భారత స్టాక్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేస్తామంటున్న RKSV రథసారథులు

భారత స్టాక్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేస్తామంటున్న  RKSV రథసారథులు

Wednesday May 06, 2015,

2 min Read

‘‘కేవలం రెండుశాతం మంది భారతీయులు మాత్రమే స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారు. అదీ మ్యూచువల్ ఫండ్స్‌తో కలిపి. ఇది చాలా వింతైన విషయం’’ అంటారు ఆర్కేఎస్వీ సహ వ్యవస్థాపకులు రఘు కుమార్. అమెరికాలో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ట్రేడ్ చేసే వారిశాతం 40 శాతం వరకు వుంటుంది. రఘు, ఆయన సోదరుడు రవికుమార్ దీన్ని ఓ పెద్ద అవకాశంగా గుర్తించారు. ఇంటర్నెట్ , టెక్నాలజీ అభివృద్ధి లో దూసుకుపోతున్న మన భారతీయులు అమెరికా స్టాక్ మార్కెట్ విధానాలను దిక్సూచిగా తీసుకోవాల్సిన అవసరముందనేది వారి భావన. ఈ దిశగా ఆలోచించాక రఘు, రవికుమార్ సోదరులు మరో సాంకేతిక నిపుణుడు శ్రీనివాస్ విశ్వనాథ్‌తో జతకట్టారు. ఈ బృందం ఆర్కేఎస్వీ(RKSV) సంస్థకు రూపకల్పన చేసింది. ఇది భారతీయులకు స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది.

శ్రీనివాస్ విశ్వనాథ్, రవికుమార్ మరియు రఘుకుమార్

శ్రీనివాస్ విశ్వనాథ్, రవికుమార్ మరియు రఘుకుమార్


ఆర్కేఎస్వీ (RKSV) ప్రస్థానం

ఆర్థిక, సాంకేతిక అంశాలపై నైపుణ్యమున్న ఆర్కేఎస్వీ వ్యవస్థాపకులు భిన్న ప్రాంతాలకు చెందిన వారు. 2006 సంవత్సరంలో అమెరికాలోని ఇల్లినాయ్ నగర ప్రచార కార్యక్రమంలో బీమా గణాంక సమాచార విభాగాన ఆర్థిక రంగ నిపుణుడిగా రఘు సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించారు. ఈయన పెద్దన్నయ్య రవికుమార్ కూడా చాలామంది ట్రేడింగ్‌తో సంబంధమున్న సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసిన అనుభవముంది. అన్నదమ్ములిద్దరి ఆలోచనలు కలిశాయి. పరిమితమైన నిధులతో చిన్న సంస్థను స్థాపించారు. కానీ 2008 లో వచ్చిన ఆర్థిక మాంద్యం వారి పెట్టుబడులను కర్పూరంలా హరించేసింది.


ఆర్కేఎస్వీని స్థాపించక ముందు వాళ్లు వ్యాపార విస్తరణ, యాజమాన్య పారిశ్రామిక విధానం ఇలా పలు రంగాల్లో పనిచేసి అనుభవాన్ని సాధించారు. ఎన్నో అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. యాజమాన్య వ్యాపారంలో ఒక సంస్థ స్టాక్స్, బాండ్స్, కరెన్సీ, ఉత్పత్తులు వాటి అనుబంధ వస్తువుల ద్వారా ఖాతాదారులతో సంబంధంలేని సొంత సంస్థాగత లాభాలను ఎలా ఆర్జించాలనేదానిపై పరిశీలించారు. అలా ఈ ముగ్గురు నిపుణులు అమెరికాలో పనుల్ని పూర్తి చేసుకుని తమ కార్యకలాపాల్ని ఇండియాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆర్కేఎస్వీ పేరుతో యాజమాన్య విధాన వాణిజ్య సంస్థను స్థాపించారు. మూడేళ్ల తర్వాత 2012 జనవరిలో రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి దళారీ వ్యవస్థను బద్దలుకొట్టే సాహసం చేశారు. ఆన్ లైన్ విధానం ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయడంతో దళారీ వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. ప్రత్యక్ష వాణిజ్య విధానానికి ఊపిరిలూదినట్లయ్యింది.

rksv web page

rksv web page


ఆన్ లైన్ ట్రేడింగ్ :

ఏ ప్రారంభ కంపెనీ అయినా ఎదగడానికి, ఓ స్థాయికి రావడానికి సమయం, ఆర్థిక వెన్నుదన్ను అవసరం. కానీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఆర్కేఎస్వీ 25 వేలకు పైగా ఖాతాదారులను పెంచుకోగలిగింది. స్టాక్ ట్రేడింగ్ లో ప్రతి రోజూ5 వేల కోట్ల రూపాయల లావాదేవీలను చేయగలుగుతోందని సగర్వంగా చెబుతున్నారు సహ స్థాపకులు రఘు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా (NSE), బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), మర్చెంట్ కస్టమర్ ఎక్సేంజ్(MCX) లో సభ్యత్వాలను కలిగివుంది. షేర్ ఖాన్ లాంటి అతిపెద్ద కంపెనీలకు పోటీ ఇస్తోంది ఆర్.కే.ఎస్.వీ. కేవలం 80 మంది బృందంతో ముంబై కేంద్రంగా ఆన్ లైన్ ట్రేడింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. జీరోధా కూడా ఆన్ లైన్ లో సంతృప్తికరమైన ప్రగతిని కనబరిచింది.

ఆన్ లైన్ ట్రేడింగ్ బ్రోకర్లకు కొన్ని ఇబ్బందులు:

1. ఖాతాదారుడికి ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అవగాహన, శిక్షణనివ్వడం

2. వాడుకదారులకు నమ్మకాన్ని పెంపొందించి , ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం

3. కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలతో వినియోగదారులను ఆకర్షించడం

మదుపుదారులకు అత్యంత దగ్గరగా.. వారికి సన్నిహితానుబంధంతో వుంటూ ఇంకోదశలో పురోగతిని కాంక్షిస్తోంది ఆర్కేఎస్వీ( RKSV) . సుధృఢ‌మైన సాంకేతిక సిబ్బంది, విలువైన అనుభవాలు, ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనలతో పలువురి ప్రశంసలను అందుకుంటూ .. రానున్న కాలంలో ఇన్వెస్టర్లకు మరింత ఉజ్వల భవిష్యత్ ను అందించేందుకు ముందడుగు వేస్తోంది ఆర్కేఎస్వీ.