స్టార్టప్ కంపెనీకి ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవడం ఎలా..?

స్టార్టప్ కంపెనీకి ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవడం ఎలా..?

Friday May 06, 2016,

3 min Read


బ్రాండ్ విలువను పెంచుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా కంపెనీలు కోట్లు ఖర్చు చేస్తుంటాయి. బడా కంపెనీలకైతే సమస్యలేదు. మరి స్టార్టప్స్ పరిస్థితి ఏమిటి? నిర్వహణ ఖర్చులే కనాకష్టం. మరి ప్రచారానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది. అందుకే స్టార్టప్స్ కు వరం లాంటిది స్నాప్ చాట్. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే బ్రాండ్ బిల్డప్ చేయవచ్చు.

స్నాప్ చాట్ చక్కని పరిష్కారం

2015 నవంబర్ లో స్నాప్ చాట్ లో పిక్స్ అండ్ వీడియో షేరింగ్ రోజుకు 6 వందల కోట్లు. స్నాప్ చాట్ కు డెయిలీ వ్యూయర్ షిప్ అది. వీడియోలుగానీ, ఫొటోలుగానీ స్నాప్ చాట్ లో షేర్ చేస్తే అవతలి వ్యక్తి చూశాక నిమిషంలోనే వాటంతట అవి మాయమైపోతాయి. అమెరికాలో స్నాప్ చాట్ చాలా పాపులర్. ప్రపంచ వ్యాప్తంగా పాతికేళ్లలోపు వారంతా స్నాప్ చాట్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

స్నాప్ చాట్ లో కొత్త ఫీచర్స్ ను యాడ్ చేశారు. ఒకసారి వీడియో చూశాక … మళ్లీ చూసేందుకు వీలుగా రిప్లే ఆప్షన్ పెట్టారు. ఈ ఫీచర్ వల్ల స్నాప్ చాట్ యూత్ కు మరింత దగ్గరయ్యింది. ఒక వీడియో చూశాక నిమిషంలోనే మాయమైపోతుండటంతో.. స్నాప్ చాట్ లో ఎక్కువగా పోర్న్ కంటెంట్ షేర్ అవుతోందనేవారూ లేకపోలేదు.

image


అయితే స్నాప్ చాట్ ను ఉపయోగించుకుంటే అద్భుతమైన మార్కెటింగ్ చేసుకోవచ్చని నిరూపించాయి లెనోవా, హెచ్ పీ సంస్థలు. హెచ్ పీ కంపెనీ ప్రతినిధి రోబ్ ఎన్డిర్లే స్నాప్ చాట్ పై బిజినెస్ ఇన్ సైడర్ లో ఒక ఆర్టికల్ రాశారు. స్నాప్ చాట్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో సవివరంగా చెప్పారు. స్నాప్ చాట్ పై ఉన్న దురాభిప్రాయాన్ని పోగొట్టారు. సోషలైజింగ్, సెల్ఫీలు, సమాచారం మార్పిడి, ఫుడ్, మ్యూజిక్ లాంటి అంశాలను షేర్ చేసుకోవచ్చని చెప్పారు. వేరే సోషల్ మీడియాలోలాగే ఇందులోనూ అద్భుతమైన సమాచారం షేర్ చేసుకోవచ్చు. పాతికేళ్లలోపు యువకులే కాదు, 40ల్లో ఉన్నవారు సైతం స్నాప్ చాట్ ను ఎక్కువగా వాడుతున్నారు.

స్నాప్ చాట్… స్టార్టప్స్ కు, బ్రాండ్స్ ప్రచారానికి మంచి వేదికగా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం స్నాప్ చాట్ ను ఉపయోగించుకుని తమ బ్రాండ్స్ కు ప్రచారం కల్పించుకుంటున్నాయి. యూత్ ను ఆకట్టుకుంటునేందుకు ఇది చాలా పవర్ ఫుల్ మీడియం. సీఎన్ఎన్, డెయిలీ మోషన్, నేషనల్ జియోగ్రఫిక్ లాంటి ప్రముఖ సంస్థలు సైతం కంటెంట్ ను స్నాప్ చాట్ ద్వారా షేర్ చేసుకుంటున్నాయి. పలు యాడ్ సంస్థలకు సైతం ఇదే వయా మీడియాగా ఉపయోగపడుతోంది.

భారత్ లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చా?

భారత్ లో వాట్సప్, ఫేస్ బుక్ తో పోలిస్తే స్నాప్ చాట్ వాటా 9 శాతం మాత్రమే. అయితే భవిష్యత్ లో ఇది పెరగడానికి ఆస్కారముంది. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. వీడియోలు చూశాక నిమిషంలో తమంతట తామే డిసపియర్ అవ్వడం యూత్ ను ఆకట్టుకుంటోంది. వీడియో చాటింగ్ కు ఉపయోగపడుతోంది. ఇది చాలా సేఫ్ కూడా. ఎందుకంటే ఒక్కసారి చూశాక మళ్లీ అవి కనిపించవు. డాటా స్టోరేజ్ వేస్ట్ అవ్వదు. అందుకే స్నాప్ చాట్ లో యాడ్ మార్కెట్ ఎక్కువగా వృద్ధి చెందే అవకాశముంది.

రచయిత, సోషల్ మీడియా నిపుణుడు, బ్లాగర్ క్రిస్ డకర్ కూడా ఇదే మాట చెబుతున్నారు. 2016లో మార్కెటింగ్ కు స్నాప్ చాట్ కంటే మించింది లేదంటున్నారు. దీనికి కొన్ని కారణాలు కూడా ఆయన చెబుతున్నారు. యువకుల్లో ఆసక్తి రగిలిస్తోంది. ఒక్కసారి చూసే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి ఉత్సాహంగా తిలకిస్తారు.

1. షేర్ చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు పోతాయి కాబట్టి ఫేస్ బుక్, ట్విటర్ లోలా జామ్ అయ్యే అవకాశం లేదు.

2. మనం పంపే స్నాప్స్ ఎంత మంచి చూస్తున్నారో ఎంత మందిపై ఆ ప్రభావం పడుతుందో కచ్చితంగా చెప్పేయవచ్చు.

3. సోషల్ మీడియాలో స్నాప్ చాట్ మార్కెటింగ్ వాటా 3 శాతం మాత్రమే. అందుకే భవిష్యత్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

భారత్ లో స్నాప్ చాట్ వృద్ధిరేటు భవిష్యత్ లో ఎక్కువగా ఉండనుంది. కోట్లమంది స్నాప్ చాట్ యాక్టివ్ యూజర్స్ ఉన్నప్పుడు మార్కెటింగ్ అవసరాల కోసం దీన్ని ఎందుకు ఉపయోగించుకోరాదనేదే ప్రశ్న. అంతేకాదు స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక దేశంలో నెటిజన్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.

యూత్ బ్రాండ్స్ కు స్నాప్ చాట్ గొప్ప అవకాశాన్నిస్తోంది. యువత ప్రవర్తను స్టడీ చేయడానికి, అభిరుచులను తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాడ్స్ రూపొందించడానికి చాలా క్రియేటివిటీ ఉండాలి. లేకపోతే వాటివైపు చూడనుకూడా చూడరు. యంగ్ కస్టమర్స్ ను ఆకట్టుకుంటేనే ఏ బ్రాండ్ కైనా మంచి భవిష్యత్ ఉంటుంది. ఫలితాలు రావడానికి కాస్త టైం పట్టినా భవిష్యత్ అంతా బంగారమే. సో యూజ్ స్నాప్ చాట్ ఫర్ యువర్ బ్రాండ్ బిల్డప్.