కరెన్సీ మార్చుకోవాలంటే క్యాష్ కుమార్‌ను అడగండి !

.కాం, .నెట్ డొమైన్స్‌కు మారడం వల్ల కంపెనీలు పొందే ప్రయోజనం ఏంటి ?ఆన్‌లైన్‌లోకి వచ్చి ఇతరులకు మార్గదర్శకులుగా ఎదిగిన కంపెనీలువాటిని ప్రోత్సహిస్తున్న వెరిసైన్(This story is a part of ”Startup Spotlight’ series where we discover inspiring early stage startup stories which have been powered by the .com/.net domains. This is a series sponsored by Verisign. YourStory exercises full editorial control over these posts.As operator of the infrastructure for .com and .net, Verisign enables the world to connect online with reliability and confidence, anytime, anywhere)

0

ధీరేన్ మఖీజా, కన్నన్ కందప్పన్, యోగేషే జోషి... వీరంతా విదేశాల్లో ప్రయాణించేప్పుడు మన రూపాయలను ఆయా దేశాల కరెన్సీగా మార్చుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. ఫారెక్స్ వెండర్లలో సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా క్లిష్టమైన పని అని వాళ్లకు బోధపడింది. మరి కొంత మంది ప్రయాణీకులతో మాట్లాడినపుడు ఇది అందరికీ ఎదురయ్యే సమస్యే అని, దీన్ని అధిగమించడం అంత తేలిక కాదని అర్ధం చేసుకున్నారు.

దీనికి ముందు ఈ ముగ్గురు... వర్తుకులు.. వినియోగదార్లను కలిపే ఓ స్పెషల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేద్దామని అనుకున్నా సాధ్యపడలేదు. 

“స్టార్టప్ చిలీ ప్రోగ్రాంలో భాగంగా ఆ దేశంలో పర్యటించినపుడు ఫారెక్స్ ఎక్స్‌ఛేంజ్ ఎంత కష్టమో అర్ధమైంది. దీనిపై లోతుగా దృష్టి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. దీనిపై ఓ కాన్సెప్ట్ డిజైన్ చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఫారెక్స్ వెండర్లను ఒక ప్లాట్‌ఫాంపైకి తేవాలని అనుకున్నామ”న్నారు ధీరేన్. అలా cashkumar.com పుట్టిందంటున్నారు ఈ సహవ్యవస్థాపకుడు.

క్యాష్‌కుమార్ వెబ్ పేజ్
క్యాష్‌కుమార్ వెబ్ పేజ్

క్యాష్ కుమార్ ఎవరు ?

“క్యాష్‌కుమార్... ఈ పేరు కన్నన్ సూచించినదే. ప్రతీ ఒక్కరికీ హత్తుకునేలా మా కంపెనీ పేరుండాలని భావించాం. క్యాష్‌.. ఈ పదం ఇక్కడ చాలా ఫేమస్. అలాగే కుమార్ అనే పేరు చాలా మందికి ఉంటుంది. ఈ పదం సుపరిచితం కూడా. అలాగే తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు కూడా. ఈ రెండిటినీ కలిపి.. క్యాష్‌కుమార్ అనే పేరు సూచించగానే... అందరం దానికి మొగ్గు చూపాం”అని చెప్పారు ధీరేన్.

“ఫారెక్స్ నిబంధనలను పూర్తిగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాం. మార్కెట్లో ఎలా ప్రవేశించాలనే అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడున్నవాటికి భిన్నంగా... ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా ఏదైనా చేయాలని భావించాం. దీనికోసం చాలా టైం వెచ్చించాం. స్నేహితుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నాం. అన్నిటికీ మించి క్యాష్‌కుమార్ పేరుకే తలొగ్గాం. ప్రజలకు ఈ కంపెనీ క్యాష్‌తో డీలింగ్ చేసేది అని తేలిగ్గా అర్ధమయ్యేదిగా ఉంటుందని భావించాం”అని చెప్పారు కన్నన్.

“ఏ అభివృద్ధి చెందుతున్న సంస్థకైనా... ఈ- ప్లాట్‌ఫాం అనువుగా ఉంటుంది. అలాగే .కాం అనేది మిగిలిన అన్నిటికంటే ఆధిపత్యం గల డొమైన్. త్వరగా అంతర్జాతీయ స్థాయికి చేరుకునేందుకు.. మా వెబ్‌సైట్ పేరుని గ్లోబల్‌గా క్యాచీ నేమ్ ఎంచుకున్నాం”అంటున్నారు కన్నన్.

పై నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో - కన్నన్, యోగేష్, మేఘ, ధీరేన్
పై నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో - కన్నన్, యోగేష్, మేఘ, ధీరేన్

క్యాష్‌కుమార్ టీం ఇదే

కన్నన్, యోగేష్ జోషిలు ఐఐటీబీ నుంచి కాలేజ్ మేట్స్. అలాగే వారిద్దరూ ఐటీ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలతో పని చేశారు. అయితే వారిద్దరికీ సొంతగా ఏదైనా ప్రారంభించాలనే యోచన ఉండేది.

“కామన్ ఫ్రెండ్స్ ద్వారా ధీరేన్ పరిచయమయ్యారు. ఐఐఎం-అహ్మదాబాద్ నుంచి మాస్టర్స్ చేసిన తర్వాత ఆయన కంపెనీ ప్రారంభించారు. అయితే వ్యక్తిగత కారణాలతో దాన్ని మూసేయాల్సి వచ్చింది. మేమంతా ఓ టీంగా ఏర్పడి పలు ఆలోచనలు చేశాం. మా సామర్ధ్యాలను, అనుభవాలను క్రోడీకరించి... వెంచర్ ప్రారంభించాలని భావించాం. చివరకు క్యాష్‌కుమార్ మమ్మల్ని సుదీర్ఘకాలంపాటు సుదూర తీరాలకు చేర్చగలదని అనుకున్నాం. మాతో మేఘా నాయక్ కూడా ఉన్నారు. ఆమె టాటా గ్రూప్‌లో ఆరేళ్లపాటు విధులు నిర్వహించారు. మార్కెటింగ్ నిపుణురాలైన ఆమె మాతో జత కట్టడంతో మా టీం శక్తివంతమైంది” అంటున్నారు యోగేష్.

ఏమిటీ క్యాష్‌కుమార్?

క్యాష్‌కుమార్ అనేది ఫారెక్స్ విక్రేతలను, కస్టమర్లను కలిపే ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం. ఇక్కడ ఫారెక్స్ లావాదేవీల విషయంలో కస్టమర్లు తమకు అనుకూలమైన వెండర్లను ఎంచుకుంటారు. అలాగే వెండర్లకు తమ కస్టమర్ బేస్‌ను పెంచుకునేందుకూ అవకాశం ఏర్పడుతుంది.

కస్టమర్ తనకు కావలసిన కరెన్సీ ఏ దేశానిది కావాలో, ఎంత కావాలో వంటి వివరాలిస్తూ ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ ఇస్తారు. అది ఆ కరెన్సీని డీల్ చేసే ఆ ప్రాంతపు వెండర్లకు షేర్ అవుతుంది. అయితే దీనికి ముందుగా కస్టమర్ తన మొబైల్ నెంబర్‌ ధృవపర్చాల్సి ఉంటుంది. తమకు అనుకూలమైన బిడ్లను కస్టమర్‌కు అందించేందుకు... రెస్పాండ్ అయ్యేందుకు ఆయా ట్రేడర్లకు 15 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఏదైనా ఒక డీల్‌ను కస్టమర్ ఫైనల్ చేసుకోగానే.. ఇద్దరి కాంటాక్ట్ డీటైల్స్ పరస్పరం అందుతాయి.

టెక్నాలజీ

“ప్రారంభంలో మా దగ్గర 8-10మంది ట్రేడర్లు ఉండేవారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నాం. PHP MVC ఫ్రేమ్‌వర్క్‌ అయిన ల్యాప్ స్టాక్ లైనోడ్‌ను అప్లికేషన్ కోసం వినియోగిస్తున్నాం. చాలా తేలిగ్గా ఉపయోగించుకోగలిగే ఇంటర్‌ఫేజ్ డిజైన్ చేశాం. యూజర్ ఇంటర్‌ఫేజ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ సిద్ధాంతాలను విశ్వసిస్తూ... వారి ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే. క్యాష్‌కుమార్‌తో వారి అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ రెండు అంశాలపై నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని కోర్సులు నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి... చాలా సింపుల్‌గా ఉండేలా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశాం. ట్రేడర్లకు ఇన్‌బాక్స్ తరహాలో బ్యాకెండ్ డిజైన్ ఉంటుంది. దీంతో వారు చాలా తేలిగ్గా రెస్పాండ్ కాగలుగుతారు. త్వరలో ట్రేడర్ల కోసం ఓ మొబైల్ యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నామన్నా”రు కన్నన్.

ట్రేడర్ సైడ్ వ్యూ
ట్రేడర్ సైడ్ వ్యూ

మార్కెట్, మార్కెటింగ్, మోడల్

“తక్కువ నిధులున్న చిన్న టీం కావడంతో... విదేశీ భాగస్వాములను నేరుగానే కలుసుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ బెంగళూరులో సక్సెస్‌ఫుల్‌గానే నడచిన తర్వాత త్వరలో ముంబై, పూనేల్లోనూ సర్వీసులు ప్రారంభించాం. ఫారెక్స్ మార్కెట్ ఎక్కువగా ఉండి... సంస్థాగత నిర్వహణ లేని దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. ఇతర ప్లాట్‌ఫాంలతో కూడా కీలక ఒప్పందాలు చేసుకున్నాం. త్వరలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తామం”టున్నారు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్న మేఘా నాయక్.


విదేశీ కరెన్సీ సంబంధిత అన్ని విభాగాలనూ వీరు పరిశీలించారు. “ వ్యక్తిగత, ఆఫీస్ సంబంధిత విదేశీ ప్రయాణాలు, ఆరోగ్యం, విద్యావసరాల కోసం ప్రయాణించేవారికి విదేశీ కరెన్సీ అవసరం. స్టూడెంట్స్, ట్రావెలర్ల విషయంలో డిమాండ్ డ్రాఫ్టులు, చెల్లింపులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మెడికల్ టూరిజాన్ని కూడా కీలక విభాగంగానే పరిగణిస్తున్నారు వీరు. పూర్తైన ప్రతీ లావాదేవీకి మొత్తం విలువపై ఆయా వెండర్లు కొంత కమీషన్ చెల్లించే పద్ధతిపై వ్యాపారం నిర్వహిస్తున్నా”మని ధీరేన్ తమ బిజినెస్ మోడల్‌ను వివరించారు.


మన దేశంలో ఇలా ఫారెక్స్ లావాదేవీల విలువ 35 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇందులో 60-65శాతం ట్రావెల్ కార్డులు, క్యాష్ రూపంలోనే జరుగుతోంది. మన దేశంలో ఈ అంశంపై ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న బుక్‌మైఫారెక్స్ మోడల్‌కు, క్యాష్‌‌కుమార్ నిర్వహిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. అయితే.. నాఫెక్స్ మాత్రం దగ్గర దగ్గరగా ఈ తరహా బిజినెస్ మోడల్ అనుసరిస్తోంది.

క్యాష్‌కుమార్‌కి ఫండింగ్

స్టార్టప్ చిలీ జెన్ 9 కార్యక్రమంలో ఈ టీం భాగస్వాములు కావడంతో.. వారికి గ్రాంట్‌గా 40వేల డాలర్లు అందాయి. తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసే వ్యక్తులను బోర్డ్‌లోకి తీసుకోవాలని చూస్తున్నారు. మార్కెటింగ్‌లో మరింతగా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది క్యాష్‌కుమార్ టీం. “సీడ్ రౌండ్ ఫండింగ్ ద్వారా బెంగళూరు తర్వాత ముంబై, పూనే నగరాలకూ సేవలు విస్తరించాం” అన్నారు ధీరేన్.

All about me, family & freinds

Related Stories