అందుకే.. ఇంటిని చూసేముందు ఇంటీరియర్ ను చూడమన్నారు..!!

అందుకే.. ఇంటిని చూసేముందు ఇంటీరియర్ ను చూడమన్నారు..!!

Tuesday March 01, 2016,

3 min Read


పర్ ఫెక్ట్ డ్రెస్సింగ్ ఎవరికైనా ప్రధానాంశం. బాడీ లాంగ్వేజ్ ను బట్టి డ్రెస్సింగ్ చేసుకుంటే మనిషికి మరింత అందమొస్తుంది. చూసేవారికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. డిగ్నిఫైడ్ గా కనబడటానికి డ్రెస్సింగ్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో .. అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇంటి ఇంటీరియర్ విషయంలో తీసుకుంటోంది నవతరం. ఇలాంటి వారి అభిరుచులకు తగ్గట్లుగా ఫర్నీచర్ ను సిద్ధం చేయడానికి కొంత మంది సీరియల్ అంట్రపెన్యూర్స్ చేతులు కలిపారు. దానికి ఫలితమే స్టార్టప్"ఉడ్ బాక్స్". 

అతిథులు ఎవరైనా ఇంట్లో ముందుగా అడుగుపెట్టేది లివింగ్ రూమ్ లోనే. అడ్డదిడ్డమైన ఫర్నిచర్, నప్పని కలర్స్ తో కుర్చీలు , ఎగుడుదిగుడుల సోఫాలు ఉంటే అతిథులు ఎప్పుడు వెళ్లిపోదామా అని గుమ్మం వంక చూస్తూంటారు. ఇంటికొస్తే ఇలాంటి ఇంటీరియర్ ఇంటి యజమానులకు మింగుడుపడని విషయమే. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఫర్నీచర్ కొనడం వరకే వారి పని. ఇంటికి నప్పుతుందో లేదో తెచ్చుకునే దాకా తెలీదు. ఈ ఇబ్బందిని వినియోగదారులకు తప్పించి... లివింగ్ రూమ్ కు కావాల్సిన ఫర్నిచర్ ను చూపించి తయారు చేసి పెడుతుంది"ఉడ్ బాక్స్". 

ఉడ్ బాక్స్ ఐడియా ముంబైకి చెందిన షలీల్ ఖన్నాది. సాలిడ్ ఉడ్ ఫర్నిచర్ తయారుచేయడంలో ఖన్నాకు దశాబ్దాల అనుభవం ఉంది. తన సర్కిల్ లో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులూ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా చేసుకుంటూ పోతే మార్కెట్ ఎప్పటికీ పరిమితమే. దీన్ని గుర్తించే ఆన్ లైన్ వైపు దృష్టి సారించాడు. షలీల్ చిన్ననాటి స్నేహితుడు అనురాగ్ మెహ్రోత్రా. షలీల్ ఫర్నీచర్ పొటెన్షియాలిటీ అనురాగ్ కు బాగా తెలుసు. అందుకే మరో మిత్రుడు కృష్ణకాంత్ ఠాకూర్ తో కల్సి ఉడ్ బాక్స్ ప్రారంభించాడు. వీరికి తర్వాత జతకలిసిన అనురాగ్ స్కూల్ మేట్ గౌతమ్ సింగ్ వర్చువల్ రియాలిటీ ఐడియాతో "ఉడ్ బాక్స్" కు స్పెషలైజేషన్ తీసుకొచ్చాడు. ఇంటికి ఎలాంటి మోడల్ ఫర్నీచర్ నప్పుతుందో.. ఏ కలర్ మ్యాచింగ్ గా ఉంటుందో వినియోగదాడు "కన్జూమర్ ఫేసింగ్ మోషన్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా "ఉడ్ బాక్స్" లో చూసుకోవచ్చు.

భాగస్వాములందరూ తమ తమ నైపుణ్యాన్ని ఉడ్ బాక్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఐఐఎంలలో చదివి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసిన అనురాగ్, కృష్ణకాంత్ ఇంతకు ముందు లయన్ వెంచర్స్ పేరుతో కొన్ని స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టారు. గౌతమ్ సింగ్ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసి తిరిగొచ్చారు. షలీల్ కు ఫర్నీచర్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 

ఫర్నిచర్ విషయంలో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎవరూ ముందుడుగు వేయలేక పోతున్నారు. అన్నింటికీ ఒకటే అనే విధానం ఇక్కడ సరిపోదు. అందుకే అభిరుచి కలిగిన వారికి అనువైన డిజైన్లు ఇప్పటికీ దొరకడం లేదు- కృష్ణకాంత్, కో ఫౌండర్, ఉడ్ బాక్స్

a12bc34de56fgmedium"/>

ఈ సమస్యను పరిష్కరించడానికి ఉడ్ బాక్స్ హైక్వాలిటీ, సూపీరియర్ డిజైన్లతో కేటలాగ్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే 8 వేల రకాల సోఫా సెట్లు ఇప్పుడు "ఉడ్ బాక్స్" కేటలాగ్ లో ఉన్నాయి. వినియోగదారునికి పూర్తిస్థాయిలో సంతృప్తికర సర్వీస్ అందించేందుకు టెక్నాలజీపైనే అధికంగా ఉడ్ బాక్స్ ఖర్చు చేస్తోంది. షోరూముల్లో ప్రత్యక్షంగా చూసుకున్నా... ఇంటికి కరెక్ట్ గా సరిపోతుందో లేదో WBinteriAR యాప్ లో చూసుకోవడం ద్వారానే వినియోగదారుడు ఎక్కువ శాటిస్ఫేక్షన్ పొందుతాడని కృష్ణకాంత్ చెబుతున్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు ఆర్డన్ ఇచ్చిన తర్వాతే ఫర్నిచర్ చేయడం ప్రారంభిస్తారు.

ఇంట్లోనుంచి అడుగు బయటపెట్టకుండానే తమ ఇంట్లో సరిపోయే ఫర్నీచర్ ను ఎంచుకునేలా వినియోగదారులకు టెక్నాలజీని అందిస్తున్నాము. దీని కోసం WBinteriAR యాప్ ఉపయోగిస్తున్నాం- కృష్ణకాంత్, కో ఫౌండర్, ఉడ్ బాక్స్

ఉడ్ బాక్స్ అగమెంట్ రియాలిటీ యాప్ ను గత ఏడాది అక్టోబర్ లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి నెలకు సగటున ఒక్కోటి రూ.80 వేల విలువగల 30 ఆర్డర్లను ఉడ్ బాక్స్ సాధించింది. ప్రస్తుతం ఆరు నగరాల్లోనే ఉడ్ బాక్స్ సేవలు అందిస్తోంది. వచ్చే ఒక్క సంవత్సరంలో 20 నగరాలకు విస్తరించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. లక్షా ముఫ్ఫైవేల డాలర్ల పెట్టుబడిని సమీకరించనున్నారు.

అగుమెంటెడ్ రియాలిటీ మార్కెట్ ప్రస్తుతం జూమింగ్ లో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో దుస్తుల మార్కెట్ ది ఎక్కువ వాటా. దుస్తులు ఫిజికల్ గా ధరించకపోయినా.. వేసుకున్నట్లు చూసుకుని షాపింగ్ చేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ తర్వాత ప్లేస్ ఫర్నిచర్ మార్కెట్ దే. ఇండియాలో హోమ్ ఫర్నీచర్ అండ్ డిజైన్ మార్కెట్ గత ఏడాది 25 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2010లో ఈ మొత్తం 3 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే ఏడాదికి 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకెళ్తే "ఉడ్ బాక్స్"లాంటి స్టార్టప్స్ సక్సెస్ మీద అనుమానం పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు.