భవిష్యత్తులో ఎలాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందో 'మ్యాప్ మై జీనోమ్‌'తో ముందే గుర్తించొచ్చు

అనారోగ్యం గుట్టువిప్పే జినోమ్‌పత్రివంశవృక్షం లాగే జీన్‌మ్యాప్ తయారుచేసుకోవాలంటున్న అను ఆచార్యఫలితాల కోసం సుదీర్ఘ సమయం వేచి చూడాల్సిందేఏ వ్యాధులు సంక్రమించే అవకాశముందో ముందే చెప్పే ప్రయత్నం

భవిష్యత్తులో ఎలాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందో 'మ్యాప్ మై జీనోమ్‌'తో ముందే గుర్తించొచ్చు

Wednesday July 01, 2015,

5 min Read

అమెరికాలో ఓ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న అను ఆచార్య 2000వ సంవత్సరంలో తన ప్రస్థానాన్ని చికాగో నుంచి హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లో పెట్టబోయే కంపెనీకి ఓసిమమ్ బయో సొల్యూషన్స్ అనే పేరు పెట్టారు. శాస్త్రవేత్తలకు వివిధ విషయాల్లో సాంకేతికపరమయిన సలహాలను, సూచనలను ఈ సంస్థ అందిస్తుంది.

ఓసిమమ్ సొల్యూషన్స్‌కు కుబేరా పార్ట్‌నర్స్, ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. 15 ఏళ్ళుగా కంపెనీ నిరాటంకంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇవన్నీ అను ఆచార్యను సంతృప్తి పరచలేకపోయాయి. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్యసమస్యలకు మూలకారణం ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. సుదీర్ఘమయిన పరిశోధనల తర్వాత ప్రతి వ్యాధికి కారణమయిన జీన్స్‌ను వైద్యులు పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఫార్మా కంపెనీలకు మేం ఒక సబ్‌కాంట్రాక్టర్‌లా పనిచేస్తున్నాం అంటారు అను ఆచార్య.

అను ఆచార్య, మ్యాప్ మై జీనో్ వ్యవస్థాపకురాలు

అను ఆచార్య, మ్యాప్ మై జీనో్ వ్యవస్థాపకురాలు


ఆమె మాటల్లోనే..

''ఈ ప్రక్రియ చాలా కాలంపాటు పడుతుంది. అనుకున్నవెంటనే ఫలితాలు మన చేతికి రావంటారామె. ఈ పని వేగవంతంగా జరగాలంటే కుదరదని, సుదీర్ఘమయిన, శాస్త్రీయమయిన విశ్లేషణలకు సంబంధించిన విషయాలంటారు అను ఆచార్య. మా పరిశోధనలు ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడవు. వారికి మేం చేస్తున్నదేంటో అర్థం కాదు. కానీ మానవాళి సంక్షేమానికి మా సంస్థ పరిశోధనలు బాగా పనిచేస్తాయనేది ఆమె నమ్మకం.

మ్యాప్‌మై జినోమ్ ఇలా మొదలైంది

మేం శాస్త్రీయ పరిశోధనలను అందరికీ తెలియచేయడానికి మేప్‌మైజినోమ్ అనే సంస్థను ప్రారంభించాం. మేం చేస్తున్న కార్యకలాపాలు చాలా కష్టంతో కూడుకున్నవి. ఇప్పటికే మేం ఓసిమమ్ బయో ద్వారా పరిశోధనలపై దృష్టి పెడుతూనే వున్నాం. ఏదో సాధించాలని దీనిని ప్రారంభించాం. అయితే ఓసిమమ్‌తో పాటు మేప్‌మై జినోమ్ ద్వారా సరికొత్త సంగతులు ఆవిష్కృతం అవుతాయి.

మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, మా శ్రేయోభిలాషుల సలహాతో ఒక నిర్ణయానికి వచ్చాం. ఓసిమమ్ బయోకి అనుబంధ సంస్థగా మేప్‌ మై జినోమ్‌ని ఏర్పాటు చేయాలనుకున్నాం. ప్రతి పరిశోధనలను క్రమపద్ధతిలో ముందుకు తీసుకువెళుతున్నాం. మరో రెండేళ్ళలో మేప్‌మై జినోమ్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా మారుస్తాం.

ప్రత్యేక తరహా వ్యాధుల విషయంలో మేం చేసే పరిశోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఓసిమమ్ బయో సంస్థ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు అందరికీ ఉపయోగపడాలి. మేప్‌మై జినోమ్ కోసం మా ఓసిమమ్‌ బయో సంస్థ ఎంతసేపు పనిచేస్తుందో ముందుగానే నిర్ణయించుకున్నాం. ఏ విషయాలూ మేం దాచిపెట్టాలని అనుకోవడం లేదంటారు. 2012 లో ఆల్గోరిథమ్‌కు సంబంధించి ఓ శిబిరం నిర్వహించాం. పరిశోధనలకు ఉపయోగపడే డేటాను ఎన్నో చోట్ల నుంచి మేం పొందాం. డౌన్‌లోడ్ చేసుకున్నాం. గతంలో ఓసిమమ్ బయో సంస్థ వివిధ జినోమ్ ప్రాజెక్టులకు సంబంధించి అమెరికాలో 150 మిలియన్ డాలర్లు సముపార్జించాం. వివిధ జినోమ్ విషయాలకు సంబంధించి 22 వేల శాంపిల్స్ మేం సేకరించాం. ఈ శాంపిల్స్‌పై ఎంతో విశ్లేషణాత్మకమయిన, వివరణలతో కూడిన డేటాబేస్‌ను మా దగ్గర ఉంది.

2013లో స్వంత నిధులతో మేప్‌మై జినోమ్ ఏర్పాటైంది. ఓసిమమ్ బయో నుంచి బయటకు వచ్చిన నేను మేప్‌మై జినోమ్‌పై దృష్టి పెట్టారు. దీనికోసం పూర్తి సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ కంపెనీని అమెరికాకు తరలించాలనే ఆలోచనను పక్కన పడేశాను. దీనికి ఓ బలమయిన కారణం ఉంది. అమెరికాకు చెందిన జెనోమిక్స్ కంపెనీ 23 అండ్ మీ & ఎఫ్‌డీయే దీనికి కారణం. ఇది ఎన్నో ప్రతిష్టాత్మకమయిన పరిశోధనలు చేసింది. ఇదే స్ఫూర్తితో నేను పరిశోధనల కోసం మేప్ మై జినోమ్ ను తీర్చిదిద్దాను. హైదరాబాద్ కేంద్రంగా ఇది పనిచేయాలని నిర్ణయించుకున్నాను.

జన్మ పత్రి నుంచి జినోమ్ పత్రి వరకూ పరిశోధనలు సాగాలి. నిజానికి జ్యోతిష్యం, జాతకచక్రం గురించి మనం ప్రతినిత్యం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. మేం కూడా వివిధ వ్యాధులకు సంబంధించి జాతకచక్రంలాంటిది తయారుచేయాలి. ప్రతి వ్యక్తికి సంబంధించి పూర్తి ఆరోగ్యకరమయిన జాతకాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది.

జినోమిక్స్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం మేం సేకరించాలనుకుంటున్నాం. సాధారణంగా ఒక బిడ్డకు సంబంధించిన జీన్స్ తెలుసుకోవాలంటే బొడ్డుతాడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బొడ్డుతాడు ద్వారా వైద్యులకు ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. ఈ బొడ్డుతాడును అంతా బ్యాంకుల్లో భద్రపరుచుకుంటున్నారు. అలాగే మా జినోమ్ పత్రి ద్వారా వివిధ వ్యాధులకు కారణాలేంటో పరిశోధించి ఒక డేటాను అందరికీ అందుబాటులోకి తెస్తే ఎన్నో వ్యాధులను ఆదిలోనే అంతం చేయవచ్చు.

జినోమ్ పత్రి వల్ల ఏ వ్యాధులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆహారం ఎలా తీసుకోవాలో మన జీవనవిధానాన్ని నిర్దేశించుకోవచ్చు. జినోమ్ వివరాలు తెలిస్తే 100 రకాలకు సంబంధించిన వ్యాధులను ప్రాథమిక దశలోనే నిర్దారణ చేయవచ్చు. వివిధ వ్యాధులకు సంబంధించి మనం వాడే మందులు, ఔషధాలు ఎందుకు రియాక్షన్స్ ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు 50 మంది మధుమేహ రోగులపై డ్రగ్స్‌ ప్రభావాన్ని జినోమ్ పత్రి ద్వారా తెలుసుకోవచ్చు. ఏ డ్రగ్స్‌ను వాడాలి, ఏ డ్రగ్స్‌ను ఏ పరిమాణంలో తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.

జినోమ్ పత్రి విధానాలు

మన కుటుంబానికి సంబంధించిన పూర్తి ఆరోగ్యసమాచారం జినోమ్ పత్రి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవికమయిన, సాంకేతిక పరమయిన అంశాలు ఖచ్చితంగా మనకు తెలియచేస్తారు. దీని ప్రశ్నావళి కూడా చాలా సులభంగా ఉంటుంది. కుటుంబ సంబంధమయిన వ్యాధుల వివరాలు, వాడిన మందులు అన్నీ తెలియచేయాల్సి ఉంటుంది. పదినుంచి 20 నిముషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మా దగ్గర జెనెటిక్ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారు. రోగుల వివరాలకు ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశోధనాత్మక దృష్టితో ఆలోచించి అన్ని విధాలుగా ఉపయోగపడేలా డేటా తయారుచేస్తారు.

మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎలా ఉంది ? రోగనిరోధక వ్యవస్థను ఎలా పటిష్టం చేసుకోవాలో మేం ఇచ్చే సమాచారం ద్వారా అవగాహనకు రావచ్చు. సాధారణంగా మనకు వచ్చే వ్యాధులు, చర్మ సంబంధమయిన ఇబ్బందులు, మలబద్ధకం, అజీర్ణ వ్యాధులకు కారణాలను తెలుసుకుని మందులు వాడవచ్చు.

ప్రస్తుతం మన జీవన విధానం, ఆచరిస్తున్న పద్ధతులు, ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలో మా దగ్గర ఉన్న డాక్టర్ రోగులకు సిఫారసు చేస్తారు. గతంలో మనకు తెలియని ఎన్నో విషయాలను డాక్టర్లు మనకు వివరిస్తారు. జినోమ్ పత్రి ద్వారా మన శరీరం గురించి, మనకు అంతుబట్టని విషయాలను, ఆసక్తికరమయిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

బ్రెయిన్ మేప్

మేప్‌మై జినోమ్ ఆరోగ్యకరమయిన అంశాలతో పాటు మెదడుకు సంబంధించిన మేప్‌ను కూడా మేం తయారుచేసి అందిస్తాం. న్యూరోకి సంబంధించిన వెబ్ న్యూరో లంగ్ క్యాన్సర్, నికోటిన్ టెస్ట్ కార్డియో మేప్ కూడా తయారుచేస్తాం. మేప్‌మై జినోమ్ తయారుచేసే నివేదికలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. 38 ఆసుపత్రులు మేప్‌మై జినోమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫిట్‌నెస్ సెంటర్లు కూడా మా సేవలు పొందుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే శాంపిల్స్ సేకరించి ఆయా కస్టమర్లకు వారికి సంబంధించిన జీన్స్ వివరాల నివేదిక కూడా అందిస్తున్నాం. యోగా సెంటర్లు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నాయి .

మేం నిదానంగా ముందుకువెళ్లాలని భావిస్తున్నాం. పరిశోధనలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. అయితే ఈ ఫలితాలు మాత్రం చాలా వేగంగా మార్పులు తెస్తాయి. డాక్టర్ లాల్, కిమ్స్ వంటి వైద్యసంస్థలలో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. రోజుకు మేం 38 వేల మంది రోగులను చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మేం పరిశోధనలు చేస్తున్నాం. ఉత్తర భారతదేశంలో అనేక హాస్పిటళ్ళు డాక్టర్ లాల్ కంపెనీతో సంప్రదిస్తుంటాయి. వివిధ ఆరోగ్య సంబంధమయిన విషయాల్లో డాక్టర్ లాల్ మా సంస్థ సలహా తీసుకుంటారు. అలాగే ఢిల్లీకి సంబంధించిన ఆన్‌క్వస్ట్‌‌తో కూడా ఒప్పందం ఉంది. మనదేశంతో పాటు సింగపూర్, మలేషియాతో కూడా ఒప్పందం ఉంది.

రూ.1000 నుంచి 25 వేలు

మేప్‌మై జినోమ్ ద్వారా వివిధ ఆరోగ్యసంబంధమయిన విషయాల్లో సమగ్ర సమాచారం పొందాలనుకునే వారి దగ్గర రూ.వెయ్యి నుంచి 25 వేల వరకూ ఛార్జి చేస్తాం. మేం అందించే సమాచారం చాలా ఖచ్చితంగా ఉంటుంది. మేం చేసే టెస్టులకు చాలా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతో చేయడం మాకు సాధ్యం కాదు. అలాగని మేం నష్టపోయి కస్టమర్లను సంతృప్తి పర్చాలని మేం అనుకోవడం లేదు అంటారు అను.

ఎలాంటి ప్రచారం లేకుండా 25 వేల ప్రొడక్ట్‌లు కస్టమర్లకు విక్రయించాం. దీనివల్ల ఖర్చు అదుపులో ఉంటుంది. పరిశోధనల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

రాజీలేని నాణ్యత

‘మేప్‌మై జినోమ్’ లో వాడే ల్యాబ్ పరికరాలు చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నది. డేటాకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వివిధ రోగాలకు సంబంధించి రోగులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా వివరిస్తాం. ఇతర దేశాలను పోల్చి వివరణ ఇస్తాం. అదే సమయంలో కొంతమంది రోగులకు కౌన్సిలింగ్‌కూడా ఇస్తాం.

మన పూర్వీకులు ఎక్కువగా గోత్రాలపై ఆధారపడి ఉండేవారు. సగోత్రీకుల మధ్య వివాహ సంబంధాలు అంతగా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ఒకే గోత్రంలో వివాహాలు జరిగితే జన్యుసంబంధమయిన ఆరోగ్యసమస్యలు వస్తాయి. పిల్లలు అవలక్షణాలతో పుడతారని అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడేవారు. గోత్రాలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా జినోమ్ పత్రి ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం మనకున్న సాంకేతిక పరికరాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తే ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ప్రజలు తమ ఆరోగ్యంపై పూర్తి అవగాహన పెంచుకోవడం ద్వారా ఎన్నో వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు. నాలుగైదు అంశాలు తమను ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెడితే మంచిది. రాబోయే రోజుల్లో ఆరోగ్యపరమయిన ఇబ్బందులు, పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆరోగ్యసమస్యలు ప్రధాన సమస్యగా మారతాయి''- అను ఆచార్య.


-------------