పిల్లలకు ఇంగ్లిష్‌ను పక్కాగా నేర్పే 'వర్డ్స్ వర్త్'

చిన్నారులకు ఇంగ్లీష్ ఈజీగా అర్ధం కావడం ఎలా ?సులువుగా ఉండాలి, అర్ధం కావాలి... సాధ్యమేనా ?యంగ్ ఇండియా విద్యార్ధి రూపొందించిన ప్రాజెక్ట్చిన్నారులను, పేరెంట్స్‌ను ఆకట్టుకుంటున్న వర్డ్స్‌వర్త్

పిల్లలకు ఇంగ్లిష్‌ను పక్కాగా నేర్పే 'వర్డ్స్ వర్త్'

Wednesday May 20, 2015,

4 min Read

వర్డ్స్ వర్త్.. ఇంగ్లీష్ భాషని సమగ్రంగా నేర్పించే ప్రాజెక్టుకు ఇంతకన్నా మంచి పేరు సాధ్యమేనా ? ఖచ్చితంగా కాదనే అనిపిస్తుంది కదూ! ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది వర్ష వర్గీస్ అనే ఎకనామిక్స్ స్టూడెంట్. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్‌లో చదువుతున్నారామె. 2014 అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యంగ్ఇండియా ఫెలోషిప్‌లో లీడర్‌షిప్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేస్తున్నారు వర్ష. "నాకు చదవడం చాలా ఇష్టం. నా పాకెట్ మనీలో చాలావరకూ పుస్తకాలు కొనేందుకే ఖర్చుపెట్టానం"టారు వర్ష.


వర్ష, వర్డ్స్ వర్త్ వ్యవస్థాపకురాలు

వర్ష, వర్డ్స్ వర్త్ వ్యవస్థాపకురాలు


దుబాయ్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన వర్ష వర్గీస్... ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చారు. “మా ఇంట్లో నేను ఒక్కదాన్నే సంతానం. చాలా నెమ్మదైన, ప్రశాంతమైన, భయం లేని జీవితం గడిపాను. నాకంటూ గుర్తింపు కోసం తపించేదాన్ని. మా కుటుంబం కేరళ నుంచి వచ్చి దుబాయ్‌లో సెటిలయింది. అయితే నా ప్రాంతంతో నాకున్న సంబంధం కేవలం భాష మాత్రమే. యూఏఈలో మాకు సిటిజన్‌షిప్ లేదు. ఇతర దేశాలకో, స్వదేశానికో వెళ్లాల్సిన పరిస్థితి. ఇండియాకు వచ్చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనిపించి... షిఫ్ట్ అయిపోయానంటారు'' వర్ష.

దుబాయలో ఉన్నతస్థాయి ప్రమాణాలు గల పాఠశాలలో చదివిన వర్ష... ఇండియా వచ్చాక కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వచ్చింది. అయితే దేన్నీ సవాల్‌గా భావించలేదంటారామె. జీవితం సౌకర్యవంతంగానే గడిచిందని చెబ్తారు. స్కూల్ డేస్‌లో స్టూడెంట్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు వర్ష. దీన్నో అఛీవ్‌మెంట్‌గా భావిస్తారు. ఇక్కడ ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి సాధించినవారో, సాధించాలన్న తపన ఉన్నవారో కనిపించారు అంటుంది వర్ష. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంలో... ఢిల్లీలో గడిపిన మూడేళ్లు చాలా ముఖ్యమైనవిగా చెప్తారు.

పిల్లలకు శిక్షణనిస్తున్న వర్ష

పిల్లలకు శిక్షణనిస్తున్న వర్ష


తగనిదాంట్లోంచి నచ్చే విషయంలోకి...

తొలి ఏడాదిలోనే ఎకనమిక్స్ తనకు అంత సూటైన సబ్జెక్ట్ కాదనే విషయం ఆమెకు అర్ధమైంది. తగిన జీవితంపై మక్కువతో "మేక్ ఎ డిఫరెన్స్" సంస్థలో వాలెంటరీ టీచర్‌గా చేరారు వర్ష. అదే సమయంలో చిన్నారులకు ఇంగ్లీష్ నేర్పే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. వారాంతంలో మాత్రం ఈ ఇంగ్లీష్ క్లాసులు చేపట్టేవారు. "నేను టీచింగ్‌లో చాలా స్ట్రాంగ్ అని... మేక్ ఎ డిఫరెన్స్‌లో టీచర్‌గా చేసేప్పుడు అర్ధమైంది. నాకన్నా చాలా పెద్దవారికి కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చేది. వయసు కంటే కాలం చాలా ప్రాముఖ్యత గలదని తెలుసుకున్నానం"టారు వర్ష.

కొన్ని గంటలు క్లాస్‌రూమ్‌లో క్లాసులు తీసుకున్నంత మాత్రాన... కావాల్సిన మార్పు వచ్చేయదు. ఇప్పుడు చేసేదాని కంటే ఏదో ఎక్కువ చేయాలన తపన ఆమెను వెంటాడేది. లైఫ్‌లో భారీ మార్పు రావాలంటే... ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు వర్ష. ప్రతీవారికీ ఇలాగే అనిపించినా... వర్ష విషయంలో మాత్రం ఇది భాషకు సంబంధించిన టర్న్ తీసుకుంది. "ప్రతీ సబ్జెక్ట్‌నీ ఏదో ఓ భాషలోనే నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు నాలుగో తరగతిలో ఉన్నారనుకుందాం. మీకు మాధ్స్ చేయడం బాగా వచ్చి, ఇంగ్లీష్ రాకపోతే... ఉపయోగమేంటి ? కనీసం చదివిన ప్రాబ్లెంని సరిగా అర్ధం చేసుకోలేనపుడు... ఆన్సర్ కరెక్ట్‌గా రాదు కదా? చదివే పదాలను, వాక్యాలను పూర్తిగా అర్ధం చేసుకోకుండా అసలు మనం ఏమీ చేయలేమం"టారు వర్ష వర్గీస్.

భాష సామర్ధ్యానికి ప్రతిరూపం

భాష, పదాలు... వీటిని తన శక్తి సామర్ధ్యాలుగా గుర్తించారు వర్ష. వీటిపై చిన్నారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా గుర్తించారామె. “ఈ పరిస్థితిపై ఏదో ఒకటి చేయాలని భావించా. భాష ప్రభావం చాలా ఉంటుందనే విషయం అర్ధమైంది నాకు. అందులోనూ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. చాలా ప్రాంతాల్లో ఇంగ్లీష్ ఉపయోగిస్తున్నాం. అతి తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే వేస్తున్నారు. ఇంగ్లీష్ చక్కగా నేర్చుకుంటే... ఏదో సాధించచ్చనే ఆశ జనాల్లో ఉంది. వేరే ఏదైనా వారికి తెలీని భాషని వారిపై రుద్దడం సరికాదు. అయితే మన స్కూల్స్‌లో జరుగుతోంది వేరేగా ఉంది. నాలుగు గోడల మధ్య తెలియని భాషను రుద్దేసి, తర్వాత ఇంటికి పంపేస్తున్నారు. దీంతో మళ్లీ ఇంటికెళ్లాక వారు మాతృభాషలో మాట్లాడుకుంటున్నారు. దీంతో సమగ్రంగా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం చిక్కడం లేదు. దీనికో పరిష్కారం అవసరం అనిపించింది” అంటారు వర్ష.

ఛారిటీ సంస్థల ద్వారా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. లైబ్రరీల్లోనూ పంచిపెట్టారు. అయితే ఆయా పిల్లలు నేర్చుకునే సామర్ధ్యానికి తగినట్లుగా లేకపోవడంతో... వాటితో అంతగా ఉపయోగం లభించలేదు. ఆయా చిన్నారుల అభిరుచికి, స్థాయికి తగినట్లుగా ఉండాలనే విషయం ఆమెకు అర్ధమైంది. “ఇక్కడ ధరల్లోనూ చాలా అంతరాలున్నాయి. ₹40లకే చాలా మంచి పుస్తకాలు కూడా దొరుకుతాయి ఒక్కోసారి. ఇలాంటి సందర్భాలను చూశాక నాకో ఆలోచన వచ్చింది. మేక్ ఎ డిఫరెన్స్‌లో పని చేసినప్పటి అనుభవం దీనికి తోడ్పడింది. భవిష్యత్తులో నేనేంటి అని అలోచించుకునేందుకు ఇవన్నీ సహాయపడ్డాయి ” అంటారు వర్ష.

image


ముగ్గురూ ముగ్గురే

యంగ్ ఇండియా ఫెలోషిప్‌లో... లాభాలను ఆర్జించేదో, సామాజిక ప్రయోజనం గలదో ఏదైనా ఓ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం వర్షకు చిక్కింది. “ ఆలోచనను, ఆచరణలో పెట్టే తీరుపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ముగ్గురు కలిసి టీంగా ఏర్పడాలి. నా ఆలోచన నచ్చి ప్రియాంక నాకు తోడైంది. ఆమె శ్రీరాం కాలేజ్‌లో అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధిని. లైబ్రరీ మోడల్‌పై కొంత వర్క్ చేసి, సక్సెస్ కాకపోవడంతో, నాకు జతైందామె. మా టీంలో మరో వ్యక్తి పేరు రాహుల్. ఓల్డ్ ఏజ్ హోంలలో ఏడాదికి పైగా సర్వీస్ చేసిన రాహుల్‌కి.. సేవా దృక్పథం ఎక్కువ. రవాణా, నిర్వహణ రాహుల్ చూసుకునేవాడు. ప్రణాళికల రూపకల్పన నేను, ప్రియాంక చేసే వాళ్లమం”టారు వర్ష.

వర్ష, రాహుల్, ప్రియాంక

వర్ష, రాహుల్, ప్రియాంక


అక్టోబర్ 2014లో ఈ ముగ్గురు తమ కార్యాచరణ ప్రారంభించారు. “ పిల్లలకు సరైన పుస్తకాలు అందేలా జాగ్రత్తపడ్డాం. సాధారణం వాలంటీర్లు నడిపే కార్యక్రమాల్లో... వాళ్లొచ్చి కొన్ని గంటలపాటు ఉండి, తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటారు. అది ఎంతవరకూ సత్ఫలితాలిస్తోందో తెలుసుకోవడం చాలా క్లిష్టం. అందుకే ముందుగా పిల్లలకు పీటర్ ర్యాబిట్ పుస్తకమిచ్చి చదవమంటాను. బాధపడాల్సిన విషయమేంటంటే చాలా మందికి ప్రాథమిక స్థాయి నాలెడ్జ్ కూడా ఉండడం లేదు. అందుకే అత్యంత సులభమైన పుస్తకాలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నాం. కథల పుస్తకాలకే మొగ్గు చూపామం”టారు వర్ష.

“చాలా మంది పిల్లలకు పదాలు పలకడం బాగానే వచ్చు. అయితే వాటిని వాక్యాలుగా మార్చడం, ఆయా పదాలకు తగిన అర్ధాలు తెలుసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. వర్డ్స్‌వర్త్ ప్రాజెక్టులో దీని పైనే దృష్టి పెట్టాం. వాలంటీర్ల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. పిల్లలు చదువుపై దృష్టిపెట్టడాన్ని అనుసరించి వారికి పాయింట్స్ ఇస్తాం. 0-5 వరకూ పాయింట్స్ ఇస్తూ... మెల్లగా వాలంటీర్లకు పని తగ్గేలా చేస్తామం”టారు వర్ష.

ఇదీ భవిష్యత్తు

తన వ్యక్తిగత ప్రణాళికలపై వర్ష ఇలా వివరిస్తున్నారు. “ ఏడాది, రెండేళ్లపాటు విద్యారంగంలో ఉన్న ఢిల్లీలోని ఏదైనా పెద్ద సంస్థతో పని చేయాలనుకుంటున్నా. దీనిద్వారా వర్డ్స్‌వర్త్ ప్రాజెక్టుకు అవసరమైన వాటిని నేర్చుకునే అవకాశం చిక్కుతుంది. ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తాను. నా ఊహా ప్రపంచంలో ట్రావెలింగ్, రైటింగ్, ప్రాజెక్ట్ నడపడం అన్నీ కలిపి ఉంటాయి”-వర్ష వర్గీస్

“వర్డ్స్‌వర్త్ ప్రాజెక్ట్ అభివృద్ధికీ కొన్ని ప్రణాళికలు చేపట్టాల్సి ఉంది. గ్రాంట్స్, డోనర్స్ వంటి ఆదాయ మార్గాలను కనీసం రెండింటినైనా పక్కాగా నిర్వహించగలగాలి. ఇప్పటికే చేపట్టిన విధానాలతోపాటు కాలం, ప్రాంతంలకు అనుగుణంగా కొత్త ప్రణాళికలు రూపొందించాలి. ఒక స్టార్టర్ కిట్ తయారు చేసి ప్రాజెక్ట్ గురించిన అన్ని నియమాలు, నిబంధనలు, విశేషాలను పొందుపరిచి... అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ”-వర్ష వర్గీస్