తెలంగాణ పోలీస్ ఖతర్నాక్.. డీజీపీల సదస్సులో ప్రధాని ప్రశంస

పీఎంను ఆకట్టుకున్న రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థ

తెలంగాణ పోలీస్ ఖతర్నాక్.. డీజీపీల సదస్సులో ప్రధాని ప్రశంస

Tuesday November 29, 2016,

2 min Read

బందోబస్త్ నిర్వాహణ నుంచి టెక్నాలజీ వాడకం వరకు తెలంగాణ పోలీస్ నంబర్ వన్ అని ప్రశంసించారు ప్రధాని మోడీ. దేశంలోనే దిబెస్ట్ పోలీసింగ్ ఆయన కొనియాడారు. హైదరాబాదులో మూడు రోజుల పాటు జరిగిన డీజీపీ సదస్సులో ప్రధాని తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్ర పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు.. వాటి నుంచి వచ్చిన ఫలితాల గురించి డీజీపీల సదస్సులో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అవలంభిస్తున్న ప్రెండ్లీ పోలీసింగ్ తీరుపై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రలో టెక్నాలజీ వాడకంలో పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలపై 15నిమిషాల పాటు ఈ సదస్సులో ప్రజెంటెషన్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా హ్యాక్ ఐ యాప్, వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా ప్రజల ఫిర్యాదులు తీసుకుని అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్ సదస్సులో అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు నిమిషాల్లోనే ఆన్సర్ రావడం... గంటల్లోనే యాక్షన్ తీసుకోవడం.. ఈ విధానం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదని అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు.

image


వీటితో పాటూ మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన షీటీమ్స్ కు లభించిన ఆదరణ పట్ల అందరూ అబ్బురపడ్డారు. కేవలం రెండు సంవత్సారాల్లోనే షీ టీమ్స్ సాధించిన ఫలితాలపై రూపొందించిన ప్రేజెంటెషన్ కు ప్రధాని ఫిదా అయ్యారు. ఇక పాస్ పోర్ట్ వెరిఫికేషన్ జరుగుతున్న తీరుపైనా ప్రశంసలు కురిశాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 రెండు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి అయ్యేలా చూస్తున్న ఘనత తెలంగాణ పోలీసులకే చెల్లింది. ఇది కూడా ప్రజెంటేషన్ లో ఆకట్టుకుంది.

ఫ్రెండ్లి పోలీసింగ్ లో భాగంగా కమ్యూనిటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలకు అందస్తున్న సేవలను ప్రధాని కొనియాడారు. సదస్సులో పాల్గొన్న మిగతా రాష్ట్రాల డీజీపీలు సైతం తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థకు జయహో అన్నారు. సదస్సు మధ్యలో లంచ్ టైం తర్వాత రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మతో మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం... వారి ఏరివేతకు సంబంధించి తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ పై ప్రధాని ఆరా తీశారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టాలని ఆయన డీజీపీకి సూచించారు. పోలీస్ వ్యవస్థకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్న అందించేందుకు సిద్దమని ప్రధాని హామీ ఇచ్చారు.

మూడు రోజుల పాటూ డీజీపీల సదస్సు ప్రశాంతంగా జరిగేలా చూసినందుకు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినందుకు.. పోలీస్ బాస్ అనురాగ్ శర్మను కేంద్ర హోం మంత్రి మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.