హైదరాబాదీలకు హెల్తీ ఫుడ్ రుచి చూపిస్తున్న సూప్స్ అండ్ సలాడ్స్

కార్పొరేట్ కంపెనీలపై దృష్టి పెట్టిన సంస్థలోకల్ ప్రొడక్ట్స్‌తో మెనూ తయారు చేస్తున్న సౌజన్యశాఖాహార పిజాలతో డబుల్ అయిన బిజినెస్కావల్సిన మెనూ కావల్సిన టైంకి అందిస్తామంటున్న స్టార్టప్

0

లోకల్ ఫ్లేవర్స్‌తో గరమ్ గరమ్‌గా సూప్స్ ఎన్ సలాడ్స్ తయారు చేసి..వండి వార్చేందుకు సిద్ధమౌతోందీ ఓ హైద్రాబాదీ స్టార్టప్. అంతే కాదు వీటిపై మీకు ట్రైనింగ్ ఇవ్వడానికీ రెడీ అవుతోంది. "ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మంచి మార్కెట్ ఉంది. మెజారిటీ జనాభా సహజ ఆహార పదార్థాలను ఎంచుకోవడం, సాధారణ ఆహారంలో కొవ్వు తగ్గించేందుకు చూస్తున్నారు. అలాగే రెగ్యులర్ డైట్‌లో ఫ్రెష్ ఐటెమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని "సూప్స్ n ' సలాడ్స్ ఫౌండర్ ఓబులాపు సౌజన్య అంటారు.

సూప్స్ ఎన్ సలాడ్స్ ఫౌండర్ ఓబులపు సౌజన్య
సూప్స్ ఎన్ సలాడ్స్ ఫౌండర్ ఓబులపు సౌజన్య

హైదరాబాద్ కేంద్రంగా 2013 లో ప్రారంభమైంది, సూప్స్ అండ్ సలాడ్స్. క్విక్ సర్వీస్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా కొనసాగుతోంది. మిగిలిన రెస్టారెంట్స్‌కు భిన్నంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూప్స్, సలాడ్స్, వ్రాప్స్, వర్జిన్ డ్రింక్స్, స్మూతీస్‌ను తయారు చేసి అందిస్తోంది. 'దాదాపుగా మా దగ్గర ఉండే ఆహార పదార్థాలన్ని బేక్ , గ్రిల్ చేసినవే లభిస్తాయి. ఎవ్వరికి నిల్వ ఉండే పదార్ధాలు కాని చల్లటి పదార్ధాలు ఇచ్చే అవకాశం లేదని' సంస్థ నిర్వాహకులు వివరిస్తారు.

"మేము రోజు 100 మందికి సర్వ్ చేస్తుంటాము. వినియోగదారుల ఆహార అవసరాలకు అనుగుణంగా సరఫరా ఉంటుంది. అంతే కాదు ఒక్కో కస్టమర్‌కు ఇష్టమైనట్టుగా వారికి కావాల్సిన వెనిగరెట్‌, సాస్‌లు ఫ్రెష్ గా తయారు చేసి ఇవ్వడమే మా ప్రత్యేకత '' గా చెప్పుకొస్తారు సౌజన్య.

వెజిటేరియన్ పీజా
వెజిటేరియన్ పీజా

ఐటి అనలిస్ట్ నుండి యూఎస్‌లో చెఫ్‌గా మారిన సౌజన్య కాలిఫోర్నియాలో కలినరీ అకాడమిలో శిక్షణ తీసుకొని, తర్వాత హైదరాబాద్‌లో సూప్స్ అన్ సలాడ్స్‌ను ప్రారంభించారు. "మేము మా ఆహారం ద్వారా ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తున్నాము. కస్టమర్స్‌కు ఫిట్నెస్‌తో పాటు ఆరోగ్యం అందాలి. మా అంతిమ లక్ష్యం భారతదేశంలో ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి పర్యాయపదంగా తయారు చేయడమే'' అంటూ వివరిస్తారు సౌజన్య. సూప్స్ అండ్ సలాడ్స్‌లో వాడే పదార్థాలన్ని స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులనే వాడతారు. కాలానుగుణంగా మెను మారుతూ ఉంటుంది. అంతే కాదు వినియోగదారులకు వారు కోరుకున్నట్లు మెనూ ఎంచుకోవడానికి అవకాశం ఉంది.

మార్కెటింగ్ ఎలా ?

సూప్స్ అండ్ సలాడ్స్ మార్కెటింగ్ అంతా మౌత్ టూ మౌత్ ప్రచారమే. ఐటెమ్స్‌కు Zomato, Burrp పోర్టల్స్ రివ్యూలు చేశాయి. అలాగే సోషల్ మీడియా ఫేస్ బుక్‌లో 4.6 / 5.0 రేటింగ్స్ ఇచ్చాయి. సూప్స్ అండ్ సలాడ్స్ ఫుడ్డీ మీటప్స్, ఫుడ్ టేస్టింగ్ ఈవెంట్స్, పిల్లలకు, పెద్దలకు కుకింగ్ క్లాసెస్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య ఆహార అలవాట్లపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేశారు.

యాంటి ఆక్సిడెంట్ సలాడ్ ఫ్రం సూప్స్ అండ్ సలాడ్స్
యాంటి ఆక్సిడెంట్ సలాడ్ ఫ్రం సూప్స్ అండ్ సలాడ్స్

విస్తరణ ప్రణాళిక

సూప్స్స్ అండ్ సలాడ్స్ ఔట్ లెట్స్ విస్తరణకు ప్లాన్ చేస్తోంది. ప్రైమ్ లోకేషన్‌లో దీన్ని విస్తారించాలంటే రూ.50 లక్షల వరకూ ఖర్చు కావొచ్చు. అందుకే ఇప్పడు సౌజన్య టీమ్ కార్పొరేట్ ఆఫీసుల్లో కియోస్క్‌ల ఏర్పాటుపై పై దృష్టి సారించారు. హైదరాబాద్‌‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే యోచనలో ఉంది. రానున్న మూడేళ్ళలో ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో శాఖలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

సవాళ్లు

ముందుగా ప్రజలకు మంచి ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్గించడం ప్రధానం. సామాజిక మాధ్యమాల్లో వీటిపై తరచూ చర్చలు నిర్వహిస్తూ వస్తున్నాం. సూప్స్ అండ్ సలాడ్స్ మెనూల అప్ డేట్స్ సమాచారమూ ఇస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల మరో ఇబ్బందిగా మారుతోంది.

నేర్చుకున్న పాఠాలు

ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్న సమయంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

  • ఉద్యోగుల సంతృప్తి - సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఆనందంగా ఉంటేనే కస్టమర్ సర్వీస్ మెరుగ్గా ఉంటుంది.
  • స్థిరమైన, నాణ్యమైన తాజా ఆహారాన్ని సరఫరా చేసే సరైన విక్రేతలను ఎన్నుకోవడం
  • కంపెనీ విజన్, విలువలకు తగ్గట్టుగా సిబ్బందికి తగిన శిక్షణ

ఇలా అటు సంస్థ ఉద్యోగి నుంచి కస్టమర్ వరకూ అందరినీ తృప్తి పరుస్తూ.. సూప్స్ 'n' సలాడ్స్ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు సౌజన్య.

This story is a part of the ‘F&B Entrepreneurs’ series presented in association with ‘Chilli Paneer – A DBS Production‘.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik