సైకిల్‌పై 2120 కిమీ ప్రయాణం ఏం నేర్పింది ?

ఇద్దరు ఐఐటి విద్యార్థుల సాహసోపేతమై నిర్ణయంకోల్‌కతా నుంచి ముంబైకి సైకిల్ యాత్రరెండు సైకిళ్లు, ఐదు వారాలు దాదాపు 2120కిలోమీటర్ల ప్రయాణంఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులుమ్యాడ్నెస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రాచుర్యంలోకొచ్చిన సిద్ధార్థ్, ఉజ్వల్

సైకిల్‌పై 2120 కిమీ ప్రయాణం ఏం నేర్పింది ?

Sunday June 21, 2015,

5 min Read

మీరు ఇంజనీర్ అయితే ఏం చేస్తారని.. ఎవరైనా ప్రశ్నిస్తే బహుశా సమాధానం ఏమని వస్తుంది ? 'సైకిల్ పై ఊరూరూ తిరుగుతూ... జనానికి సేవ చేస్తా' అనే సమాధానం అయితే రాదు కదా ! కానీ ఇక్కడొక ఔత్సాహికుడు మాత్రం అదే చేశాడు. 

ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ప్రయాణం. కొన్ని రోజుల పాటు.. కొన్ని కిలోమీటర్లు సాగింది. దానిపై అంచనాలు సైతం పెద్దగా లేవు. కొత్త అనుభవాలు.. సరికొత్త అనుభూతులతో ముందుకు సాగింది. తర్వాతి టార్గెట్ ఖరగ్‌పూర్ నుంచి కోల్‌కతా 130కిలోమీటర్లు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సాదా సీదా ప్రయాణంలా అయితే లేదు. ఓ అర్థవంతమైన ప్రక్రియలా వారికి అనిపించింది. భవిష్యత్‌లో సాధించబోయే గొప్ప ఆశయానికి చిగురు తొడిగింది ఇక్కడే. 

image


సిద్దార్థ అగర్వాల్, ఉజ్వల్ చౌహాన్ ఇద్దరూ ఐఐటి ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. సహజ సంపదను కాపాడటానికి వారు మొదలు పెట్టిన ఓ మహత్తర కార్యమే మ్యాన్ అండ్ సైకిల్. ప్రయాణంలో దూరాలను దాటుకుంటూ.. గొప్ప సంకల్పంతో ఫండ్స్‌ను సేకరించడం మొదలు పెట్టారు. ఆ సొమ్ముతో ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపారు. కొన్ని ఎన్‌జిఓలైన రంగ్ దే, చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ (సిఆర్ వై) కి భారీగా ఫండ్స్ సేకరించి పెట్టారు. ఇదే వీరిద్దరూ కోల్‌కతా నుంచి ముంబైకి దాదాపు 2120 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ప్రయాణించేలా చేసింది. అయితే ఇది అంత సులువైన విషయమైతే కాదు. అక్కడి రోడ్లు ఊహకు అందనివి. రోడ్ ఉంటే సరేసరి. కానీ కొండ వాలున్నప్పుడు చాలా కష్టమయ్యేది. అదే కొండపైకి ఎక్కాలంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా వదులుకోవాల్సిందే. మంచి సైకిల్ కనుక లేకపోతే ఇక అంతే సంగతులు.

ఢియోఘడ్, ఒడిషా

ఢియోఘడ్, ఒడిషా


రోజుకు 150 కిమీ వరకూ ప్రయాణించాల్సి వచ్చేది

సిద్ధార్థ్ మాటల్లో.. ''బాటిల్ తో మంచినీళ్లు తాగుతునే ఉండాలి. ఎందుకంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది జరిగాక ఇక చేయడానికి ఏమీ ఉండదు. సైకిల్ యాత్ర పాదయాత్ర కంటే కష్టమే. అవసరానికి మించి మరేదీ సైకిల్ యాత్రలో మనవెంట తీసుకొని వెళ్లలేం. ఎందుకంటే అక్కడ గడవడమే ముఖ్యం కానీ లగ్జరీ కాదు. హోమ్లీ లాడ్జీలో రెస్ట్ తీసుకోవడం కుదరని పని. ఎక్కడ ఏం దొరకితే దాన్ని తిని అజ్జెస్ట్ కావాల్సిందే.

బస్నా నుంచి రాయ్పూర్ 13 కిలోమీటర్లు. చూడ్డానికి చిన్న దూరంగానే ఉన్నప్పటకీ చాలా కష్టంగా గడిచిందా ప్రయాణం. రోజులో ఎక్కవ గంటలు 48డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో యాత్ర చేయాల్సి వచ్చింది. హైవేలో ఉన్న దాబాలోనే తినాల్సి వచ్చింది. తినటానికి అంతకు మించి ఒక్క అడుగు కూడా పక్కక పోవడానికి అవకాశం లేకపోయిందని'' సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

భారత్ అంతా యాత్ర చేసే ఆలోచన ఏమైనా ఉందంటే.. నవ్వుతూ సిద్ధార్థ్ ఇలా చెప్పుకొచ్చారు. తాము చేసిన 2120కిలోమీటర్లకు భారతీయ బ్యాక్ప్యాకర్స్ సాయం అందించారు. అలాంటి సాయం అందిస్తే తాము చేయడానికి వెనకాడమన్నారాయన. తమ యాత్రలో దాదాపు 80కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సేదతీరాలని మొదట నిర్ణయించుకున్నారట. కానీ అలా కుదరని పక్షం లో మరో 80నుంచి 90కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదట. అప్పటికీ తాము స్టే చేయడానికి సరైన జాగా దొరక్క పోతే ఇంకొంత దూరం ప్రయాణం కొనసాగించేవారట. ఇదొక మోస్ట్ మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చిరునవ్వుతో అంటారాయ. ఇలాంటి యాత్ర చేయడానికి కచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. అలా కాని పక్షంలో తమ కాళ్లను వదులుకోడానికి సిద్ధపడాలని, సైకిల్ యాత్రలో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తారు. 

ట్రిప్స్ ప్రారంభించిన రోజు తాము ఫిట్ గా ఉన్నామా లేదా అని చూసుకోలేదట. మనసులో మెదిలిన ఆలోచన్ని ఆచరణ లో పెట్టారంతే. మనసులో చేయగలమనే దీమా ఉంటే అదే వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తుందన్నారు సిద్ధార్థ్

సిద్ధార్థ్, ఉజ్వల్ (అహ్మద్ నగర్ లో)

సిద్ధార్థ్, ఉజ్వల్ (అహ్మద్ నగర్ లో)


ఆ రిక్షా కార్మికుడే మాకు స్ఫూర్తి

ఒక రిక్షా కార్మికుడిని కోల్‌కతాలో కలిసాను. అతడు కోల్‌కతా నుంచి లేహ్ వెళ్తున్నాడు. అతనికి సాధ్యపడిన పని నాకెండుకు సాథ్యం కాదని అనుకున్నానని ఆ కధను వివరించారు సిద్ధార్థ్. మీరు ముసలివాళ్లైయ్యాక మీ జీవితంలో అధిగమించిన మైలు రాళ్లను నెమరవేసుకుంటారు. కొన్నిసార్లు రోడ్ పైనో లేదా మార్కెట్ లోనో మీరు ఇరుక్కున క్షణాలు బహుశా ఉండొచ్చు. అప్పుడు మొదలైంది చిన్న ప్రయాణమైనా అవి జీవితాంతం గుర్తుంటాయని కదా. అన్నారు సిద్ధార్థ్ .

''ఛత్తీస్‌గడ్‌లోని రాజనాథ్ గావ్‌లోని అనుభవం ఒకటుంది. రాత్రి 8.30 అయింది. రాత్రి స్టే చేయడానికి హోటల్ వెతుకుతున్నాం. రోడ్‌పై వెళ్తుండగా ఒక పెద్దాయన కనపడ్డారు. తమని పలకరించి మేం ఎక్కడికి వెళ్తున్నామో వాకబు చేశాడు. టూర్ గురించి చెబితే. . మా ఆతిథ్యం తీసుకోవాలని మొహమాటం పెట్టారు. వాళ్ల ఊరు వచ్చిన అతిథులు కనుక తనింటికి కచ్చితంగా రావాలంటూ ఆ పెద్దాయన తీసుకెళ్లాడు.’ అక్కడుండటం సేఫ్ అనిపించడంతో మేం ఆ రాత్రికి ఆ పెద్దాయన ఇంట్లో ఉన్నాం. అతని స్నేహితులు ఇద్దరిని కలిసాం. అందులో ఒకరు జర్నలిస్ట్. దీంతో ఆ తర్వాత రోజు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొనే అవకాశం లభించింది. స్థానిక వర్కర్స్‌తో కలిసాం. అక్కడున్న సమస్యల గురించి వారితో చర్చించాం''.

ఒడిషా లోని కెండూజా సమీపంలో

ఒడిషా లోని కెండూజా సమీపంలో


భారీ వర్షం, భగభగమండే రోడ్లతో సావాసం

సైకిల్ యాత్రలోని ఒక్కో అనుభవం ఒక్కో మధురానుభూతిని మిగిల్చింది. ప్రకృతితో ఎంత దగ్గర సంబంధం ఉందనే విషయం స్పష్టంగా అర్థమైందిక్కడ. ఒడిషాలో ఉన్నప్పుడు సిమిలీపాల్ నేషనల్ పార్క్ కు వెళ్తున్నాం. అప్పుడే ఉదయిస్తున్న భానుడి కాంతితో చక్కగా ఉంది. దాబాలోనే నిద్రపోదామని అనుకున్నాం. ఉదయం ఎనిమిదిన్నర దాటింది. సైకిల్ యాత్ర ప్రారంభిద్దామనే సమయానికి భోరున వర్షం పట్టుకుంది. అప్పుడే నేచర్‌లో నేను మమేకం కావాలనే ఆశ కలిగింది. మాటలకు అందని అనుభూతిని పొందానన్నారు సిద్ధార్థ్.

కొన్ని సార్లు రోడ్లన్నీ ఎంతో వేడిగా ఉంటాయి. అయితే సైకిల్ తొక్కడం ఆపడానికి అవకాశం చిక్కదు. పెడల్ కిందకు పడినప్పుడు రోడ్డు వేడి కాలికి తాకుతుంది. వెంటనే దాన్ని పైకి తీస్తే రెండో పాదానికి అదే రకమైన వేడి. దీంతో వెంటవెంటనే పెడల్ వేస్తూ ఫాస్ట్ గా సైకిల్ తొక్కాల్సి వస్తుంది. సోషల్ కాజ్ కోసం చేస్తున్న ఈ యాత్రలో రోడ్ వేడిగా ఉన్నా.. మరేదైనా ప్రయాణం ఆపకూడదనే సంకల్పం మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. ఇలాంటి ఎన్నో అనుభవాలు మరపురాని క్షణాలుగా మనసులో మిగిలేలా చేశాయి.

పశ్ఛిమ కనుమల్లో  చివరిరోజు ప్రయాణం

పశ్ఛిమ కనుమల్లో చివరిరోజు ప్రయాణం


ఎదురుగా కొండలు.. చూస్తే పంక్చర్ అయిన టైర్ !

అది అకోలా అనుకుంటా. మేం జన్నా వెళ్లడానికి యాత్ర ప్రారంభించాం. కానీ సైకిల్ టైర్ పంచర్ అయింది. పంక్చర్ వేసినప్పటికీ టైర్ పూర్తిగా పాడుకావడంతో అసలు సమస్య మొదలైంది. సమీప గ్రామం నుంచి దాదాపు 5కిలోమీటర్లు వచ్చేశాం. ముందుకు వెళితే మరో 15కిలోమీటర్ల దాకా టౌన్ లేదు. అటవీ ప్రాంతం కావడం వల్ల ఎత్తైన కొండలు , లోయలు తప్పితే మా కళ్లకు ఇంకేమీ కనిపించడం లేదు. టైర్లు కావాలంటే టౌన్ దాకా వెళ్లాలి. రోడ్ పక్కన సైకిళ్లు పెట్టి.. అక్కడే కూర్చొని మా పరిస్థితి చూసి నవ్వుకున్నాం. దాదాపు అరగంట సేపు నవ్వుతూ అక్కడే గడిపాం. మా సహనానికి ఓ పరీక్షలా సాగిన ఆ క్షణాలు మాకు, దేన్నైన్నా అంగీకరించాలనే తత్వాన్ని నేర్పించాయి.

మేం ఇతరులకు చేసిన సాయం కంటే.. ఈ యాత్ర ద్వారా మేమే ఎక్కువ లబ్ధి పొందాం. మేం అన్ని రకాలుగా ఎదిగాం. మా ఆలోచన స్థాయి పెరిగింది. మనుషుల్లో ఇంతకంటే మార్పు ఇంకేముంటుంది.

చాలా రకాలైన కథలను తెలుసుకున్నాం. ఎన్నో బాధలను ఓపికతో విన్నాం. వారికి సాయం చేయాలని సంకల్పించాం. దాన్ని యాత్ర ద్వారా ప్రారంభించాం. భవిష్యత్ లో మరిన్ని సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందున్న సమస్యల్లో మొదటిది మైక్రో ఫైనాన్స్. ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించాలనేది మా ముందున్న సవాలు. తర్వాత చైల్డ్ లేబర్, చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి వాటిపై దృష్టిసారిస్తాం అని సిద్దార్థ్ వివరించారు.

సిద్దార్థ అగర్వాల్, ఉజ్వల్ చౌహాన్

సిద్దార్థ అగర్వాల్, ఉజ్వల్ చౌహాన్


సమస్యలన్నీ పరిష్కరించలేకపోవచ్చు.. ప్రయత్నం చేస్తాం !

రంగ్ దే కోసం మేం పనిచేసినప్పుడు మాకు ఎదురైన అనుభవం ఇది. పాన్ షాప్ నడుపుతున్న ఒక మహిళను కలిసాం. పాన్ షాప్ నుంచి కూరగాయల షాపుకి తన వ్యాపారం విస్తరించాలనుకుందామె. అలాంటి వారికి చేసే ఓ చిన్న సాయం వారి జీవితంపై ఎంతటి ప్రభావితం చూపిస్తుందో అప్పుడు మాకు అర్థమైంది. ఇలాంటి ఎన్నో అనుభవాలు మాకు అవగతమయ్యాయి. దాబాల్లో సాధారణంగా బాలకార్మికులు ఇక్కడ పనిచేయరంటూ బోర్డ్ ఉంటుంది. కానీ అక్కడ పనిచేసే వారిలో ఎక్కువ మంది చిన్నారులే. ఇలాంటివి చూసినప్పుడల్లా సిగ్గుతో తల వంచుకునేలా చేస్తుంది. ఇది తీసి పారేసే సమస్యైతే కాదుకదా. ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కుంది. వారి బాల్యాన్ని చిదిమేయడం ఎంతవరకూ కరెక్టో మీరే చెప్పండి. అలా అని ప్రతీ ఒక్క చిన్నారినీ మనం ఉద్దరించలేం కదా అని ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేయడం సరికాదు అంటారాయన. స్కూళ్ల విషయంలోకూడా ఎన్నో రకాలైన వ్యత్యాసాలున్నాయి. నాగ్‌పూర్ లో చిన్నారులు పబ్లిక్ స్కూళ్ల వంక అసలు చూడరు. ప్రైవేట్ పాఠశాల్లో మాత్రమే చదువుని కొనసాగిస్తున్నారు. అదే అహ్మద్ నగర్ లో అయితే అక్కడ ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. తమ యాత్రతో దేశాన్ని మొత్తం మార్చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ అది తమతో మాత్రమే సాధ్యపడుతుందని సిద్ధార్థ్ అనుకోవడం లేదు. ఎందుకంటే తము చేసిన పనితో ఏ కొద్దిగ మార్పు తీసుకు రాగలిగినా అది భవిష్యత్ పై ప్రభావితం చూపితే చాలంటారు సిద్ధర్థ్.

జీవితంలో ఏం సాధించామనేది ముఖ్యం కాదు. కష్టమైన పని అయినా ఇష్టంతో సాధించడంలో పొందే సంతోషమే వేరు. ఏదైనా చేయాలనుకుంటే.. నిన్ను ఎవరూ ఆపలేరు.. నీకు నువ్వు తప్ప. 2120కిలోమీటర్ల యాత్ర చేసిన తర్వాత తాము నేర్చుకున్న సత్యం ఇదేఅని ఈ సాహసికులు అభిప్రాయపడ్డారు.