నమ్మకం పొందేందుకు షార్ట్‌కట్స్ ఉండవు- రతన్‌ టాటా

0

దేశంలో చాలా మంది యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ కు రోల్‌ మోడల్‌ రతన్‌ టాటా. స్టార్టప్‌లను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే ఆయన యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తుంటారు. ట్విట్టర్‌ బేస్డ్‌ కాంటెస్ట్‌ ద్వారా ఎంపిక చేసిన కొందరు యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ Kstart ఈవెంట్‌లో భాగంగా రతన్‌ టాటాతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం దొరికింది. స్టార్టప్‌ కల్చర్‌, బిజినెస్‌ ఎన్విరాన్‌ మెంట్‌ గురించి అడిగిన ప్రశ్నలకు రతన్‌ టాటా చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే...

అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌ను రూపొందించడం ఎలా?

“మనం తయారు చేసే వస్తువులు, వాటి పనితీరు గురించి అతిగా ప్రచారం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇతర బ్రాండ్‌లతో పోలిస్తే మీ బ్రాండ్‌కున్న ప్రత్యేకతలెంటో చెప్పాలి. కస్టమర్ల విశ్వాసం పొందడమన్నది అంత ఈజీకాదు. అందుకు కొన్నేళ్ల సమయం పడుతుంది.”

స్టార్టప్‌లు అంటేనే కొత్త కంపెనీలు. మరి అవి బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎలా సంపాదించుకోగలవు?

“కస్టమర్ల విశ్వాసం పొందేందుకు షార్ట్‌ కట్స్‌ అంటూ ఏవీ ఉండవు. అసలు షార్ట్‌కట్స్ అనేవి పనికిరావు. బ్రాండ్‌ పనితీరుతోనే నమ్మకాన్ని పొందగలం. కొన్నిసార్లు ఏళ్లతరబడి కష్టపడి సంపాదించుకున్న విశ్వాసాన్ని ఒక్క క్షణంలోనే పోగొట్టుకుంటాం. విశ్వాసమనేది సంస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.”

కంపెనీలో క్రియేటివిటీకి ప్రాధాన్యత ఎక్కువా? తక్కువా?

“ప్రతి కంపెనీకి క్రియేటివిటీ అనేది చాలా ముఖ్యం. మార్కెట్‌లో స్థానం, బ్రాండ్‌ ఇమేజ్‌, కంపెనీ సామర్థ్యం అన్నీ కూడా సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటాయి. క్రియేటివిటీ కారణంగానే కొత్త ఉత్పత్తులు వస్తాయి. నిజమైన సృజనాత్మకతలో ఎలాంటి గందరగోళం ఉండదు. కంపెనీ కార్యకలాపాల్లో కొత్తదనమే నా దృష్టిలో క్రియేటివిటీ. జనానికి వచ్చే కొత్త ఐడియాలను విని బాగుంటే వాటిని ప్రోత్సహించాలి.”

“టాటా మోటార్స్‌లో ఎంప్లాయిస్‌ కోసం సజెషన్‌ బాక్స్‌ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. వాస్తవానికి నిరక్షరాస్యులకు చాలా క్రియేటివ్‌ ఐడియాలు వస్తుంటాయి. ఇంజనీర్లు పరిష్కరించలేని సమస్యలకు సైతం వారు పరిష్కారం చూపిస్తారు. వారి ఐడియాల్లో ఎలాంటి గందరగోళం ఉండదు. క్రియేటివిటీ అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు.”

ఈ స్టోరీ కూడా చదవండి

బడా కంపెనీలు క్రియేటివినీ ఎలా ప్రోత్సహిస్తాయి?

కంపెనీల్లో స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే క్రియేటివ్‌ ఐడియాలు వస్తాయి. స్టార్టప్‌ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇలాంటి వాతావరణాన్నే సృష్టిస్తోంది. సీఈఓను పేరు పెట్టి పిలిచే సంస్కృతి పెరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. క్రియేటివిటీని పెంచే ఇలాంటి సంస్కృతి కలిగి ఉన్న గూగుల్‌ లాంటి అతిపెద్ద కంపెనీయే ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే పరిస్థితి కంపెనీల్లో కల్పించాలి.

సైటింఫిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇలాంటి ప్రోత్సాహకర వాతావరణం లేకపోవడం నిజంగా బాధాకరం. ఈ కారణంగానే అక్కడ కొత్త ఆవిష్కరణలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

మెడికల్‌ సెక్టార్ట్‌ కూడా ఈ సంస్కృతిని అలవర్చుకోవాలి. ఎందుకంటే ఈ దశాబ్దంలో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఎంతో పురోగతి సాధించనున్నారు. మన దగ్గర అవసరమైన వనరులున్నాయి కావాల్సిందల్లా సైంటిస్టులంతా కలిసికట్టుగా పనిచేసే వాతావరణం కల్పించడమే.

టాటా మోటార్స్‌ బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్స్‌ ఏమిటి?

చాలానే ఉన్నాయి. అయితే నానో విషయంలో మాత్రం భయంకరమైన అనుభవం ఎదురైంది. ఇక ప్రాంతంలో ప్లాంటును ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మరో రాష్ట్రానికి తరలించాల్సి రావడం బాధ కలిగించింది. ఇక ఫుల్‌ పేమెంట్‌తో 3 లక్షల కార్ల బుకింగ్‌ తీసుకోవడం తర్వాతి ఏడాది కూడా అదే జోష్‌ కొనసాగుతుందనుకోవడం కూడా పెద్ద పొరపాటు. నానో బ్రాండ్‌ను పర్సనల్‌గా ప్రమోట్‌ చేయకపోవడంతో సెల్స్‌మేన్‌ దానికి చీపెస్ట్‌ కార్‌ అన్న బ్రాండింగ్‌ ఇవ్వడం ప్రతికూల ప్రభావం చూపింది.

ఈ అనుభవాల్నీ ఎన్నో పాఠాలు నేర్పాయి. ఒక ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించేవారిని ఆ పని పూర్తయ్యే వరకు అందులోనే కొనసాగించాలి. కానీ చాలా కంపెనీలు అలా చేయవు. వారికి కొత్త ప్రాజెక్టులు అప్పజెపుతాయి. ఇది ఏమాత్రం సరికాదు.

స్టార్టప్‌లు విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా?

ఇది చాలా ఇంపార్టెంట్‌. పెద్ద పెద్ద కంపెనీల్లో విలువల్ని పాటించడం చాలా కష్టం. అదే చిన్న కంపెనీలైతే వాటి DNAలోనే విలువల్ని చేర్చొచ్చు. ఇదేమంత కష్టం కాదు. ఎలాంటి విలువలు లేని కంపెనీలు పుట్టుకొస్తుండటం దురదృష్టకరం. బిజినెస్‌లో నిజాయితి ముఖ్యం అదే కస్టమర్లలో విశ్వాసాన్ని కలిగిస్తుంది.

ఎదిగే క్రమంలోనే స్టార్టప్‌లు సమాజహితం కోసం పనిచేయాలా?

అవసరంలేదన్నది నా నమ్మకం. కొన్నికంపెనీల వ్యాపార కార్యకలాపాల్లోనే సమాజహితం దాగి ఉంటుంది. ఉదాహరణకు తక్కువ ధరకే వాటర్‌ ప్యూరిఫైయర్లు అందించడం. మిగతా స్టార్టప్‌లు కచ్చితంగా దీన్ని పాటించాలన్న నియమమేమీ లేదు.

యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌కు మీరిచ్చే సలహా?

యువ పారిశ్రామికవేత్తలు సమాజంలో మార్పు తెచ్చే కంపెనీలు ఏర్పాటు చేయాలి. పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతూ.. గుంపులో ఒకడిగా కాకుండా మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి.

ఫియట్‌, అంబాసిడర్‌, మారుతి తదితర కంపెనీలున్నప్పుడు టాటా మోటార్స్‌ ఇండికాను ఎందుకు లాంఛ్‌ చేసింది?

మారుతి గేమ్ ఛేంజర్‌. అయితే దాని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 50వేల కార్లు మాత్రమే. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ఒక్క కంపెనీ కూడా భారత్‌లోఉత్పత్తి చేస్తోంది. మరి ఉత్పత్తికి సరిపడా డిమాండ్‌ ఉందా అంటే సమాధానం అవుననే చెప్పాలి.

స్టార్టప్‌లలో మీరు ఏ అంశాలను పరిశీలిస్తారు?

స్టార్టప్‌ ఏ రంగానికి సంబంధించిందన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాను. వైవిధ్యం ఉండాలని కోరుకుంటాను. ముఖ్యంగా ఫౌండర్స్‌తో మాట్లాడి వారి ప్యాషన్‌, సిన్సియారిటీ, పట్టుదల, ఆసక్తిని గమనిస్తాను. నేనడిగే ప్రశ్నలకు వారిచ్చే సమాధానాల ఆధారంగా ఓ అభిప్రాయానికి వస్తాను.

ఈ స్టోరీ కూడా చదవండి

Related Stories