ఆఫ్‌లైన్ కంపెనీలకు అదిరిపోయే ఆన్‌లైన్ పబ్లిసిటీ

ఆఫ్ లైన్ బేరాలను ఆన్ లైన్లో పరుగులు పెట్టించే షాప్ టిమైజ్‌

ఆఫ్‌లైన్ కంపెనీలకు అదిరిపోయే ఆన్‌లైన్ పబ్లిసిటీ

Saturday July 18, 2015,

3 min Read

బ్రాండ్‌ నేమ్ ఉన్నా బిజినెస్ ఏమంత బ్రహ్మాండంగా లేదా? ఆఫ్‌ లైన్ నుంచి ఆన్‌ లైన్‌ కు ఎలా మారాలో తెలియట్లేదా? సైట్, యాప్, డెలివరీ, ఈ కామర్స్ – ఇవన్నీ తలకుమించిన భారంలా కనిపిస్తున్నాయా? సరిగ్గా అలాంటి వారి కోసమే ఉంది షాప్ టిమైజ్‌. నెలనెలా ఇంత ఫీజు ఇస్తే చాలు మొత్తం వాళ్లే చూసుకుంటారు.

హల్దీరామ్‌కు ఈ కామర్స్ ప్లాట్‌ఫాం 

హల్దీరామ్ తెలుసుగా! బ్రాండెడ్‌ స్నాక్స్ కంపెనీ. మొన్నటిదాకా దానివి ఆఫ్‌లైన్ అమ్మకాలే. ఇప్పుడవి ఆన్‌ లైన్‌లో కూడా ఉన్నాయి. ఆకట్టుకునే వెబ్‌సైట్ ఉంది. ఆఫ్‌ లైన్ కంటే ఆన్ లైన్లోనే స్వీట్లు, స్నాక్సూ అమ్ముతోంది. నెలకు లక్షకు పైగా కస్టమర్లు. ఇదంతా ఎలా సాధ్యమైంది? అంటే- ఈ ప్రశ్నకు సమాధానం షాప్ టిమైజ్. హల్దీరామ్‌కు ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అందించిన ఘనత షాప్ టిమైజ్‌ దే. ఒక్క హల్దీరామే కాదు.. వందల కొద్దీ ఆఫ్ లైన్ బేరాలను ఆన్ లైన్‌ పట్టాలెక్కించింది కూడా షాప్ టిమైజే.


'షాప్‌టిమైజ్','కూలియో'ల  కోఫౌండర్స్

'షాప్‌టిమైజ్','కూలియో'ల కోఫౌండర్స్


బ్రాండ్ బ్రాండ్‌కో ప్రత్యేకత

ఒక్కో బ్రాండ్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఈ రోజుల్లో ఆఫ్‌ లైన్ క్లిక్కయిన ఏ కంపెనీ అయినా ఆన్‌ లైన్‌ లోనూ ఉండాలని ఆరాటపడుతుంది. సరిగ్గా ఈ పాయింట్ మీదనే మొదలైంది షాప్ టిమైజ్‌. 2013లో లాంఛ్ అయిందీ స్టార్టప్‌. దీనికి మంగేష్, వివేక్ ఫాలక్‌ సహ వ్యవస్థాపకులు. వెబ్‌సైట్ నిర్వహణ, సైట్ డెవలప్ మెంట్ మాత్రమే కాదు.. పలురకాల బ్రాండ్లకు ఈ కామర్స్ పోర్టల్ కూడా అందిస్తారు. అది కూడా కేవలం డిజైన్ చేసి ఇచ్చేయడంతో సరిపెట్టరు.ఇంటర్‌ ఫేజ్ డిజైన్ అవసరమైనా, రవాణా సదుపాయాలు కావాలన్నా- అన్నీ దగ్గరుండి చూసుకుంటారు.

ఆన్ లైన్లో పరుగులు పెట్టిస్తుంది

ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్. ఏదో ఒక ప్లాట్‌ఫాంపైనే ఆధారపడి సక్సెస్ అయిన ప్రోడక్ట్ దేశంలో చాలా తక్కువ అంటారు మంగేష్. ఆన్లైైన్ వ్యాపారం చేసే సంస్థకు రిటైల్ స్టోర్ సెటప్ ఏర్పాటు చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాగే స్టోర్స్‌ కు మాత్రమే పరిమితమైన వ్యాపారులు ఆన్‌లైన్ బిజినెస్‌ తో పోటీ పడటం కూడా కష్టమైన పనే. అందుకే ఆఫ్‌లైన్‌లో మాత్రమే వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఇలాంటివన్నీ సులభతరం చేస్తున్నామంటారు మంగేష్. ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్ లైన్ వ్యాపారాన్ని ఆన్ లైన్లో పరుగులు పెట్టిస్తుంది షాప్ టిమైజ్‌. యూజర్ ట్రాఫిక్ కోసం పబ్లిసిటీ, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్లలో ప్రచారం చేస్తుంది.

ఛార్జీల వివరాలు

ఒక ఈ కామర్స్ సైట్ చేసిపెట్టాలంటే రూ.15వేల –రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తారు. ఒక్కోసారి వ్యాపారాన్ని బట్టి - సైట్ డిజైన్‌ బట్టి రేట్లు మారుతుంటాయి. వన్స్ వెబ్‌ సెటప్ చేశాక- ఆ సైట్‌కు వచ్చే ఆర్డర్ల సంఖ్య ఆధారంగా షాప్‌ టిమైజ్‌ కు నెలవారీ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 100 కుపైగా బ్రాండ్లకు సర్వీసులు అందిస్తోందీ సంస్థ. హల్దీరామ్, కేమ్లిన్, ఎక్బోయట్ ఫర్నిచర్ వంటి పేరున్న కంపెనీలు షాప్ టిమైజ్ జాబితాలో ఉన్నాయి. అవన్నీ పాపులర్ బ్రాండ్స్ అయినా ఆ స్థాయికి తగ్గట్టుగా ఆర్డర్స్ రావడం లేదు. అందుకే ప్రత్యేక ప్రోడక్టులను డిజైన్ చేసి, బ్రాండ్లకు ట్రాఫిక్ వచ్చేలా చేస్తున్నారు మంగేష్.

కూలియోకు నాంది

షాప్ టిమైజ్ కాకుండా ఒకసారి కూలియో గురించి కూడా చెప్పాలి. ఒక వస్తువును కస్టమర్ ఆన్‌లైన్‌లో చూసీ చూడగానే టెంప్ట్ అయిపోవాలి. అప్పటికప్పుడు కొనాలనిపించేలా ఉండాలి. ప్రాడక్ట్ అలా ఉండటానికే కూలియో. 2014 జనవరిలో లాంఛ్ అయిన ఈ యాప్ స్పెషల్ ప్రాడక్ట్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది .అల్గారిథంతో రూపొందించడం వల్ల కస్టమర్లకు షాపింగ్ అనుభూతి సమ్ థింగ్ స్పెషల్‌గా ఉంటుంది.

షాపింగ్ ఎక్స్‌పీరియన్స్

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌ డీల్, జబాంగ్ వంటి పెద్ద బ్రాండ్స్ మాత్రమే కాకుండా చిన్న సైట్లకు సంబంధించిన ఉత్పత్తులు కూడా కూలియో పోర్టుఫోలియోలో ఉంటాయి. అపారల్, షూస్, యాక్సెసరీస్, ఆర్ట్, హోమ్ డెకార్.. ఇలా పలు కేటగిరీల్లో ప్రాడక్టులు ఉంటాయి . ఫీడ్ కామర్స్ అనే ప్రత్యేకమైన మార్కెటింగ్ పద్ధతిని కూలియో కోసం ఉపయోగిస్తున్నారు. పలు ప్రాడక్టులకు చెందిన లింకులను వాట్సాప్ ద్వారా పంపడం కూలియో ప్రత్యేకత. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో ఉంది. ఇప్పటికే వారానికి 20 లక్షలకుపైగా యూజర్లు దీన్ని వాడుతున్నారు. కూలియోకు 3 లక్షలకు పైగా రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు.

షాప్‌టిమైజ్ వెబ్‌సైట్

కూలియో వెబ్‌సైట్