ప్రపంచ డైనమిక్ నగరాల్లో టాప్ వన్ బెంగళూరు, ఐదో స్థానంలో హైదరాబాద్  

జేఎల్ఎల్ రూపొందించిన జాబితా

0

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్.. మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని టాప్ 10 డైనమిక్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. లండన్ , బోస్టన్ లాంటి నగరాలను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని సాధించింది. జేఎల్ఎల్ రూపొందించిన ఈ జాబితాను.... వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో విడుదల చేశారు. టాప్ టెన్ లిస్టులో హైదరాబాద్ కు చోటు దక్కడం గర్వకారణమన్నారు.. మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ కీర్తి విశ్వవ్యాప్తమవుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు భాగ్యనగరంవైపు చూస్తోంది. హైదరాబాద్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బడా బడా కంపెనీల ఫస్ట్ చాయిస్ గా ఉన్న హైదరాబాద్.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని టాప్ టెన్ డైనమిక్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది.

ప్రపంచంలో శక్తివంతమైన 10 నగరాల జాబితాలో భాగ్యనగరానికి ఐదో స్థానం లభించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రకటించిన టాప్-10 జాబితాలో హైదరాబాద్ చోటుదక్కించుకుంది. జేఎల్ఎల్ రూపొందించిన ఈ జాబితాను.... వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో విడుదల చేశారు. జనాభా, విద్య, టెక్నాలజీ, కనెక్టివిటీ, ఆర్థిక పురోగతి, కార్పొరేట్ యాక్టివిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ ఆధారంగా జాబితా రూపొందింది. ఈ జాబితా ప్రకారం బోస్టన్, ఆస్టిన్, లండన్ నగరాలను హైదరాబాద్ వెనక్కి నెట్టింది. సిలికాన్ వ్యాలీ, షాంఘై తర్వాత ఐదో స్థానంలో నిలిచింది.

టాప్ 30 నగరాల్లో ఇండియాకు చెందిన ఆరు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఈ లిస్టులో 23వ స్థానంలో నిలిచింది. చైనా మాత్రం ఐదు నగరాలతో సరిపెట్టుకున్నది. మొత్తం 134 నగరాలు, మెట్రోపాలిటన్ ప్రాంతాలను 42 అంశాల ప్రాతిపదికగా పరిశీలించి ర్యాంకులను ప్రకటించారు.

వల్డ్ డైనమిక్ సిటీస్ టాప్ టెన్ నగరాల జాబితాను చూస్తే బెంగళూరుకు మొదటి స్థానం, వియత్నాంలోని హోచిమిన్ సిటీకి రెండో స్థానం, అమెరికాలోని సిలికాన్వ్యాలీ మూడోస్థానం, చైనాలోని షాంఘైసిటీ నాలుగోస్థానంలో నిలిచాయి. ఇక హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటింది.లండన్ ఆరోస్థానంలో నిలవగా, ఆస్టిన్ ఏడో ప్లేసులో నిలిచింది. వియత్నాంలోని హనోయి ఎనిమిదో స్థానాన్ని సాధించగా.. అమెరికాలోని బోస్టన్ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. కెన్యాలోని నైరోబి పదో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ వరల్డ్ డైనమిక్ సిటీస్ టాప్ టెన్ లో చోటు సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో హైదరాబాద్కు చోటు దక్కడం గర్వకారణన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరు మొదటిస్థానంలో నిలవడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. 

Related Stories