‘జామప్’ ఉండగా, డీజేలు ఎందుకు?

డీజేల అవసరం లేకుండా సొంత జ్యూక్ బాక్స్ తయారు చేసుకునే వీలు కల్పిస్తున్న ‘జామప్’మీరే పార్టీ హోస్ట్ చేసుకునే అవకాశంయూజర్‌తో పాటు ఫ్రెండ్స్ కూడా ఈ యాప్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం.

0

మీరు వెళ్లే పార్టీల్లో చాలా సార్లు అక్కడ ప్లే చేసే పాటలు నచ్చకపోవచ్చు. అక్కడున్న డీజేని ఎన్నో సార్లు బతిమాలితే గాని మీకు నచ్చిన పాట ప్లే చేసే అవకాశం లేదు. కాని ఇప్పుడు అలాంటి పరిస్ధితులు ఎదురుకోవాల్సిన అవసరం లేదు, యాప్స్ డెవలప్ చేసే ‘మూజిక్’ అనే కంపెనీ, ఎవరైన తమ స్మార్ట్ ఫోన్ తోనే ఆపరేట్ చేసే విధంగా ‘జామప్’(Jammup) అనే జ్యూక్ బాక్స్‌ని తయారు చేసింది.

ప్రస్తుతం ‘జామప్’ ఆండ్రాయిడ్ ఫోన్లలోనే అందుబాటులో ఉంది. ‘జామప్’ ద్వారా తమ ఇంట్లో, కాలేజ్ లో, లేక ఇంకే ప్రదేశమైనా సరే, తమ సొంత జ్యూక్ బాక్స్ తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌లో రెండు ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి జ్యూక్ బాక్స్ మోడ్, రెండోది రిమోట్ మోట్. జ్యూక్ బాక్స్ మోడ్‌లో యూజర్ పార్టీని హోస్ట్ చేసి, తమ సెల్ ఫోన్ తోనే పాటలు ప్లే చేయవచ్చు, ఇక ఆ డివైస్‌కే కనెక్ట్ అయ్యి పాటలు రిక్వెస్ట్ చేసుకునే వీలు కూడా ఉంది.

జ్యూక్‌బాక్స్ మోడ్

జ్యూక్ బాక్స్ మోడ్‌లో మ్యూజిక్ ప్లే చేసే హోస్ట్‌గా మీ ఫోన్ తన రోల్ నిర్వహిస్తుంది. ఇక అందరి లాభం కోసం మీ ఫోన్‌ను స్పీకర్స్‌కి కనెక్ట్ చేస్తే మంచిది. ఇళ్లల్లో, కాలేజ్ లో , ఆఫీస్ లేదా మరే ప్రదేశమైన తమ జ్యూక్ బాక్స్ క్రియేట్ చేసుకునే వీలు కల్పిస్తుంది, ఈ యాప్. జ్యూక్ బాక్స్ క్రియేట్ చేయడంతో పాటు పాస్ వర్డ్ తో దాన్ని సేఫ్ కూడా చేయవచ్చు, దీని వల్ల మీ పార్టీలో ఉన్నవారు మత్రమే మీ జ్యూక్ బాక్స్ లోని పాటలను రిక్వెస్ట్ పంపవచ్చు.

రిమోట్ మోడ్

తమ ఫోన్ సహాయంతో ఇతరుల జ్యూక్ బాక్స్ ను కనెక్ట్ అవ్వడం రిమోట్ మోడ్. ఇక్కడ యూజర్ కనెక్ట్ అయిన జ్యూక్ బాక్స్ ప్లే లిస్ట్ కు యాక్సెస్ ఉంటుంది. వెంటనే తనకు కావాల్సిన పాట కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. యూజర్ తన యాప్ తెరిచిన వెంటనే తన చుట్టూ ‘జామప్’ వాడుతున్న పార్టీల వివరాలు తెలుస్తాయి, యాప్ సహకారంతో ఆ పార్టీని యాక్సెస్ చేసుకోవచ్చు, ఒకవేల ప్రైవేట్ పార్టీ అయితే, అక్కడి పాస్ కోడ్ తెలిస్తేగాని ఆ పార్టీని యాక్సెస్ చేయలేరు.

ఇక ఈ యాప్ ఈమేల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యే అవకాశం లేదు, సోషల్ లాగిన్ లేనిది ఆ యాప్ వాడలేరు. ఇప్పటికే 100-500 వరకు యాప్ స్టోర్లో ఇన్ స్టాల్స్ అయ్యాయి. పాల్ గ్రాహం చెప్పినట్టు, మీరు చేసిన పని వల్ల చిన్న సమస్య తీరినా, అది ఎక్కువ మంది కోసం ఉండాలి, లేదా, తక్కవ మందికి ఉపయోగపడే పెద్ద సమస్య తీర్చగలిగే పనైనా చేయాలంటారు. ఈ యాప్ ఆ ఇద్దరి మధ్య ఉన్నట్టు ఉంది. ఇక ఈ యాప్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.