మీ ఆటోమొబైల్ అడ్వైజర్‌ - కార్ ఓకె

కార్ల యజమానులకు రిలీఫ్ కలిగించే వార్త. మెకానిక్ లతో వాగ్వాదాలు, సర్వీసింగ్ సెంటర్ల చుట్టూ తిరగడాలు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది కార్రోకే. అంతేకాదు కారు నిర్వహణ కోసం మీరు పెట్టే ఖర్చు 30 శాతం తగ్గించేస్తామని భరోసా కూడా ఇస్తోంది. మీ కార్లకు సంబంధించి పర్సనల్ ఎడ్జ్వైజర్ (వ్యక్తిగత సలహాలదారు)గా సంస్థ పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

0

మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కొనాలన్నా, ఆరోగ్య సంబంధిత బీమా పాలసీలు తీసుకోవాలన్నా అర్ధిక రంగ నిపుణుల సలహాలు తీసుకుంటాం. నలుగురైదుగురితో చర్చించి కానీ ఓ నిర్ణయం తీసుకోలేం. ఎందుకంటే అదంతా డబ్బుకు సంబంధించిన మ్యాటర్. మన భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. కానీ మనం ఓ ముఖ్యమైన పెట్టుబడి అంటే కార్లకి సంబంధించి పూర్తిగా మెకానిక్స్, సర్వీసింగ్ సెంటర్ల మీద ఆధారపడతాం. మనకు తెలియని సమస్యలకు అతిగా బిల్లులు వసూలు చేసే అవకాశం ఉంటుంది.

మధ్యతరగతి వర్గాలకు ఇంటి తర్వాత అత్యంత ముఖ్యమైన పెట్టుబడి కారు. కారు విషయంలో అందరూ మెకానిక్స్ లేదా సర్వీస్ సెంటర్ల మీద ఆధారపడాల్సిందే. మన కారుకి సంబంధించి అసలైన విషయాల్సి స్పష్టంగా తెలియజేసే వ్యక్తిగత సలహాదారులు ఎవ్వరూ ఇంత వరకు లేరని అంటున్నారు కార్ఓకె సహ వ్యవస్థాపకుడు, సీఈవో భూపేందర్ సావంత్.

ఈ లోటును భర్తీ చేయడానికి ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు. భూపేందర్ సావంత్, ధీమాన్ కదమ్, హేమంత్ పటేల్ ఈ ముగ్గురు కలిసి కార్ఓకె అనే స్వతంత్ర కన్సెల్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పూణెలోని ప్రతి కార్ ఓనర్‌కు, సర్వీసింగ్‌కు సంబంధించి వ్యక్తిగత సలహాదారుగా సేవలు అందిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్లకు సర్వీస్ సెంటర్లు ఏమీ లేవు. కార్ యజమానులకు, సేవలు అందించే సంస్ధలకు మధ్య వారధిగా పనిచేస్తారు. మీ కార్ సర్వీసింగ్ సమయానికి పూర్తయ్యేలా, సర్వీసింగ్ సమర్ధవంతంగా చేసేలా చూడటం వీరి బాధ్యత.

ఈ ముగ్గురికి, ఐటి, అటోమొబైల్ మరియు కస్టమర్ సర్వీస్ రంగాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది. కస్టమర్లు, డీలర్ షిప్, వెండర్స్ అందరినీ ఒక ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నారు. కస్టమర్లను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేందుకు సాంకేతికంగా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది ?

కార్ఓకె అపాయింట్‌మెంట్ కోసం కారు యజమానులు ముందే రిక్వెస్ట్ పెట్టాలి. ఆ తర్వాత కంపెనీ ఉద్యోగి,యజమానులు చెప్పిన చోటుకు వచ్చి కార్‌ను పరీశీలించి అన్‌లైన్ జాబ్ కార్డ్‌ను తయారు చేసి, కార్‌ను సర్వీస్ స్టేషన్ కి పంపిస్తారు.

సర్వీస్ సెంటర్‌లో కార్ లోపాలన్నింటిని కార్ఓకె చెప్పినట్టుగా సరి చేస్తారు. ఆ తర్వాత నేరుగా కస్టమర్ల ఇంటికే కారును పంపిస్తారు. కస్టమర్లు ఇంటి దగ్గరే బిల్ పే చేస్తారు. కార్ సర్వీసింగ్, లోపాలను సరిదిద్దడం గురించి కార్ఓకె ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది.

‘‘మీ సర్వీసింగ్ బిల్లులు 30 శాతం తగ్గడం గ్యారెంటీ’’

కారుకి సంబంధించి ఏ సమస్య అయినా సరే, సర్వీసింగ్ నుంచి సాధారణ చెకప్ వరకు ఏ విషయంలోనైనా, మా ఎగ్జిక్యూటివ్ అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, కార్ ఉన్న స్థితిని బట్టి జాబ్ కార్డ్‌ను సిద్ధం చేస్తారని భూపేందర్ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై కార్ఓకె కి పూర్తి నియంత్రణ ఉంటుందని, డీలర్లు అడ్డగోలుగా అదనపు బిల్లులు వేసే అవకాశమే ఉందడని భరోసా ఇస్తున్నారు.

కార్ఓకె టీమ్
కార్ఓకె టీమ్

ఈ వ్యవస్థ సామాజిక చొరవతో నడుస్తుంది. కారు టైర్లు, బ్యాటరీలు, ఇతర విడిభాగాలు, అలంకరణ సామగ్రి సరఫరాదారులతో కార్రోకే కి ఒప్పందాలు ఉన్నాయి. కార్ఓకె వార్షిక సభ్యత్వాన్ని అందిస్తుంది. 1600 సీసీ లోపు కార్లకు ఏడాదికి రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. 1600 సీసీ కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న కార్లకు రూ.1800 చెల్లించాలి. దీనికి ట్యాక్స్ అదనం.

ఈ సరికొత్త వ్యాపార సేవలను వినియోగించుకునేందుకు మొదటగా 1500 మంది వినియోగదారులు ఆసక్తి చూపించారు. వీరిలో 70 శాతం మంది వార్షిక సభ్యత్వం తీసుకున్నారు. ‘‘ ప్రస్తుతం మా దగ్గర పెద్ద సంఖ్యలో వినియోగదారులు లేరు, భారీఎత్తున వ్యాపారం చేయడానికి బ్రాండ్ ఇమేజ్ ఏర్పర్చుకోవడానికి మా దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేవు. మేం నెమ్మది నెమ్మదిగానే విస్తరించాలనుకుంటున్నాం. నెలకు 200 మంది కొత్త వినియోగదారులను సంపాదించాలనుకుంటున్నాం’’ అంటూ భూపేందర్ తమ లక్ష్యాన్ని వివరించారు.

దేశం మొత్తం మీద దాదాపుగా మూడు కోట్ల ఫోర్ వీలర్స్ ఉన్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం పర్సనలైజ్డ్ ఎడ్వైజరీ (వ్యక్తిగత సలహాల)రంగంలో దాదాపు రూ. 4,200 కోట్ల మార్కెట్‌కి అవకాశం ఉంది. కార్ఓకె రూ. 500 కోట్ల రూపాయల మార్కెట్ వాటా మీద దృష్టి సారించింది.

కంపెనీ త్వరలోనే ముంబైలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆ తర్వాత సూరత్ తో సహా 10 నగరాలకు ఫ్రాంచైజీ పద్ధతిలో విస్తరించనున్నారు. దీంతో పాటుగా కార్ఓకె ఆర్టీవోల చేత గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్‌ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బి టూ సి(బిజినెస్ టూ కస్టమర్), బి టూ బి (బిజినెస్ టూ బిజినెస్) కార్ విభాగాల్లో బలమైన పునాదులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Feeling good to present and getting inspired as well from "your story".

Related Stories

Stories by Lakshmi Dirisala