సూటిగా, సుత్తి లేని రివ్యూలకు 'గాడ్జెట్ అడ్డా'

సాంకేతికతపై చక్కనైన సమాచారంకొత్తగా వచ్చే మార్పులను వివరించే అడ్డాకొత్త తరం అభిరుచికి తగినంత వివరాలుమార్కెట్ లో కొత్త లాంచింగ్ లపై తాజా విశేషాలు

0

టెక్నాలజీపై ఉన్న అభిరుచి ఇద్దరు ఇంజనీర్లను గాడ్జెట్ స్టార్టప్ ఏర్పాటుకు ప్రాణం పోసింది. అపూరవ్ గిలోత్ర, ప్రతీక్ గంభీర్.. ఆలోచనలు కలిశాయి. అసంపూర్ణంగా, అర్థం కాని గాడ్జెట్ రివ్యూలతో ఇద్దరూ విసుగెత్తిపోయారు. తమ నైపుణ్యంతో ఓ సరికొత్త వేదికకు రూపకల్పన చేశారు. గాడ్జెట్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలియజేయడానికి ‘గాడ్జెట్అడ్డా’ పేరుతో ఓ ప్రచురణను మొదలుపెట్టారు.

గాడ్జెట్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు ‘గాడ్జెట్ హబ్ ’ పై క్లిక్ చేస్తే ఎంతో ఆసక్తి కరమైన సమాచారం లభిస్తుంది. ఇంతేగాక తమ అభిరుచులను పంచుకుంటూ చర్చించే అవకాశం కూడా లభిస్తుంది. అందువల్లే దీనికి ‘గాడ్జెట్అడ్డా ’ అనినామకరణం చేసాం” వివరించారు అపూరవ్. ‘అడ్డా’ అన్నది నలుగురు కలిసి సమావేశమయ్యే చోటుగా బెంగాలీ భాషలోవాడుకలోఉన్న పదం. “టెక్ ఫ్రీక్ పాఠకులకు అర్థమయ్యే శైలిలో సమాచారం అందించడమే ఈ అడ్డా మొదటి ప్రాధాన్యలక్ష్యం. ‘టెక్ అప్ డేట్స్ సింప్లిఫైడ్' అనేదే మా ట్యాగ్ లైన్.

ప్రారంభం ఎలా ?

మా సంభాషణ ఎల్లప్పుడూ గాడ్జెట్ల గురించే జరిగేది. మా ఇద్దరికీ గాడ్జెట్లు, టెక్నాలజీపై ఒకే రకమైన అభిరుచి ఉందని మేముగ్రహించాము. అప్పుడు పుట్టిందే గాడ్జెట్అడ్డా” అని గుర్తుచేసుకుంటూ చెప్పారు అపూరవ్.

అపూరవ్
అపూరవ్

అపూరవ్ ఒక టెక్ ఫ్రీక్ అయితే ప్రతీక్ డిజైనింగ్‌లో నేర్పరి .తాము రూపకల్పన చేసిన ఉత్పత్తిని మరింత వినూత్నంగా అభివృద్ధి చేయాలని వీరిరువురూ సంకల్పించారు. ‘గాడ్జెట్స్ రివ్యూ’ అనే ఒక నూతన విభాగం ఆవిష్కరించారు. దీనిలో గాడ్జెట్ గురించి ఒక ఇన్ఫోగ్రాఫిక్స్ సమీక్షలు ఇంటరాక్టివ్ రూపంలో ఉంటాయి.

“ఐకాన్ సహాయంతో కంటెంట్‌ను సులువుగానే కాక అతి త్వరగా అర్థం చేసుకునే విధంగా రూపొందించాం. ఒక పాఠకుడు ఒక స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ తెలుసుకోవాలంటే గ్రాఫిక్ రివ్యూ ద్వారా ఇది చాలా సులువు. ఇందులో ఫోన్‌లోని ఒక్కో ప్రత్యేక ఫీచర్‌ పాఠకుల దృష్టిని సులువుగా ఆకర్షించే ఒక ప్రత్యేకమైన సమాచారం అందుతుంది. దీంతో పాటు వివరణాత్మక హెడింగ్‌ సహా మొబైల్ ధరలు వంటి ఇతర వివరాలు ఉంటాయి.

ప్రతీదీ ఒకొక్కటిగా చూసి తెలుసుకునే దానికంటే ఇక్కడ వేగంగా, సులువుగా ఆ ప్రాడక్ట్‌ గురించి తెలుసుకోవచ్చు. యాదృచ్ఛికంగా ఢిల్లీ మెట్రో ప్రయాణికులతో అనేక సమీక్షలపై గణనీయమైన విశ్లేషణ జరిపిన తర్వాతే వారికి ప్రేక్షకులు గాడ్జెట్ కొనుగోలు చేసే ముందు ఏ వివరాలు కోసం వెదుకుతారో ఓ అవగాహన వచ్చింది. “దీర్ఘ వ్యాస రూపంతో పోలిస్తే గ్రాఫిక్‌ రూపంలో అందించే సమాచారం ఎక్కువ సమయం మన స్మృతిలో ఉండటం సహజం. ఇలా పాఠకులకు కావలిసిన అనేక అంశాలు పరిగణించిన తరువాతే మా గ్రాఫిక్ రివ్యూ అవతరించింది. మా తొలి గ్రాఫిక్‌ సమీక్షకు, ఇప్పుడు పాఠకుల అభిరుచి మేరకు చేసిన మార్పులతో పోల్చుకుంటే ఎంతో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తోంది. మా ఇప్పటి గ్రాఫిక్ రివ్యూ చూస్తే మేమే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యామంటారు'' అపూరవ్.

ప్రతీక్ గంభీర్
ప్రతీక్ గంభీర్

గ్రాఫిక్ రివ్యూ సెక్షన్

ఒక ఉత్పత్తిలోని మంచి చెడులపైన సమీక్ష ఒక గ్రాఫిక్ లేఔట్ విధానంలో అందిస్తారు. “మా జట్టులో 6 మందిసభ్యులు. కంటెంట్ అభివృద్ధికై సంపూర్ణ పరిశోధన జరుపుతాము. కంటెంట్ పాఠకులకు అనువుగా ఉండే గ్రాఫిక్స్ వాడకంతో వారు తొలిసారి చూసినపుడే అతితేలికగా అర్ధం చేసుకునే శైలిలో కంటెంట్ డిజైన్ చేస్తాం. లోతైన విశ్లేషణలు జరిపిన తర్వాత మా మాస్కట్ (Mascot GA T o T) నిక్కచ్చిగా రివ్యూ ఇస్తుంది'' అంటారు అపూరవ్.

ఇవే ఆ వివరాలు

  • ఆవిష్కరించిన తేది, వెల
  • స్పెసిఫికేషన్స్
  • ఫీచర్స్
  • లాభ, నష్టాలు
  • నిర్దిష్ట పరీక్షలు
  • ఒక్కో విభాగానికి ప్రత్యేక రేటింగ్
  • Ga ToT రేటింగ్

“ప్రస్తుతం మేము ఎంపిక చేసిన కొన్నిస్మార్ట్ ఫోన్లపైనే గ్రాఫిక్ రివ్యూను ఇస్తున్నాేం. రాబోయే రోజుల్లో మరిన్ని ఫోన్లపై సమీక్ష అందచేయాలని మా సంకల్పం. ఈ విశ్లేషణలు, ఫీడ్ బ్యాక్ సహాయంతో పాఠకులకు కావాల్సిన మరిన్ని వివరాలు అందించడం, వారికి అంతగా అవసరం లేని సమాచారాన్ని తొలగించడమే మా భవిష్యత్ ప్రణాళిక'' - అపూరవ్
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik