త్వరలో ఇంటికి గ్యాస్ సిలిండర్ తో పాటు స్వైపింగ్ మెషీన్

జనవరి నుంచి తమిళనాడులో ఇండేన్ గ్యాస్ అమలు

త్వరలో ఇంటికి గ్యాస్ సిలిండర్ తో పాటు స్వైపింగ్ మెషీన్

Thursday December 22, 2016,

1 min Read

క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అంటే అంతే కదా.. కూరగాయల బండి వాడు కూడా పీఓఎస్ పెట్టుకున్నప్పుడు ఎల్పీజీ గ్యాస్ కంపెనీ ఎందుకు స్వైపింగ్ మెషీన్ వాడదు. కచ్చితంగా వాడాల్సిందే. ఆ దిశగా తమిళనాడులో ఇండేన్ గ్యాస్ కంపెనీ ముందడుగు వేసింది. అన్ని ఏజెన్సీలు స్వైపింగ్ యంత్రం వాడాలని నిర్ణయించారు. త్వరలో ఇంటికి సిలిండర్ పట్టుకురావడంతో పాటు స్వైప్ మెషీన్ కూడా తీసుకొస్తారట. జనవరి ఒకటి నుంచి ఇదే పద్ధతిలో గ్యాస్ బండ డెలివరీ చేస్తారు.

కేంద్రం సూచనల ప్రకారం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ల కోసం తమవంతు పాత్ర పోషిస్తామని ఇండేన్ గ్యాస్ సంస్థ తెలిపింది. వచ్చే జనవరి 1నుంచి అందరికీ మెషీన్లు అందిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎన్ని అవసరం వస్తాయో ఇప్పటికే బ్యాంకుకు తెలిపామని.. అవి రావడమే ఆలస్యమని ఆయన అంటున్నారు.

image


పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా జనం డబ్బుల కోసం పడే అవస్థలు రోజూ చూస్తునే ఉన్నాం. ఏటీఎంల దగ్గర ఎంత క్యూ ఉందో, బ్యాంకుల వద్ద ఎలా పడిగాపులు కాస్తున్నారో తెలియంది కాదు. ఏటీఎం మెషీన్లో డబ్బు సర్దడమే ఆలస్యం కొన్ని గంటల్లోనే నగదంతా ఆవిరైపోతోంది. ఒక్కో ఏటీఎంలో రోజుకి ఎంతలేదన్నా ఐదారుసార్లు క్యాష్ కన్ఫిగర్ చేస్తున్నారు.

క్యాష్ లెస్ ఎకానమీ అన్న పదం ఇప్పుడిప్పుడే రియాలిటీలోకి వస్తోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొదలుకొని చిన్నచిన్న వ్యాపారులు కూడా ఆన్ లైన్ పేమెంట్లను అంగీకరిస్తున్నారు. పేటీఎం, ఫ్రీచార్జ్ లాంటి ప్లాట్ ఫాం ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. డిమానిటైజేషన్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్ క్రమంగా డిజిటలైజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం, అక్కడి గ్యాస్ సంస్థలు తీసుకున్న నిర్ణయం ఎంతైనా అభినందనీయం.