రెండు నిమిషాల ఈ వీడియో చూస్తే కనుమరుగైన లక్ష్యం మళ్లీ కళ్లముందు కనిపిస్తుంది

0

ఈ సృష్టిలో ప్రతీ మనిషికీ కొన్ని కలలుంటాయి. అందులో చాలామటుకు నెరవేర్చుకోడానికే టైముండదు. సామాజిక కారణాలో, కుటుంబ అవసరాలో, కారణమేదైతనేం డ్రీమ్స్ డ్రీమ్స్ గానే మిగిలిపోతాయి. ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని కలలకు గివ్ అప్ అనక తప్పదు. భార్యగా, అమ్మగా, గృహిణిగా, కేర్ టేకర్ గా విభిన్న పాత్రలు పోషించాల్సిన టైమొస్తే కలల్ని కట్టగట్టి అటకమీదకి ఎక్కించాల్సిందే.

కర్తవ్య నిర్వహణలో డ్రీమ్స్, గోల్స్ పక్కన పెట్టక తప్పని పరిస్థితి. వీలైతే మరిచిపోవాలి కూడా. అప్రయత్నంగానే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోవాలి. అదంతా తమ కుటుంబం కోసమే అనకుని రాజీపడాలి. ఏ మధ్యాహ్నమో కాసేపు కునుకు తీసే సమయంలో మళ్లీ ఆ స్వప్నం మెరిస్తే అపరాధభావంతో లేచి నిల్చోవాలి. మరిచిపోయిన లక్ష్యం మళ్లీ కనిపిస్తే పీడకల అనుకుని హనుమాన్ చాలీసా చదువుకోవాలి.

సంసారం, భర్త, పిల్లలు అనగానే మహిళ గృహిణిపాత్ర నుంచి బయటకి రాకూడదా? సామాజిక, కుటుంబ కారణాలు స్వప్నాలను నిలువునా చిదిమేయాలా? అలా జరగడానికి వీల్లేదు. ఇలాంటి బండ రూల్స్ నుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది.

ఫైండ్ యవర్ ఓన్ వర్త్ ఇనిషియేటివ్. ఐసీఐసీఐ బ్యాంక్ తీసిన రెండు నిమిషాల నిడివిగల పవర్ ఫుల్ వీడియో. కొంకణా సేన్ శర్మ నటించిన ఈ ఫిలింలో మహిళలు తమ కోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో వివరించారు. పిగ్గీ బ్యాంకులో డబ్బుల్ని బయటకు తీసి, స్త్రీలు ఆర్ధిక స్వావలంబన సాధించడానికి సింపుల్ ఈక్వేషన్స్ చెప్తుంది.

కుటుంబ బాధ్యతల్లో తలమునకలై కూడా ఆర్ధికంగా తమ కాళ్లమీద తాము నిలబడి డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకున్న మహిళలు మీకెవరైనా తారసపడ్డారా? అయితే వారిని ఫండ్ యువర్ ఓన్ వర్త్ కోసం నామినేట్ చేయండి. వారి స్ఫూర్తిదాయక కథను ప్రపంచానికి చాటిచెప్పండి. సక్సెస్ ఫుల్ విమెన్ గా నిలిచిన టాప్ వన్ మహిళకు ఐదు లక్షలు, నెంబర్ టు లో నిలిచినవారికి 2 లక్షలు, మూడో స్థానం దక్కించుకున్న వారికి రెండు లక్షల నగదు పురస్కారం ఇస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Related Stories