పాత పేపర్లు, ఇనపసామాన్లు, రేకులు, డబ్బాలు కొంటామంటున్న ఆన్ లైన్ సంస్థ ది కబాడీవాలా

చెత్తకు చిరునామా ది కబాడీవాలా.కామ్‌!భోపాల్‌ కుర్రోడి కల ఫలించిన వేళచెత్త సమస్య అన్నిచోట్లా ఉన్నదేఏ చెత్త అయినా కొనుగోలుకు సిద్ధం ఐటి ఇంజనీరింగ్ చేసి ఈ వ్యాపారంలోకి

0
కబాడీవాలా ఆఫీస్, డంప్ యార్డ్
కబాడీవాలా ఆఫీస్, డంప్ యార్డ్

చెత్తను వదలించుకోవడమనేది పెద్ద సమస్య. ఇల్లు ఖాళీ చేసేటప్పుడో లేకపోతే పనికిరాని వాటిని పక్కన పెట్టాలనుకున్నప్పుడో ఈ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఆ మాటకు వస్తే ప్రతీ ఇంట్లోనూ ఏదో ఒక రోజు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నవారే. చివరకు ఆ చెత్తను బయట పారేయడమో, తీసుకెళ్లి అమ్మటమో చేయాలి. దానిని అమ్మితే డబ్బులొస్తాయని తెలిసినప్పుడు బయట పారాయ్యాలంటే మనసొప్పదు. తీసుకెళ్లి అమ్ముదామంటే ఉన్న సమయం సహకరించదు, బద్ధకం ! సరిగ్గా దీన్నే ఓ వ్యాపారావకాశంగా గుర్తించాడు అనురాగ్‌ అసాతి. ఇతను భోపాల్‌కు చెందిన ఐటీ ఇంజనీర్‌. ఆన్‌లైన్‌ ది కబాడీ వాలా. కామ్‌ వ్యవస్థాపకుడు. ఎటువంటి చెత్త అయినా సరే కొనుగోలు చేసేందుకు కబాడీ వాలా. కామ్‌ సిద్ధంగా ఉంటుంది. అసలు ఆన్‌లైన్‌లో ఈ సైట్‌ను అనురాగ్‌ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందన్న విషయమే ఆసక్తికరం.

ఒక రోజున భోపాల్‌లో తమ ఇంట్లోని న్యూస్ పేపర్లు తీసుకెళ్లమని పాతసామాన్ల వాళ్లను పిలుచుకురమ్మని ఇంట్లో వాళ్లు కోరారు. ఇది చాలా చిన్నపనే అయినప్పటికీ అందులో తెలియని కష్టం ఉందన్న విషయాన్ని అనురాగ్‌ గ్రహిం చాడు. ఈ క్రమంలో వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. చివరగా ఒక నిర్ణయానికి వచ్చిన ఫలితమే ఆన్‌లైన్‌ పోర్టల్‌ ది కబాడీ వాలా. కామ్‌. దీని ద్వారా చెత్తకు సంబంధించి తమ చిరునామా వివరాలు అందిస్తే చాలు తమ సంస్థ సభ్యుడు ఇంటి దగ్గరకు ఎప్పుడొచ్చేది చెబుతారు. తూకంలో ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితంగా ఉండేందుకుగాను ఎలక్ట్రానిక్‌ వాటిని వినియోగిస్తున్నారు. ఆయా చెత్త రకాలను అనుసరించి ధరలు చెల్లిస్తారు. ఆయా ప్రాంతాన్ని బట్టి చెత్తను కొనుగోలు చేసే ధర ఉంటుంది.  


అనురాగ్ అసాతి,ది కబాడీవాలా డాట్ కామ్ వ్యవస్థాపకుడు
అనురాగ్ అసాతి,ది కబాడీవాలా డాట్ కామ్ వ్యవస్థాపకుడు

ఇదేమీ ప్రపంచాన్ని మార్చేసేంత గొప్ప ఆలోచనేమి కాదని, ప్రజల మన్ననలు, నమ్మకం పొందడమే ప్రధానమైన వ్యాపార రహస్యమని అనురాగ్‌ అంటాడు. కళాశాలలో నా ప్రొఫెసర్‌ కవీంద్ర రఘవంశీతో కలిసి దీన్ని స్థాపించాం. ఆయన సహకారంతోనే నేను ఈ పోర్టల్‌ను నడిపిస్తున్నాను. ఆయన సలహాలు, సూచనలు మా వ్యాపారాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయి. మేమిద్దరం కలిసి ప్రారంభ పెట్టుబడులు పెట్టాము. ఆన్‌లైన్‌ కబాడీవాలాను అందరికీ తెలిసేటట్టు చేయడానికి ద్వారా ఎంతో కష్టపడ్డాం. హోర్డింగ్స్, కరపత్రాల పంపిణీ, ఫేస్‌బుక్‌లో ప్రకటనల ద్వారా ఎక్కడెక్కడి చెత్తను మా బుట్టలో వేసుకున్నాము. ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించి ఏడాదికి పై బడింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా 10,000 మంది నుంచి చెత్తను సేకరించి అమ్మామని అనురాగ్ ఎంతో విశ్వాసంతో చెప్తారు. 


చెత్తను సేకరించే పద్ధతి

- యూజర్లు ఆన్‌లైన్‌ రిక్వెస్ట్ మెసేజ్ పంపుతారు (ఇప్పుడు వాట్సాప్ కూడా సిద్ధం) 

- నిర్ణయించిన సమయానికి ఆన్‌లైన్‌ కబాడీవాలా ఉద్యోగి ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌తో అక్కడికి వెళ్లి చెత్తను తూచి, ధరల పట్టిక ప్రకారం చెల్లించాల్సిన నగదు మొత్తాన్ని ఆ వ్యక్తికి చెల్లిస్తాడు

- ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్‌ కాల్‌ వెళుతుంది

- ఆ తర్వాత చెత్తను విభజించి రీసైక్లింగ్‌కు పంపుతాము

ఒక టీమ్‌లో 8 మంది డెలివరీ బాయ్స్ ఉంటారు. వ్యాపారం వృద్ధి చెందడంలో డెలివరీ బాయ్స్ పాత్ర అంతా ఇంతా కాదని అనురాగ్‌ అంటారు. వేస్ట్ మేనేజ్‌మెంట్‌ అనేది అన్నిచోట్లా పెద్ద సమస్యే. దీని గురించి ఏదన్నా చెయ్యాలన్న నా ఆలోచనకు ఇంటర్నెట్‌ నాకు శక్తి నివ్వడమే కాదు..నేను అను కున్న దానిని అమలు పరిచేలా చేసింది. ఇంటర్నెట్‌లో ఈ తరహా కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ మా ప్రత్యేకత మాదే.౎ అని అనురాగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారం అనేది తన రక్తంలో ఉన్నదని, దీనిపై తనకు చెప్పలేనంత మక్కువ అని అనురాగ్‌ అంటారు. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా దేశానికి ఉపకరించే పనులు చేయాలన్న తపనా తనకు ఉందంటున్నారు. తాను చేస్తున్నది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇది ఒక రకమైన సేవ, ఎట్లా అంటే పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ దృక్పథం ఇందులో ఉన్నాయని అనురాగ్‌ అభిప్రాయపడ్డారు.