ఫ్లిప్‌కార్ట్‌లో మార్పులు చేర్పులు!

ఫ్లిప్‌కార్ట్‌లో మార్పులు చేర్పులు!

Monday January 18, 2016,

2 min Read

గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో నిల్చోవాల్సిన ప‌నిలేదు. రద్దీలో షాపింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడంతా మారిపోయింది.సెల్‌ఫోన్‌, అందులో ఓ యాప్ ఉంటే చాలు. ఏది కావాలంటే అది.. ఎక్క‌డ‌కు కావాలంటే అక్క‌డ‌కి. ఇండియ‌న్ మార్కెట్ అంతా అర‌చేతుల్లోకి వ‌చ్చేసింది. కాదు.. తీసుకువ‌చ్చారు. అవును. ఆ ఇద్ద‌రూ ఇండియ‌న్ ఈ కామ‌ర్స్ గ‌తినే మార్చిప‌డేశారు. వాళ్లే స‌చిన్ బ‌న్సాల్‌, బిన్నీ బాన్సాల్‌. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఆ ఇద్ద‌రు ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లో ఉన్నారు.


image


ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా ఎనిమిదేళ్లు ప‌నిచేసిన త‌ర్వాత కంపెనీ కో ఫౌండ‌ర్ బిన్సీబ‌న్సాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అటు గ‌తంలో సీఓఓగా ఉన్న స‌చిన్‌.. ఇప్పుడు సీఈవోగా ప‌నిచేస్తున్నారు. బోర్డ్ చైర్మ‌న్‌గా స‌చిన్ కొన‌సాగుతారు. ఇప్ప‌టికే ఫ్లిప్‌కార్ట్‌.. రూ.21664 కోట్లు ఫండింగ్ ద‌క్కించుకుంది. రూ.8801 కోట్ల వ్య‌క్తిగ‌త ఆస్తుల‌తో స‌చిన్, బిన్సీలు ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఫోర్బ్ మొట్ట‌మొద‌టి 100మంది ధ‌న‌వంతుల జాబితాలో 86స్ధానంలో ఉన్నారు.

స‌చిన్ కొత్త బాధ్య‌త‌లు

ఫ్లిప్‌కార్ట్ విడుద‌ల‌చేసిన ఓ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం స‌చిన్ బ‌న్సాల్ కొత్త బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

  1. సంస్ధ‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం
  2. కంపెనీలోని సీనియ‌ర్ లీడ‌ర్‌షిప్‌కు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం
  3. కొత్త పెట్టుబ‌డులను చూడ‌టం
  4. అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల్లో ఫ్లిప్‌కార్ట్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించ‌డం
కొత్త ప‌ద‌వితో బాధ్య‌త‌లు మ‌రింత పెరుగుతాయి. భార‌త‌దేశం ఒక అత్యున్నత స్థాయి ఇంట‌ర్నెట్ బేస్డ్ కంపెనీని న‌డ‌ప‌గ‌ల‌ద‌న్న విష‌యాన్ని అంత‌ర్జాతీయ స‌మాజానిక చూపాల్సిన బాధ్య‌త ఉంది-స‌చిన్‌

బిన్నీ కొత్త బాధ్య‌త‌లు

సీఈవోగా బిన్సీ కొత్త బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని కంపెనీ తెలిపింది.

  1. కంపెనీని అన్ని అంశాల్లో ముందుకు తీసుకువెళ్ల‌డంతో పాటు ప‌ర్‌ఫార్మెన్స్‌కు బాధ్యుడిగా ఉంటారు.
  2. కామ‌ర్స్‌, ఈకార్ట్‌, మింత్రా కంపెనీలు.. బిన్సీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తాయి.
  3. మాన‌వ‌వ‌న‌రులు, ఫైనాన్స్‌, లీగ‌ల్‌, కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్‌, కార్పొరేట్ డెవ‌ల‌ప్‌మెంట్ టీమ్స్ కూడా బిన్సీకి రిపోర్ట్ చేస్తాయి

ఎమ్‌-కామ‌ర్స్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌కి 60శాతం షేర్ ఉంద‌ని బిన్సీ ఈ మ‌ధ్య‌నే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాష‌న్ యాక్స‌సరీస్ అమ్మ‌కాల్లో త‌మ‌కు 5కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లున్నార‌ని" అన్నారు. ఫ్లిప్‌కార్ట్ వ్యాపారాల్లో ముఖ్య‌మైన‌దైన కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌కి హెడ్‌గా, మింత్రా ఛైర్మ‌న్‌గా ముఖేష్ బ‌న్సాల్ కొన‌సాగుతారు. దానితో పాటు యాడ్ బిజినెస్ కూడా ఆయ‌నే చూసుకుంటారు.

యువర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

రూ.100 కోట్ల విలువ‌గ‌ల ఒక ఇండియ‌న్ కంపెనీలో ఈ స్థాయిలో మార్పులు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. ఏకంగా ఎనిమిదేళ్ల పాటు సీఈవోగా బాధ్య‌త‌లు నిర్వర్తించిన స‌చిన్‌కు ఒక బ్రేక్ అవ‌స‌రం. కొత్త ఆలోచ‌న‌లు రావ‌డానికి, బిన్సీ ఆ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే కాస్త మెరుగ్గా ప‌నితీరు ఉండ‌వ‌చ్చు. పైస్థాయిలో జ‌రుగుతున్న ఈ మార్పులు.. ఫ్లిప్‌కార్ట్‌కి భ‌విష్య‌త్తులో ప్రొఫెష‌న‌ల్ సీఈవో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్టు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. కొంత‌కాలంలో రెండ‌వ కీల‌క వ్య‌క్తిని ఏర్పాటు చేసుకునే ప‌నిలో కంపెనీ వ‌ర్గాలు ఉన్న‌ట్టు తాజా మార్పులు స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖేష్‌, పునీత్ సోనీ, పీయూష్ రంజ‌న్‌, అంకిత్ న‌గోరీలు ప్రస్తుతం ఈకామ‌ర్స్‌, ప్రొడ‌క్ట్‌, టెక్నాల‌జీ, బిజిసెన్ రంగాల‌కు హెడ్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలో ఎవ‌రైనా త‌ర్వాత సీఈఓ అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది.