డిజైనర్ డ్రస్సుల ఆదాయం పత్తి రైతులకూ అందాలంటున్న నిషా నటరాజన్

హోటల్ మేనేజ్‌మెంట్ చదివి టెక్స్‌టైల్ బిజినెస్‌లోకి...ఆరేళ్ళ క్రితమే స్టార్టప్ ప్రారంభించిన నిషా పత్తిరైతులకు భరోసా కల్పించిన నిషా నటరాజన్ పంట నుంచి డిజైన్ల వరకూ అన్నింటిలోనూ రైతులతో ప్రయాణండిజైన్ల ద్వారా వచ్చే ఆదాయం పత్తి రైతులకు అందాలంటున్న నిషా

	డిజైనర్ డ్రస్సుల ఆదాయం పత్తి రైతులకూ అందాలంటున్న నిషా నటరాజన్

Monday June 08, 2015,

5 min Read

తక్కువ ధరకు ఏదైనా వస్తువు లభిస్తే.. ఇక వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేసి అక్కడి నుంచి ఎవరైనా మెల్లిగా జారుకుంటారు. అదే తాము చేసే వ్యాపారానికి కీలకమైన ముడి సరుకు చౌకగా వస్తే ఎవరు మాత్రం కాదంటారు. కానీ జరియా సంస్థ వ్యవస్థాపకురాలు నిషా మాత్రం అందరిలా ఆలోచించలేదు. మనం సొమ్ము చేసుకుంటున్నప్పుడు వాళ్లకు మాత్రం ఎందుకు తక్కువ ఇవ్వాలి. వాళ్లకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలనే ఉద్దేశం ఆమెది. అందుకే తాను డిజైన్ చేసిన దుస్తుల్లో వచ్చే లాభాన్ని వారి ప్రయోజనానికి వెచ్చిస్తోంది. దళారీ వ్యవస్థను తగ్గించి నేరుగా పత్తి రైతుకు ప్రయోజనం దక్కేలా ప్రణాళికలు రచిస్తోంది.

నిషా నటరాజన్, జరియా వ్యవస్థాపకురాలు

నిషా నటరాజన్, జరియా వ్యవస్థాపకురాలు


నిషా నటరాజన్ జరియా స్టార్టప్ ప్రారంభానికి ముందు కన్నన్ లక్ష్మీనారాయణ్ స్ధాపించిన Microspinలో డెవలపర్‌గా పనిచేశారు. రైతులు నాణ్యమయిన కాటన్ ఉత్పత్తి చేసేందుకు వివిధ యూనిట్లు ప్రారంభించారు. పేటేంట్ టెక్నాలజీ ద్వారా డిజైన్డ్ క్లాత్ తయారుచేశారు. ఆరేళ్లకు ముందు జరిగిన సంగతులను నిషా గుర్తుచేసుకుంటున్నారు.

బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్శిటీలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న రోజులవి. అలా చదువుకుంటున్న రోజుల్లో క్లాత్‌పై వివిధ రకాల డిజైన్లు వేసేవారు నిషా. అవి ఫ్రెండ్స్‌కి బాగా నచ్చేవి. ఈ వ్యాపకం మున్ముందు తనకు వ్యాపారం అవుతుందని ఆమె ఊహించలేదు. కొచ్చిన్‌లో కొన్నాళ్ళు పనిచేసిన నిషా అక్కడ్నించి మళ్ళీ బెంగళూరుకు మారిపోయారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ అమెజాన్‌లో ఏడాదిపాటు పనిచేశారు.

‘‘అమెజాన్‌లో జాబ్ వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఫ్రెండ్స్ అంతా నెగిటివ్ కామెంట్లు చేశారు. కానీ నాపై నాకు నమ్మకం ఉంది. ఏదైనా సాధించాలని బయటకు వచ్చేశాను. అనేక విషయాల గురించి నేను ఆలోచిస్తూంటాను. వాటిలో నుంచి డబ్బు సంపాదన ఆలోచన వచ్చింది’’ అంటారు నిషా.

2013 లో నిషా ఓ ఫ్రెండ్ పెళ్లికోసం ఓ డ్రెస్ డిజైన్ చేశారు. అది అందరి దృష్టినీ ఆకట్టుకుంది. తనలోని క్రియేటివిటీ ఏంటో అప్పుడే తనకు అర్థమైంది. రెండేళ్ల అనంతరం ఇద్దరికి ఉద్యోగాలిచ్చింది. వీరిలో ఒకరు మాస్టర్ టైలర్, మరొకరు అసిస్టెంట్ టైలర్. తాను డిజైన్ చేసిన దుస్తులను వారిచేత కుట్టించింది. ఈ డిజైన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

కాటన్‌తో నిషా ప్రయాణం

జరియా ఆరంభానికి చాలా సంఘటనలు దోహదం చేశాయంటారు నిషా. మైక్రోస్పిన్‌లో పనిచేసేటప్పుడు ఓ పత్తి రైతు కుటుంబంతో మాట్లాడింది నిషా నటరాజన్. పంట రుణాలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ పత్తిరైతు నిండా అప్పుల్లో మునిగిపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి మరణంతో ఆ కుటుంబం కకావికలమయింది. చదువుకునే ఆ రైతు కొడుకు పూణెకి వచ్చి ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. ఏడునెలల పాటు పనిచేశాక తన కోసం ఓ కైనెటిక్ కొనుక్కున్నాడు. దీంతో అతని లైఫ్ కొంచెం మారింది. అదే టైంలో అతనితో మాట్లాడిన నిషా.. మైక్రోస్పిన్ ద్వారా ఇలాంటి కుర్రాళ్ళకు మంచి ఉపాధి మార్గం చూపించాలని సంకల్పించింది. ‘‘నేను మంచి మంచి బ్రైడల్‌వేర్ డిజైన్లు ఇస్తాను తయారుచేస్తావా’’ అని అడిగింది. నేను మార్కెటింగ్ చేయగలనా అని అడిగాడు ఆ అబ్బాయి. అయితే ఆమె మాత్రం నీవు మార్కెటింగ్ చేయాల్సిన పనిలేదు. పదిమందికీ వాటి గురించి తెలియచేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చింది. అతనిలో నమ్మకాన్ని పెంచేందుకు ‘‘మనం తయారుచేసిన డిజైన్ డ్రెస్ ఐశ్వర్యారాయ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది?’’ అని అడిగింది. దానికి ఆ అబ్బాయి ముఖంలో ఆశ్చర్యం, ఒకింత గర్వం కనిపించాయి. మనం తయారుచేసే డిజైన్లు అలా జనంలోకి వెళ్తే మన సత్తా ఏంటో తెలుస్తుందని ఆమె వివరించింది.

మైక్రోస్పిన్‌లో నూలు తయారీ

మైక్రోస్పిన్‌లో నూలు తయారీ


బొటిక్ వర్సెస్ బజార్

రెడీమేడ్ దుస్తులు తయారుచేయడం అంతా చేస్తున్నదే. అయితే దీనికి భిన్నంగా ఏమైనా చేయాలని అనిపించింది. ఫెస్టివల్ వేర్ ఆలోచన ఆమెకు వచ్చింది. బుల్దానాలో దీన్ని ఆచరణలో పెట్టాలని నిషా భావించారు. రైతులనుంచే పత్తిని కొనుగోలు చేసి దాని ద్వారా క్లాత్ తయారుచేయాలని భావించారు నిషా. Farm to Fashion పేరుతో స్వయంగా రైతులకు ప్రయోజనం కలిగించే ఏర్పాట్లుచేశారు.

‘‘మనం తయారుచేసే డిజైన్లు అందరికీనచ్చాలి. ఆయా డిజైన్ల ద్వారా వచ్చే ఆదాయం రైతులకు అందాలి’’ అనే సిద్ధాంతంతో ముందుకెళ్ళారు నిషా. సామాన్యులకు కూడా ఈ డిజైన్లు అందుబాటులో ఉండాలని భావించారు. అందులో భాగంగా తాము తయారుచేసిన వాటినితామే మార్కెటింగ్ చేసుకోవాలని భావించారు. ఫ్యాబ్ ఇండియా, వెస్ట్‌సైడ్ లాంటికంపెనీలకు డిజైన్లు చేసి ఇవ్వాలని ఆమె భావించలేదు.

13 వ బెంగళూరు ఫ్యాషన్ వీక్‌లో తాము తయారుచేసిన డిజైన్లను జరియా బ్రాండ్‌తో ప్రారంభించారు నిషా. యువతరానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా ఇది ఒక అవకాశంగా భావించారు నిషా. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు నిషా.

‘‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకు డిగ్రీలు లేవు కానీ వినియోగదారులు, వీఐపీల ఆలోచనలు, అభిరుచులు నాకు తెలుసు. హోటల్ మేనేజ్‌మెంట్ చదివి..హోటల్స్‌లో పనిచేసేటప్పుడు కూడా ఎన్నో అనుభవాలు చూశానంటారు నిషా.

మేకింగ్, స్టిచ్చింగ్, హార్వెస్టింగ్, కార్డింగ్, వీవింగ్‌లో జరియా ద్వారా తమదైన ముద్ర వేశారు నిషా. నేనేం పక్కా ప్రొఫెషనల్‌ని అని అనుకోవడం లేదు. అయితే నా అభిరుచికి తగ్గట్టుగా డిజైన్లు చేయించగలుగుతున్నాను. నా బ్రాండ్‌ని అందరికీ అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నాను. ఆన్‌లైన్, ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా జరియాకు మంచి ప్లాట్‌ఫాం తీసుకురావాలని భావించాను. త్వరలో ఓ పక్కా బిల్డింగ్ నిర్మించోతున్నాం కూడా. ఇది నా కల అంటున్నారు నిషా.

“ఇప్పుడిలా ఉన్నా నేను మరింత ప్రాక్టికల్‌గా మారాల్సి ఉంది. నా ప్రాధాన్యత అంతా బ్రాండ్ లాంఛింగ్‌కే. ఒక్కోసారీ 30-40 డిజైన్లు ఉండేలా కలెక్షన్లు విడుదల చేయాలని చూస్తున్నాం. ఇన్వెస్టర్ల కోసం చూస్తున్నా... చాలామంది అనుమానిస్తున్నారు. ఇది కాటనేగా అంటారు వారు. నేను వీటి ధరలు ఎక్కువగా నిర్ణయించా. మనిషి కష్టానికి ధర నిర్ణయించడం చాలా కష్టం. పంట పొలాల నుంచి ఇప్పుడు డిజైనింగ్ వచ్చాయి ఇవి. ఒక క్లాత్‌కు విలువ కట్టడం చాలా కష్టం. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... అన్ని కాటన్లూ చీప్‌గా దొరకవు అనే”-నిషా
మైక్రోస్పిన్ కార్మికులు

మైక్రోస్పిన్ కార్మికులు


నిషా డిజైన్ చేసిన సిల్క్ కలెక్షన్స్ ఇప్పటికే దాదాపుగా అమ్ముడైపోయాయి. ఇప్పుడు కాటన్‌తో ఆమె చేస్తున్న ప్రయోగం చాలా ఖరీదైనది. “10వేల మీటర్లకు ఆర్డర్ లభిస్తుంటే... హ్యాండ్‌లూమ్స్ కోసం పది రెట్లు కష్టపడ్డంలో ఏమాత్రం అర్ధం లేదు. ఇప్పుడు పవర్‌లూమ్స్‌తో పని చేసుకోవడమే నయం” అంటారు నిషా. ఆ సెగ్మెంట్‌ని ప్రీమియం ప్రోడక్ట్స్ తయారీకి ఉపయోగించుకోవాలని అంటున్నారామె. “ఈ రెంటికీ మధ్యలో చాలా అంతరం ఉంది. చేతితో తయారు చేసిన వస్తువుల్లో చిన్న చిన్న లోపాలున్నా... వాటిపై పని చేయడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి ఫ్యాషనబుల్ హ్యాండ్‌లూమ్స్ కొనేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు”-నిషా


నేర్చుకుంటూ... నేర్పుతూ... ఎదగడంలోనే ఉంది మజా

ఒక వ్యవస్థాపకురాలిగా నిషా ఎదుర్కున్న అతి పెద్ద సవాల్ మాన్యువల్ లేబర్‌ని హ్యాండిల్ చేయగలగడం. ఆమెకు ఈ సమస్య చాలానే నేర్పింది. దీన్ని అలవర్చుకోడానికి చాలా మందికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే నిషా మాత్రం ఈ అంశాన్ని త్వరగానే ఆకళింపు చేసుకున్నారు. వారు పనికి ప్రాధాన్యం ఇవ్వరు అని నిషా చెబ్తారు. తమ సొంతూరైనా మారుమూల గ్రామంలో ఎవరైనా పుట్టారనో, ఏదైనా ఫంక్షన్ ఉందనో, పండగ పేరు చెప్పో, పూజ ఉందనో అంటుంటారు. “నా ప్రాధాన్యతలను వారు అర్ధం చేసుకోలేదు. ఇది మా జీవితం. మా ఇష్టాలు మాకుంటాయ్ అంటారని' చెప్పారు నిషా. ఆమె దగ్గర పని చేసిన మొదటి మాస్టర్ టైలర్ బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లిపోయాడు. తనకో బిడ్డ పుట్టిందని నిషాకి తెలిసేవరకూ రెండు నెలల పాటు కాంటాక్ట్ లేదు. “ తన భార్యకు, బిడ్డకు వసతులు కల్పిస్తానని చెప్పా. అయినా ఆ ఆఫర్‌ను అతను తిరస్కరించాడు. సిటికి తన కుటుంబాన్ని తీసుకొచ్చేందుకు అతను ఇష్టపడలేదు. ఇలాంటి విషయాలను నేను అర్ధం చేసుకోవాల్సి వచ్చింది. అది వాళ్ల బ్యాక్‌గ్రౌండ్, వారంతా అలాగే ఉంటారు. నాకు నచ్చినట్లుగా టీంను ఏర్పాటు చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పటికీ ఇలాంటి సమస్యలున్నాయి. అయితే లాంఛింగ్‌కు ముందు మాత్రం వారంతా బాగా కష్టపడ్డారు. అంకితభావంతో పని చేశారు.” ఎప్పుడూ వ్యవస్థాగత విభాగంలో పని చేయకపోవడం, మారుమూల గ్రామల నుంచి రావడం, చదువు లేని వారు కావడంతో... వారిలో ఇదే తరహా మనస్తత్వం ఉంటుంది. తనకు కావలసినట్లుగా వారంతా ఉండాలని కోరుకోవడం సరికాదని భావించారు నిషా. వారి అవసరాలకు తగ్గట్లుగా తానే మారాల్సి ఉంటుదనే విషయాన్ని గుర్తించారామె.

ఇతర హస్తకళల మాదరిరిగానే... ఈ రంగంలో కూడా పురుషాధిపత్యమే ఎక్కువ. “మహిళలు పని చేసేందుకు వారి భర్తలు అంగీకరించేవారు కాదు. అలాగే ఇతర మహిళలు తమతో కలిసి పని చేయడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. నేనేం చేయాలని అనకుంటున్నానో చెప్పి ఒప్పించాల్సి వచ్చేది. అయితే తాము చేస్తున్న పద్ధతికే కట్టుబడతామనేవారు. జనాలు ఇష్టపడి కొంటున్నారని చెప్పేవారు. వారిని ఆ మొండిపట్టు, మూర్ఖత్వంలోంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను. వారికంటే చిన్నదాన్ని కావడం, అందులోనూ ఆడపిల్లను కావడంతో నన్ను వారంతగా పట్టించుకునేవారు కాదు. అందుకే కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వచ్చేది. అయితే ఎక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలో, ఎక్కడ పట్టువిడుపులు ఉండాలో మెల్లగా నేర్చుకున్నాన”ని చెప్పారు నిషా.

సొంత వ్యాపారంలో అన్నిటికంటే తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం.. తన బద్ధకమేనంటూ నవ్వేశారు నిషా. “నాకు టేక్ ఇట్ ఈజీ అనే ధోరణి అలవాటు. అయితే డెడ్‌లైన్లు, క్లయింట్లు గుర్తుకొచ్చినపుడు మళ్లీ పరుగులు పెడతాను. ఇతరుల జీవితాలు మనపై ఆధారపడి ఉన్నాయని తెలిసినపుడు... ఎవరికైనా తన కోసం తాను పని చేసుకోవడం చాలా కష్టమైన విషయమం”టారు నిషా. కానీ తనకున్న ఆర్డర్ల ప్రకారం పని పూర్తి చేసేవరకూ పట్టుదల మాత్రం వదిలిపెట్టరు నిషా.