సేంద్రీయ డిటర్జెంట్, వాషింగ్ పౌడర్.. పర్యావరణహిత ఉత్పత్తులతో దూసుకుపోతున్న 'క్రయ'

పర్యావరణానికి మేలు చేయడమే ప్రధాన అజెండామనిషి ఆరోగ్యానికి పెద్ద పీటజీవనశైలిని దెబ్బతీయని ఉత్పత్తలే లక్ష్యంలక్ష్యం కోసం కార్పొరేట్ ఉద్యోగాల్ని కాదనుకున్నారుతపనతో స్టార్టప్ ను ప్రారంభించారు.

సేంద్రీయ డిటర్జెంట్, వాషింగ్ పౌడర్.. పర్యావరణహిత ఉత్పత్తులతో దూసుకుపోతున్న 'క్రయ'

Friday July 10, 2015,

4 min Read

టెక్ స్పార్క్ 2012 ఎక్స్‌పర్ట్స్ ప్యానల్ చర్చల్లో.. ఇద్దరి మధ్య నడిచిన సంవాదానికి అధిక ప్రాధాన్యం దక్కింది. గూగుల్‌కి చెందిన గౌతమ్ గాంధీ, సెకోయా క్యాపిటల్ కి చెందిన శైలేందర్ సింగ్‌ల మధ్య వ్యాపార రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సంబంధించిన వాదన అది. ఆ వాదన ఓ స్టార్టప్ బలంగా ఎదగడానికి దోహదం చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, బిజినెస్ లీడర్లు, మెంటార్లు సాధాణంగా చెప్పే అంశాలనే శైలేందర్ మరోసారి వివరించాడు. ఒక స్టార్టప్ కంపెనీ లక్ష్యం ఉన్నత స్థానాలకు చేరుకోవడమేనన్నది అతడి వాదన సారాంశం. కానీ ఆ వాదన సరికాదంటూ గౌతమ్ సవాల్ విసిరాడు. కొత్త గా వ్యాపారం ప్రారంభించే వాళ్లు అనుసరించాల్సిన ముఖ్యమైన విషయం.. వారి మనసుకు నచ్చిన పనే చేయడం, వారికి ప్రేరణ కలిగించే విషయాల మీదే దృష్టి పెట్టడం. ఏదీ ఏమైనా మార్కెట్ ను గుప్పిట బంధించడమనే ఉన్నత స్థానం ఒక ఉప ఉత్పత్తి వల్లే దక్కుతుందన్నది అతడి వాదన.

image


సహజ సిద్ధమైన సేంద్రియ పద్ధతుల్లో బట్టలు ఉతికే పౌడర్, అంట్లుతోముకునే పౌడర్‌లను తయారు చేస్తున్న క్రయ సస్టైనబుల్ గుడీస్ వ్యవస్థాపకుల్ని ఇంటర్వ్యూ చేస్తే, గౌతమ్ యొక్క తత్వం తమకు బోధపడిందని చెప్పారు.

ఈ సంస్థ వ్యవస్థాపకులైన ప్రీతి, శ్రీనిలు నగరంలో ఉండే వ్యక్తులు. నగరంలో ఉంటే వచ్చే లాభాలేంటో వాళ్లకు తెలుసు, వాటిని వాళ్లు అనుభవిస్తున్నారు కూడా. రవాణా సదుపాయాలు, వేగంగా ఎదుర్కోగలడం, వ్యాపారం ప్రజలకు చేరుకునే అవకాశం మొదలైనవి వారికి బాగా తెలుసు. అదే సమయంలో దాంట్లో ఉండే కష్టనష్టాలపై వారికి అవగాహన ఉంది. ఒకే ప్రాంతంలో జన సాంద్రత అత్యధికంగా ఉండటం వల్ల నిలకడైన జీవితం గడపడం సవాల్ గా మారిపోతోంది. ‘‘గత కొన్నేళ్ల నుంచి మన జీవితాల్లో నిలకడ సాధించడానికి అవసరమైన మార్గాలు వెతికే పని మీద ఆసక్తి చూపిస్తున్నాం’’ అంటున్నారు శ్రీని. మిగతా మంచి వ్యాపారవేత్తల్లాగే శ్రీని, ప్రీతి కూడా తాము సవాల్‌గా భావించిన అంశం మీద పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం 2010లో తమ కార్పొరేట్ ఉద్యోగాల్ని వదిలేశారు. క్రయను స్థాపించారు.

నగరవాసుల జీవితాల్లో భాగమైపోయిన రసాయనాలను తగ్గించే పనిలో క్రయ నిమగ్నమైంది. వినియోగదారుల జీవనశైలిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తి సహజసిద్ధమైన సేంద్రియ పద్ధతుల్లో తయారైన లాండ్రి డిటర్జంట్. ఇది నూరు శాతం మొక్కల నుంచి తయారైందే. సహజసిద్ధమైంది, కొన్ని ధ్రువీకరించిన సేంద్రియ ఉత్పత్తులనే దీని తయారీలో వాడతారు. మీ ఇంట్లో విష రసాయనాలతో కూడిన ఉత్పత్తుల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయి. క్రయ ఉత్పత్తుల వాడటం వల్ల మీకు ఎటువంటి హానీ జరగదు, అటు పర్యావణం పరంగానూ, మీకు వ్యక్తితంగాను జరిగే హాని సున్నా శాతం.

ఇందులో ఉన్న కిటుకు ఏంటంటే సోప్ బెర్రీస్‌గా పిలిచే కుంకుడు కాయలు. ‘‘వేల సంవత్సరాల నుంచి ఈ కుంకుడు కాయల్ని ఇండియా, చైనా, మొత్తం ఆసియా అంతటా వాడతున్నారు. ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి’’ అంటూ అసలు విషయాన్ని వివరించారు శ్రీని. ‘‘ మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్న ఉపాయమే మనకు ఇప్పుడు అక్కరకు వచ్చింది. ఒక విషయం మనకు మేలు చేస్తుందంటే, మిగతా అంతా ఆ మార్గాన్ని అనుసరించేందుకు మనతో చేతులు కలుపుతారు’’ అంటున్నారు శ్రీని.

శ్రీని, ప్రీతి - క్రయ వ్యవస్థాపకులు

శ్రీని, ప్రీతి - క్రయ వ్యవస్థాపకులు


ఆంధ్రప్రదేశ్ లో సేంద్రీయ పద్ధతిలో పండించిన వాటిని సేకరించి వాటిని చెన్నైలోని క్రయ ఆఫీసులో ప్రోసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ఈ కాయల్ని ఎండలో ఆరబెట్టి, మెత్తని పొడిగా చేసి, దానికి ఆర్గానిక్ కాల్షియం కార్బొనేట్‌ను కలుపుతారు. దీని వల్ల పౌడర్ పొడిగా ఉంటుంది. అంతే. ఈ ఉత్పత్తి చాలా నాణ్యమైంది, సహజసిద్ధమైంది, పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఉత్పత్తి.

మీరు ఒక క్రయ డిటెర్జంట్ పౌడర్ ప్యాకెట్ కొంటే ఏం పొందుతారనే దాని కంటే ఏం పొందరు అనే విషయం ఇక్కడ ముఖ్యమైంది. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులైన సర్ఫక్టెంట్స్, బ్లీచ్ ఇతర హాని కారక రసాయనాలు ఏవీ ఇందులో ఉండవు. మిగతా అన్ని డిటర్జెంట్లలో ఇవి పెద్ద మొత్తంలో ఉంటాయి. ‘‘ఈ (పెట్రోలియం బేస్డ్) డిటర్జంట్లు విషరసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి నీటిలో చేరి నీటి కాలుష్యానికి కారణమవుతాయి. అంతే కాదు, బట్టల మీద, శరీరం మీద హానికారక రసాయనాలు చేరతాయి.’’ అని శ్రీనిధి చెబుతున్నారు. మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్రయ ను ఉపయోగిస్తే మీరు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాదు, ఈ ప్రక్రియలో మీకు మీరు హాని చేసుకోకుండా కాపాడుకుంటున్నటే. మీరు క్రయను ఉపయోగిస్తే మీ దుస్తులు పరిశుభ్రంగా, తాజాగా ఉంటాయి. మిగిలిన అవశేషాలను మీ గార్డెన్ లో ఒంపేయండి. కాటన్ సంచిని మాత్రం తర్వాత బ్యాచ్‌ను వాడుకోవడం కోసం ఆరబెట్టండి.

మొదట బట్టలు ఉతికే పౌడర్ మీద దృష్టి పెట్టిన క్రయ ఆ తర్వాత ఇతర కిచెన్ ఉత్పత్తుల మీద కూడా పరిశోధనలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే సేంద్రియ పద్ధతితో తయారు చేసిన అంట్లు తోముకునే పౌడర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

అంతేకాదు, కేశ సంరక్షణకు సంబంధించి ఉత్పత్తులు కూడా హెర్బల్, ఆర్గానిక్ విధానాల్లో తయారు చేస్తున్నారు. క్రయ జెస్టి హెయిర్ వాష్, క్రయ జెస్టి హెయిర్ వాష్ , కండిషనర్లను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రయ తమ పరిశోధనల పరిధి మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. సాధారణ గృహ అవసరాలకు వాడే వాటి నుంచి హానికారక రసాయనాలను పూర్తిగా తొలగించాలన్నదే క్రయ లక్ష్యం. ‘‘ మా ఉత్పత్తులను ఉపయోగించే వారు పూర్తిగా సంతోషంగా ఉండాలి, ఇతర అనుబంధ ఉత్పత్తుల కోసం కూడా అడగాలి ’’. ఇదే మా లక్ష్యం అంటున్నారు శ్రీని. ముందు ముందు తాము ఉత్పత్తి చేయాలనుకుంటున్న వస్తువులు మరింత సంక్లిషతతో కూడుకున్నవని చెబుతున్నారు.

వ్యాపారపరమైన మెలకువలు తెలియజేసే స్కూళ్లకు ఈ కథ నిజంగానే ఎంత వరకు పనిచేస్తుంది?, అభివృద్ధి శిఖరాలను చేరడమా లేక మనసుకి నచ్చిన పని చేయడమా? అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? శ్రీని కంపెనీ లక్ష్యం గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించినప్పుడు అతడు చెప్పేది ఒక్కటే. నిధుల సేకరణ అనేది తన మనసులోనే లేదంటాడు.

పర్యావరణ హితమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి, మరింత మెరుగైన జీవశైలికి తోడ్పడాలన్న తపనతోనే క్రయ స్థాపించారు. చాలా మంది వ్యాపారవేత్తలకు ఉండాల్సింది ఈ తపనే నంటారు శ్రీనిధి. ‘‘ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలంటున్నారు ఆయన. ‘‘ ఎటువంటి ఆర్థికపరమైన లాభాలు ఆశించకుండా మూడు నుంచి ఐదేళ్ల పాటు ఈ వ్యాపారాన్ని మీరు చేయగలరా?’’ అని అడుగుతున్నారు.

ఈ తపనతో పని చేసేవారికి, ఆర్ధికపరమైన లాభాలు, ఉన్నతమైన స్థానాల కోసం పని చేసేవారికి ఉన్న ప్రధానమైన తేడా ఇదే. ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగుతున్న వారికి శ్రీని ఒక ప్రశ్న వేస్తున్నారు, ‘‘నిధల కోసమో, ఐపిఓ పొందడం కోసమో మీరు ఇంపెనీని ఏర్పాటు చేస్తున్నారా లేక మీ పిల్లలకు ఈ కంపెనీని అప్పజెప్పాలనుకుంటున్నారా?’’ అని. దీనికి సమాధానం రెండవ వాక్యంలోనే లభిస్తుందని ఆయన అంటున్నారు. స్వయంగా పెట్టుబడులు పెడుతూ తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ కంపెనీని తమ కుటుంబానికే పరిమితం చేశారు శ్రీని. శ్రీనీ, ప్రీతీల నమ్మకం ఏంటంటే తమ పాప కూడా ఇటువంటి తపనతోనే క్రయను అభివృద్ధి చేస్తుందని.

website