ఆరోగ్యం, తాజాదనానికి డీఎన్‌ఏ గా మారిన ‘ఫ్రెష్’

ఐఐటి నుంచి మొదలైన ఫ్రెష్ ప్రయాణం మార్కెట్ లో బ్రాండ్ క్రియేట్ చేసిన ఫుడ్ స్టార్టప్గుర్గావ్ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ప్లాన్టెక్నాలజీతో క్వాలిటీ ఫుడ్ అందిస్తున్న ఫ్రెష్ఫండ్ రెయిజింగ్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఫౌండర్లు

ఆరోగ్యం, తాజాదనానికి డీఎన్‌ఏ గా మారిన ‘ఫ్రెష్’

Thursday May 07, 2015,

3 min Read

పెరిగిన సామాజిక పరిస్థితుల్లో మంచి రుచికరమైన భోజనం దొరకడమే గగనం. అందులోనూ ఆరోగ్యకరమైన డిష్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులను గమనించి దానికో సొల్యూషన్ చూపిస్తున్నారు ఫ్రెష్ ఫౌండర్లు. వారి కథే ఇది.ఇంటికి పరిపూర్ణమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిందే ఫ్రెష్. ఆరోగ్య, ఆహార సెగ్మెంట్ కు సంబంధించి భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ఆరోగ్య, వెల్ నెస్ ఫుడ్ విభాగంలో ఏకంగా 55 వేల కోట్ల డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఈ మార్కెట్ ప్రస్తుత పద్ధతిలో భోజనం, స్నాక్స్ తాజా పండ్లు, మొలకలు వంటి ఉత్పత్తులుకు డిమాండ్ ఉంది. ఇంకా తాజా చల్లని పండ్లరసాలకు అదనం. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఈ సెక్టార్ వైపు ఐఐటీయన్లు దృష్టి పెట్టారు. ప్రస్తుతం గుర్గావ్ లో రోజువారీ దాదాపుగా 1,000 మంది ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాల పంపిణీలో ఫ్రెష్ ముందుంది.

image


FRSH ప్రయాణం

FRSH వ్యవస్థ 2013 లో ఓ చిన్న వంటగదిలో ప్రారంభమైంది. ముందుగా ఆఫీసులకు పండ్లరసాలను, శాండ్ విచ్ లు, ఇతర అల్పాహారం స్నాక్స్ లాంటి పరిమిత మెనూను పంపిణీ చేయడం కోసం ప్రారంభించారు ఫౌండర్ బాదల్ గోయల్. మల్టీ నేషనల్ కంపెనీ అమెరికన్ ఎక్స్ ప్రెస్ లో ఉద్యోగం వదిలేసిన మదిలో మెదిలిన ఆలోచనే ఫ్రెష్ కాన్సెప్ట్. బాదల్ ఐఐటి ఢిల్లీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. "FRSH రోజువారీ తికమక పెట్టే సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ప్రతి ఉదయం సరైన టైమ్ దొరక్క ఆరోగ్యకరమైన వస్తువులు లభించక.. చాలా మంది ప్రొఫెషనల్స్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు. చేతిలో డబ్బులున్నా సరైన క్వాలిటీ ఫుడ్ లేని, కారణంగా 20 శాతం బ్రేక్ ఫాస్ట్ కు దూరమవుతున్నారని కో ఫౌండర్ సుమిత్ చెబుతున్నారు. సుమిత్ కుమార్, IIT ఢిల్లీ, IIM బెంగుళూర్ పూర్వ విద్యార్ధి.ఫ్రెష్ కంపెనీకి ప్రస్తుతం రోజువారీ దాదాపు 1,000 ఆర్డర్లు వస్తున్నాయి. సంస్థ ప్రారంభించినప్పుడు అంటే 2014 సంవత్సరం మే నెలలో రోజుకు 80-90 ఆర్డర్లు పంపిణీ జరిగేది. అయితే 70 శాతం కంటే ఎక్కువ కొనుగోలు రేటు ఉండేది. గుర్గావ్ లోని అరవైకు పైగా సంస్థల నుంచి ఆర్డర్లు రావడంతో మా కార్యకలాపాలు, టెక్నాలజీ, పెరగడంతో ఇప్పుడు తక్కువ ధరలకే అందించగలుగుతున్నామంటున్నారు.

ఫ్రెష్ కంపెనీ రెండు సంస్థల నుంచి 50,0000 డాలర్లతో విస్తరణ కార్యక్రమాలను రూపొందించింది. నాలుగు అంతస్తుల్లో విశాలమైన 6000 చదరపు అడుగుల వంటగది నిర్మాణంతో కార్యకలాపాలను విస్తృతం చేసింది. "మాకు ప్రపంచ స్థాయి వంటగది సామగ్రి అందుబాటులోకి రావడంతో ఎవరికి కావాల్సిన మెనూ అయినా.. ఎప్పటికప్పుడు రోజంతా ఆరోగ్యకరమైన ఆహారం అందించే అవకాశం ఏర్పడింది. దీంతో వినియోగదారుల 'అవసరాలు తీర్చటానికి అల్పాహారం అందిస్తున్నామని బాదల్ చెప్పారు.

ఫ్రెష్ టీం

ఫ్రెష్ టీం


నాణ్యతకు ప్రాధాన్యం

ఆరోగ్యం, తాజాదనానికి ఫ్రెష్ డీఎన్ ఏ గా కొనసాగుతోంది. FRSH యొక్క వంటగది లో "క్వాలిటీకి మేము ప్రాధాన్యం ఇస్తాము. సకాలంలో సరఫరా, భరోసా, ప్యాకేజింగ్ అత్యంత హైజెనిక్ పద్ధతిలో తయారు చేస్తామని..ఉత్తమ పదార్థాలు అందించడమే మా ప్రథాన లక్ష్యమంటారు ప్రధాంత్ తాప. ఒబెరాయ్ హోటల్స్ నుంచి వచ్చిన ఈయన ఇప్పుడు FRSH యొక్క వంటగది కార్యకలాపాలు చూసుకుంటున్నారు.

FRSH కిచెన్

FRSH ఫుడ్ డెలివరీ మార్కెట్లో నెంబర్ వన్ గా నిలబడడానికి మేము మా కస్టమర్ల కావాల్సిన రుచికి ప్రాధాన్యం ఇస్తామంటారు. మా వినియోగదారులకు అన్ని చెక్ మార్క్స్ చూసుకోవాలని సూచిస్తాము. ఆహారం స్పైసీ గా ఉంటూనే.. అందరికి టేస్టీగా అందించేందుకు ఉపయోగపడుతుంది. హడావిడిగా ఆతురుతలో తయారు చేయమని, తక్కువ ధరలో కస్టమర్లకు అందిస్తామని "బాదల్ చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు ద్వారా అధిక నాణ్యతతో, కంపెనీ FRSH ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మెనూ ఉంచుతుంది ఫుడ్ టెక్నాలజీ సెక్షన్.

అందరి మన్ననలతోనే

FRSH వేగంగా సేవలు అందించడంతో అందరి మన్ననలు పొందుతోంది. బ్యాకెండ్ టెక్నాలజీతో వంటగది కార్యకలాపాలు ఈజీ అయిపోయాయి.కొత్త ఆర్డర్లు, జాబితా, వంటకాలను, తయారీ,డెలివరీ నుండి ప్రతిదీ ఇన్ హౌస్ డాష్ బోర్డు ద్వారా నిర్వహించవచ్చు. ఇప్పుడు మా సక్సెస్ తో అనేక నగరాల్లో మరిన్ని వంటశాలలు అందించేందుకు సిద్ధమంటున్నారు బాదల్. సంస్థ వెబ్ తో పాటు, ఒక Android ఆప్ ప్రారంభించారు. "మా మెను, ఆరోగ్యానికి అలారం లాంటిదని రోజూ వారీ టెన్షన్ లతో ఉన్న ఎంప్లాయిస్ కు తగిన డైట్ అందిస్తామని సుమిత్ వివరించారు.

ఒక్కో అడుగు...

గుర్గావ్ లో స్థాపించబడిన ఫ్రెష్ రోజువారీ ఆరోగ్య ఆహారం కోసం అందించే ఫుడ్ ఐటెమ్స్ అందరి మన్ననలు అందుకుంటున్నాయి. టెక్నాలజీతో పాటు సంస్థ మరిన్ని నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. FRSH వ్యాపార నమూనా foodtech ప్రదేశంలో అత్యంత విజయవంతమైన సంస్థగా నిలుస్తోంది.రాబోయే కొన్ని రోజుల్లో మరిన్ని కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.