‘స్టార్టప్ క్రికెట్ లీగ్’ తో సరికొత్త శకం

‘స్టార్టప్ క్రికెట్ లీగ్’ తో  సరికొత్త శకం

Saturday December 05, 2015,

2 min Read

స్టార్టప్ క్రికెట్ లీగ్ ద్వారా భాగ్యనగర స్టార్టప్ ఈకో సిస్టమ్ లో కొత్త శకం ప్రారంభమైందని తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. స్టార్టప్ మీటప్ ఓ క్రికెట్ ఆట ద్వారా కావడం తననెంతగానో ఆకట్టు కుందని చెప్పుకొచ్చారాయన. యూసఫ్ గూడా కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన ఎస్ సి ఎల్ స్టార్టప్ క్రికెట్ లీగ్ లో 16 టీంలు పాల్గొన్నాయి. అన్ని మ్యాచ్ లు ఒకే రోజు ముగియడం విశేషం.

“ఇలాంటి ఇన్నో వేటివ్ ఐడియాలకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతిస్తుంది.” జయేష్ రంజన్
image


క్రికెట్ నేపధ్యంలో స్టార్టప్ మీటప్ జరగడం ప్రపంచంలో బహుశా ఇదే మొదటి సారి అని అభిప్రాయపడ్డారాయన. ఇది

ఇదీ నేపధ్యం

స్టార్టప్ మీటప్ కోసం ఓ ఈవెంట్ కావాలి. సాధారణ ఈవెంట్ల లాగ ఆ ఈవెంట్ ఉండకూడదు. సరికొత్త ఇన్నో వేషన్ ఉండాలని ఆలోచించాం.

“క్రికెట్ లీగ్ పెడితే ఎలా ఉంటుందని భావించా! “ సాయి కిరణ్

మెమైలాగ్ ఫౌండర్ అయిన సాయికిరణ్ స్టార్టప్ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. గతేడాది తమ సంస్థలో ఉన్న సభ్యులతో క్రికెట్ టోర్నమెంట్ ఆడారట. అలా మొదలు పెట్టిందే ఈ క్రికెట్ లీగ్. దీనికి టీ హబ్, మేరా ఈవెంట్స్,మోక్ష్, కొలాబ్ హౌస్, హెల్త్ సూత్ర, హైదరాబాద్ హ్యకర్స్, త్రీ డింగ్, విచ్ ప్లేస్, నాస్కామ్ టెన్ కె స్టార్టప్స్, సిట్రస్, హైసియా, స్పార్క్ టెన్ లాంటి సంస్థల మద్దతివ్వడంతో సక్సస్ ఫుల్ గా లీగ్ ముగిసిందన్నారు.

image


ఫౌండర్స్ ఫెవిలియన్

క్రికెట్ లీగ్ లో ఇది ప్రధానమైనది. ఇండస్ట్రీ నిపుణులు, ఫౌండర్లు, సిఈఓలు లకు ఇక్కడ స్థానం కల్పించారు. పరిశ్రమల్లో వస్తున్న మార్పులపై అభిప్రాయాలను పంచుకోడానికి ఇది వేదికగా నిలుస్తుంది. ఆంత్రప్రెన్యువర్షప్ ప్రోత్సహించడానికి వారిచ్చే సూచనలు సలహాలు కొత్తగా స్టార్టప్ మొదలు పెట్టిన వారికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.

“స్టార్టప్ క్రికెట్ లీగ్ లో చాలా కొత్త స్టార్టప్ లను చూశాను.” సుబ్బరాజు

స్టార్టప్ లీడర్షిప్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న ఆంత్రప్రెన్యువర్ సుబ్బరాజు. మొదటి స్టార్టప్ క్రికెట్ లీగ్ కు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. వచ్చే క్రికెట్ లీగ్ సరికి మరింత విస్తరించడానికి అవకాశాలు కనిపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.

image


యంగ్ ఆర్గనైజర్స్

స్టార్టప్ క్రికెట్ లీగ్ ని మెమైలాగ్ తో పాటు కొత్తగా స్టార్టప్ ఈకో సిస్టమ్ లోకి ప్రవేశించిన మరికొన్న సంస్థలు కలసి ఆర్గనైజ్ చేశాయి. ఇండస్ట్రీ నిపుణుల సాయంతోనే ఇదంతా సాధ్యపడిందని సాయికిరణ్ చెప్పుకొచ్చారు. అయితే యంగ్ ఆంథ్రప్రెన్యువర్లు ఎంతో ఉత్సాహంగా ఈ వెంట్ లో పాల్గొనడం విశేషం. విద్యార్థులు, ఇంటర్న్ బకెట్ పేరుతో స్టార్టప్ లో జాయిన్ కావాలనుకునే వారికోసం ఏర్పాటు చేసిన స్టాల్ లాంటివి ఈవెంట్ లో హైలెట్ గా నిలిచాయి. ఇన్వస్ట్ ర్స్ టాక్ లో యాంగ్ ఆంత్రప్రెన్యువర్లు పాల్గొనే అవకాశం కలిగింది. స్థానికి స్టార్టప్ కంపెనీలతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన కొన్ని కంపెనీలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి. స్టార్టప్ కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహించిన ఈ క్రికెట్ మ్యాచ్ లు ఒకే రోజు ముగియడం విశేషం.

image


భవిష్యత్ లో మరిన్ని ఈవెంట్స్

ఎస్ సి ఎల్ విజయవంత కావడంతో మరిన్ని ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తామని సాయికిరణ్ ప్రకటించారు. మొదటి సారి వచ్చిన అనూహ్య స్పందన తమలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని చెప్పుకొచ్చారు. వచ్చచే స్టార్టప్ లీగ్ కోసం దేశ వ్యాప్తంగా స్టార్టప్ లను కలుపుకుంటామని ముగించారు.