.

మరో విధానం కూడా ఆవిర్భవిస్తోంది, విషయాన్ని క్లుప్తం (షార్ట్ –ఫామ్) చేసి దేశీయ భాషల్లో అందిస్తున్నారు. వే2న్యూస్ ఈ రెండు రంగాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది.

వే2న్యూస్ ప్రత్యేకత ఏమిటి ?

వే2న్యూస్ ఒక మొబైల్ యాప్. వేరు వేరు భారతీయ భాషల్లోని, వివిధ మార్గాల ద్వారా లభించే సమాచారాన్ని క్లుప్తంగా అందించే ఏకైక సాధనం. టైర్-2, టైర్-3 నగరాలు పట్టణాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. స్థానిక భాషల్లో వార్తల వినియోగానికి భారీ డిమాండ్ ఉంటుందని ఈ టీమ్ ఊహించింది.

ఈ ఉత్పాదనకు చొరవ తీసుకున్నది ప్రధాన కంపెనీ వే2ఆన్ లైన్. ఇది వే2ఎస్ఎంఎస్ ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. మొదటి తరానికి చెందిన వ్యాపారవేత్త రాజు వనపాల 2006లో వే2ఎస్ఎంఎస్ ను స్థాపించారు. ఈ మధ్య కాలంలో దాని వినియోగదారుల సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుంది. ఆయన విజయవాడకు చెందిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు.

లెర్న్ సోషల్ అనే ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ ఫామ్‌కి ఆయన వ్యవస్థాపకుడు - సీఈవో. ప్రస్తుతం ఆయన ఈ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్ని సైతం నిర్వహిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి కోసం తపించే ఆయన ఇంటర్నెట్‌లో భారత్‌కు చెందిన బిలియన్ డాలర్ కంపెనీని ఏర్పాటు చేయాలన్నదే ఆయన లక్ష్యం.

‘‘ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ భారత్. ప్రస్తుతం ఉన్న వారితో పోల్చితే కొత్తగా వచ్చే వినియోగారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వృద్ధులు, మొబైల్ వాడకం దారులు, దేశీయ భాషలు మాట్లాడే వారే అయిఉంటారు. ఈ సెక్షన్ వినియోగదారులంతా వార్తలు, సమకాలీన వ్యవహారాలు గురించి వినాలని, చూడాలని, చర్చించాలని కోరుకుంటారు. ప్రత్యేకించి ఇదంతా ప్రాంతీయ భాషల్లో ఉండాలనుకుంటారు ’’, అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజు.


image


ఇది ఎలా పనిచేస్తుంది

వే2న్యూస్ 30 మంది సభ్యుల టీమ్ ను కలిగి ఉంది. అందులో 19 మంది ఎడిటర్లు. మిగతా వాళ్లంతా మొబైల్ డెవలప్‌మెంట్, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఈ టీమ్ ఆలోచన ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వేరువేరు పద్ధతుల్లో ఆటోమెటిక్‌గా వార్తలను సంక్షిప్తీకరించాలని భావించారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకున్నారు. నిపుణులైన ఎడిటర్లతో కూడిన ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని వారితో చేయించడమే ఉత్తమమని భావించారు.

‘‘మా ప్రొఫెషనల్ ఎడిటర్లు అనేక రకాలుగా వార్తలు అందించే స్థానిక దినపత్రికల్ని, టివి న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్, బ్లాగ్స్ తదితర మార్గాలను పూర్తిగా జల్లెడపడతారు. ఒక్కో న్యూస్ ఐటమ్ సారాంశం ఏమాత్రం పోకుండా 400 అక్షరాల్లో క్లుప్తీకరిస్తారు. ఆ ఆలోచన ద్వారా రీడర్లకు ప్రపంచవ్యాప్తంగా జరిగినే ప్రధాన సంఘటనలు అన్నింటిని కళ్ల ముందు ఆవిష్కరించేలా తెలియజేస్తాం. దీనివల్ల రీడర్లు, కుప్పలు తెప్పలుగా ఉండే భారీ ఆర్టికల్స్‌ని చదువుతూ సమయన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు.’’ అంటారు రాజు.

వీరి టీమ్ ఈ యాప్ ను వేరు వేరు ఉపకరణాలపై పరీక్షిస్తూ పైలెట్ రన్ నిర్వహిస్తోంది, ఫేస్ బుక్ మీద 5,000 మంది వినియోగదారులను సంపాదించుకుంది. దీనికి అదనంగా 400 అక్షరాలతో సారాంశంతో పాటు ఫొటో లేదా వీడియో గ్యాలరీస్ ను అందించడం ద్వారా దృశ్య రూప భావన కల్పిస్తున్నారు. వినియోగదారులు కూడా హెడ్ లైన్స్‌ను చూడటం ద్వారా పెద్ద పెద్ద కథనాల వివరాల మూలాలను తెలుసుకోగలుగుతున్నారు. ఈ యాప్ 2జి, 3జి, వైఫై లో ఇమేజ్ ఆప్టిమేజేషన్, ఇతర టెక్నిక్ ల సాయంతో ఉపయోగించుకునేలా తయారు చేస్తోంది కంపెనీ.

మార్కెట్

వార్తలను దృశ్యరూపంలో లేదా రాతరూపంలో బాగా కుదించండంటూ కోట్లాది అభ్యర్థనలు వస్తున్నాయి. సాధారణంగా వీటి మీద దృష్టిపెట్టడానికి తక్కువ సమయం ఉన్నవారే ఇలా కోరుతున్నారు. ట్విటర్, వైన్, స్నాప్ చాట్ వంటి యాప్స్ బాగా పేరొందడానికి కారణం ఈ అంశాన్ని పాక్షికంగా అనుసరించడమే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి షార్ట్ –ఫామ్ వార్తలను అందించడంలో రారాజుగా వెలుగొందుతోంది సర్కా. వాళ్లు మొత్తం 5.7 మిలియన్ల అమెరికన్ డాలర్ల నిధులు సమీకరించారు, కానీ ఈ ఏడాది ఆరంభంలో వాళ్లు నిరవధికంగా వైదొలగుతున్నట్టు ప్రకటించారు, కాబట్టి వారి బిజినెస్ మోడల్ ను అర్ధం చేసుకోవడం మనకు సాధ్యం కాదు.

భారత దేశంలో వార్తల్ని క్లుప్తీకరించి అందించే ప్రక్రియలో ‘న్యూస్ ఇన్ షార్ట్’ కీలకమైన వ్యాపార సంస్థ. ఈ సంస్థ జులై 2015న టైగర్ గ్లోబల్ నుంచి 20 మిలియన్ యూస్ డాలర్ల నిధులను సేకరించింది. ‘ఇన్ షార్ట్’ పేరుతో కొత్త బ్రాండ్ గా అవతరించి, వార్తలకు ఉన్న హద్దులను చేరిపేయాలన్న లక్ష్యంతో, ఇతర రూపాల్లో కంటెంట్ ను అందించాలని భావిస్తోంది. ఈ రంగంలో క్రక్స్ స్టర్ లాంటి చిన్న వ్యాపారులు ఉన్నారు. వీరు వార్తలను టైమ్ లైన్ ఫార్మెట్ లో ‘‘అసమ్లీ’’ రూపంలో, అటోమెటిక్ గా క్లుప్తీకరిస్తున్నారు.

దేశీయ భాషల విషయానికి వస్తే, న్యూస్ హంట్ ఈ రంగంలో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. పుస్తకాలు, వార్తల రూపంలో ఉన్న దేశీయ విషయాల మీద దృష్టి సారించి గత ఏడాది 100 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రో 250 కోట్లు సేకరించినట్టు రాజు చెబుతున్నారు.


రాజు వనపాల

రాజు వనపాల


మార్కెటింగ్

టైర్2, టైర్3 నగరాలు, పట్టణాల మీద పట్టుసాధించాలని వే2న్యూస్ భావిస్తోంది. సోదర సంస్థ వే2ఎస్ఎంఎస్ ద్వారా భారీగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. అయితే తమ సంస్ధ పెద్ద సంఖ్యలో కస్టమర్లను సంపాదించడానికి భారీగా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా లేదని అంచానా వేశారు రాజు. తమ ఉత్పత్తిని వే2ఎస్ఎంఎస్ ద్వారా టైర్2, టైర్3 పట్టణాల్లో బాగా ప్రాచుర్యం పొందుతాయని నమ్ముతున్నారు. కస్టమర్లను సంపాదించడానికి ఉన్న మరో ఆసక్తికర మార్గం గ్లోబల్ ఎన్ఆర్ఐస్. వాళ్లు తమ రాష్ట్రం లేదా పట్టణాలకు చెందిన స్థానిక వార్తల్ని చదవాలని కోరుకుంటున్నారు.

మార్కెటింగ్ ప్రణాళికలు

వే2న్యూస్ ఆరంభంలో తమ ఉత్పత్తి ద్వారా ఎటువంటి ఆదాయం సమకూరుతుందని భావించడం లేదు. తమ వినియోగదారుల సంఖ్య 20, 30 లక్షలు దాటిన తర్వాతే ఆదాయ మార్గాల మీద దృష్టిపెట్టాలని భావిస్తోంది. కానీ బిజినెస్ టూ బిజినెస్ చానెల్స్ అంటే స్థానిక మరియు ఇతర చానెల్స్ ద్వారా భవిష్యత్తులో ఆదాయం సమకూర్చుకోవావడానికి వీలుగా విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బహుశా ఈ సంస్ధ ఒక ప్రాంతీయ భాషలోని కంటెంట్ మీద దృష్టి పెడుతోంది. అదే సమయంలో ఇంగ్లిష్‌లో కూడా కంటెంట్ ను సంక్షిప్తంగా చేసి అందిస్తుంది.

ఈ కంపెనీ మరికొన్ని వారాల్లోనే తమ ఐఓఎస్ యాప్ ను లాంచ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు సేవలు అందించాలని భావిస్తోంది. భవిష్యత్తులో కంటెంట్ ను పెంచడంతోపాటు మరిన్ని భాషల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

‘‘కంటెంటే కీలకం, ఎటువంటి హడావుడి లేకుండా జనం మధ్యకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం వే2న్యూస్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. తొందర్లోనే మేం మరో ‘ భాషల్లోకి ప్రవేశిస్తున్నాం.’’ అంటున్నారు వే2న్యూస్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ సునీల్ పటేల్.