అందమైన బహుమతుల ‘ఆర్టిస్ట్ షాపీ’

అందమైన బహుమతుల ‘ఆర్టిస్ట్ షాపీ’

Wednesday April 27, 2016,

2 min Read


ఇండియాలో ఈకామర్స్ తర్వాత ఆ స్థాయిలో ఉన్న మరో రంగం గిఫ్ట్ మార్కెట్ ఒక్కటే. దీనికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైతం అతీతమైనవేం కాదు. ప్రతిరోజు గిఫ్టుల కోసం దేశంలో కోట్ల రూపాయిల ట్రాన్సాక్షన్ జరుగుతోంది. పర్సనలైడ్జ్ గిఫ్ట్ సొల్యూషన్ తో హైదరాబాద్ కేంద్రంగా ప్రాంభమైన ఆర్టిస్ట్ షాపీ నెలలో వందకు పైగా ఆర్డర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.

image


ఇది మొదలు

సోనల్ అగర్వాల్ బికాం సెకెండియర్ చదువున్న రోజుల్లో మొదలైన ఆలోచన ఇది. అప్పట్లో క్లాసులు బోర్ కొట్టినప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుని ప్రారంభించారట ఈ స్టార్టప్.

“నేను నా ఫ్రెండ్ నవనీత కలసి ఆర్టిస్ట్ షాపీ పై పనిచేయడం మొదలు పెట్టాం,” సోనల్

అయితే అప్పట్లో ఫ్యామిలీ గేదరింగ్ లాంటి అకేషన్ల ఆర్డర్లు తీసుకుని పనిచేసే వాళ్లమని అన్నారు. అలా మొదలైన ఆ ఐడియా ఇప్పుడు పూర్తిస్థాయి స్టార్టప్ గా రూపాంతరం చెందింది. ఆర్టిస్ట్ షాపీగా ఇప్పుడు హైదరాబాదీల స్పెషల్ అకేషన్స్ ని మరింత స్పెషల్ గా మారుస్తోంది.

ఆర్టిస్ట్ షాపీ పనితీరు

ఎనభై శాతం దాకా ఆర్డర్లు ఆన్ లైన్ నుంచే వస్తున్నాయని సోనల్ అంటున్నారు. ఫేస్ బుక్ లాంటి సోషల్ మెసేజింగ్ సైట్లలో బాగా ప్రమోట్ అవుతున్నామని చెప్పుకొచ్చారు. నెలకు 30నుంచి 50వేల దాకా ఆదాయం వస్తోంది. పండగలు, ఇతన ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య డబుల్ అవుతుందని అన్నారామె. ఈ ఏడాది నుంచే పూర్తి స్థాయి స్టార్టప్ గా మారిందట. వెబ్ సైట్ అందుబాటులోకి జనవరి నెలలో వచ్చింది. దీనితో పాటు పాతబట్టలను సరికొత్తగా తయారుచేసే పని కూడా చేస్తున్నారు.

image



“మీ పాత డ్రెస్ తీసుకొస్తే దాన్ని మీరు ఊహించలేనంత మోడ్రన్ గా మారుస్తాం అంటున్నారు సోనల్. సైజు, ఇతర విషయాల్లో తమ దగ్గరకు వస్తే పూర్తి మద్దతిస్తామని అంటున్నారు.

గతంలో ఆర్టిస్ట్ షాపీకి ముగ్గురు ఫౌండర్లుండే వారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. సోనల్ అగర్వాల్ దీనికి ఒక కో ఫౌండర్. బీకాం పూర్తి చేసిన సోనల్.. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తునే.. ఈ స్టార్టప్ పై పనిచేస్తున్నారు. మరో కో ఫౌండర్ నవనీత. బిటెక్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయిలో దీనిపై పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు మరో ముగ్గురు ఆర్టిస్ షాపీలో ఉద్యోగులుగా ఉన్నారు.

సవాళ్లు, పోటీదారులు

1.టీం తమకు పెద్ద సవాలని అంటున్నారు సోనల్. టీంలో టెక్నాలజీ పర్సన్ లేకపోవడం పెద్ద సమస్య అంటున్నారు. తొందరలోనే ఓ టెక్నికల్ టీం మెంబర్ ని కో ఫౌండర్ గా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు.

2.సాధారణంగా అమ్మాయిలకు ఉండే సవాళ్లు తమకి ఉన్నాయంటున్నారు. వ్యాపారం చేస్తామంటే ఇంట్లో ఒప్పుకోక పోవడం వల్ల తమ టీం లో ఒక కో ఫౌండర్ మైనస్ అయిందని అంటున్నారు. ఎంబీయే పూర్తిచేయాలని తనమీద, నవనీత మీద ఇంటి నుంచి ప్రెజర్ ఉందని చెప్తున్నారు. తాము సక్సెస్ అయి చూపించడానికి ఇది ఒక కారణమని సోనల్ చిరునవ్వులు చిందించారు.

3. సరైన కస్టమర్ల దగ్గరకి తమ ప్రాడక్టు తీసుకెళ్లడం పెద్ద సవాలని అంటున్నారు. ప్రమోషన్ ద్వారా దీన్ని అధిగమిస్తామని చెప్తున్నారు.

గ్లోబల్ మార్కెట్ నుంచి స్థానికంగా చాలా మంది గిఫ్టింగ్ రంగంలో పోటీదారులుగా ఉన్నారు. అయితే గులాబీ రేకులపై పేర్లను చెక్కడం లాంటి అరుదైన గిఫ్టులు తమ దగ్గర మాత్రమే దొరుకుతాయని సోనల్ చెప్పారు.

భవిష్యత్ ప్రణాళికలు

గిఫ్టింగ్ లో మరిన్ని ప్రాడక్టులు తీసుకురావాలి. టీంని విస్తరించాలి. ఇతర మెట్రో నగరాలకు వ్యాపించాలి. ఇవన్నీ భవిష్యత్ ప్రణాళికలు అని సోనల్ చెప్పారు.