చిన్న బడ్జెట్.. పెద్ద సొల్యూషన్

క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌తో "మై అకౌంట్స్"

చిన్న బడ్జెట్.. పెద్ద సొల్యూషన్

Monday November 23, 2015,

2 min Read

పెద్ద పెద్ద వ్యాపారాలకైతే సాధారణంగా అకౌంట్ సొల్యూషన్ కోసం సెపరేట్ బడ్జెట్ ఉంటుంది. కానీ ఎటొచ్చీ చిన్న చిన్న వ్యాపారాలకే ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం అంటే- కొంచెం కష్టమైన పనే. కిరణా షాపులు, బేకరీలు, గార్మెంట్ షాపుల్లాంటి వాటికి బిల్లింగ్ సొల్యూషన్ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాలంటే ఆలోచించాలి. కానీ అలాంటి వ్యాపారానికి కూడా బిల్లింగ్ సొల్యూషన్ వారు అనుకున్న బడ్జెట్ లోనే అందిస్తోంది మై అకౌంట్స్.

image


ఇలా మొదలు

2004లో హైదరాబాద్‌ చిక్కడపల్లిలో శివ ప్రయాణం మొదలైంది. బిజినెస్ సొల్యూషన్. మొదట్లో కాన్సెప్టు బాగుందని అనేవారు కానీ ఎవరూ ప్రాడక్ట్ తీసుకోడానికి పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పదకొండేళ్ల ప్రయాణంలో 1500లకు పైగా స్టోర్లకు సొల్యూషన్ అందించారు. ఇప్పుడు బిటుబి తోపాటు బిటుసి ప్లాట్ ఫాంలో 2వేలకు పైగా క్లెయింట్స్ ఉన్నారు. ఆన్ లైన్ లో ప్రతి రోజూ ఒక కొత్త క్లెయింట్ జాయిన్ అవుతునే ఉన్నాడు. వైజాగ్, విజయవాడల్లో బ్రాంచీలున్నాయి. అక్కడ కూడా సేవలను మరింతగా విస్తరించాలనేది శివ లక్ష్యం.

మై అకౌంట్స్ టీం

శివనారాయణ మై అకౌంట్స్ ఫౌండర్. ఎంకామ్, ఎంబియే చదివిన శివ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా, వెబ్ డెవలపర్ గా పనిచేస్తూ 2004లో ఈ వెంచర్ ప్రారంభించారు. వెంచర్ ప్రారంభంలో ఒన్ మ్యాన్ ఆర్మీగా ఉండేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు శివ. మూడేళ్ల పాటు వ్యాపారంలో లాభం రాలేదు, అలాగని నష్టపోలేదు. తర్వాత మార్కెటింగ్ వ్యవహలను చూసుకోడానికి రెండో ఉద్యోగిని అపాయింట్ చేశారు. ఇప్పుడు మొత్తం 30మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆఫ్ రోల్ లో కూడా కొంతమంది దీనికోసం పనిచేస్తున్నారు.

మై అకౌంట్స్ సేవలు

1. చిన్న తరహా వ్యాపారులకు బిల్లింగ్ సొల్యూషన్ అందిస్తారు. చిన్న చిన్న బేకరీ, కిరణా, గార్మెంట్స్ లకు బిల్లింగ్ సాఫ్ట్ వేర్ తోపాటు , ఎల్ఈడీ, ప్రింటర్లను అందిస్తారు.

2. షాపింగ్ మాల్స్ కు సరిపడా క్లౌడ్ మేనేజ్మెంట్ తో సొల్యూషన్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలా షాపింగ్ మాల్స్ వీరికి క్లయింట్స్ గా ఉన్నారు.

3. డ్యాష్ బోర్డ్, అప్లికేషన్ సెటప్, అటెండెంట్స్ అండ్ పేరోల్, ఫినాన్స్ అకౌంట్స్, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, వేర్ హౌస్ మేనేజ్‌మెంట్‌ , పొక్యూర్మెంట్, ఇన్వెంటరీ, పిఓఎస్ బిల్లింగ్ లాంటి ఎన్నో సేవలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చారు.

4. చిన్న వ్యాపారులతో పాటు చిన్న నగరాలకు సేవలను విస్తరిస్తూ దూసుకు పోతున్నారు. దీంతో పాటు విదేశాలకు కూడా వీరి సేవలను ఇప్పటికే విస్తరించారు.

5. సిటీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో మై అకౌంట్స్ సేవలు విస్తరించాయి. అన్ని స్టోర్లకు ఈ అవసరం ఉంటుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా క్లౌడ్ మేనేజ్మెంట్ తో దీన్ని మెంటేన్ చేయొచ్చు.

image


సవాళ్లు, పోటీదారులు

క్లౌడ్ మేనేజ్‌మెంట్‌ వచ్చిన తర్వాత ఈ తరహా సేవలు ఆన్ లైన్ లో లభిస్తున్నాయి. అయితే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి చాలా రకాల స్టార్టప్ లు అందిస్తున్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సేవలను అందించడానికి గ్లోబల్ మార్కెట్ నుంచి స్థానిక మార్కెట్ లో చాల రకాల సంస్థలున్నాయి. అయితే స్థానికంగా పదేళ్ల నుంచి తామీ సేవలను అందిస్తున్నామని, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి అందుబాటులో ఉంటామనే నమ్మకం తమ సంస్థపై కస్టమర్లకు కల్పిస్తామని, దీంతో ఎలాంటి పోటీనైనా తట్టుకోగలమనే అంటున్నారు శివ

భవిష్యత్ ప్రణాళికలు

క్లౌడ్ మేనేజ్మెంట్ లోకి పూర్తి స్థాయి సేవలను తీసుకు రావాలని చూస్తున్నారు. వెబ్ సైట్ కు అనుసంధానంగా యాప్ ప్లాట్ ఫాంలోకి సేవలను విస్తరించాలనుకుంటున్నారు. దీంతో పాటు బిజినెస్ డెవలప్ మెంట్ సేవలైన మెయిలింగ్, బల్క్ ఎస్ఎమ్ఎస్ లాంటివి ఇప్పటికే ప్రారంభించారు. వాటిని మరింత విస్తరించాలనుకుంటున్నారు.