చిన్నారులకు అద్భుతమైన కథలు చెప్పే ప్రథమ్ బుక్స్

చిన్నారులకు అద్భుతమైన కథలు చెప్పే ప్రథమ్ బుక్స్

Saturday April 30, 2016,

3 min Read


ఒకప్పుడు పిల్లలను నిద్రపుచ్చడానికి నానమ్మలు, తాతయ్యలు కథలు చెప్పేవారు. ఊ కొడుతూ చిన్నారులు నిద్రలోకి జారుకునేవారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వారికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం పెరుగుతుంది. చాలా పదాలకు అర్థాలు తెలిసి భాషపై పట్టు వస్తుంది. మానసిక వృద్ధి సాధిస్తారు. కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో కథలు చెప్పేవారే కరువయ్యారు. ఆ లోటు తీరుస్తోంది ప్రథమ్ బుక్స్ కు చెందిన స్టోరీ వీవర్. 

దేశంలోని పిల్లలకు ముఖ్యంగా మూడు సమస్యలున్నాయి. ఒకటి వారికి సరైన పుస్తకాలు అందుబాటులో లేవు. రెండు.. సొంత భాషలో బుక్స్ లేవు. మూడోది వారికికావాల్సిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. 22 అధికార భాషలు, వందలాది ప్రాంతీయ భాషలున్న ఈ దేశంలో బుక్స్ పబ్లిష్ చేయడం నిజంగా సవాల్ తో కూడినదే.

తొలి అడుగులు

ప్రథమ్ బుక్స్ సంస్థ 2004లో ఏర్పడింది. ప్రతి చిన్నారి చేతిలో పుస్తకం ఉండాలన్న లక్ష్యంతో లాభాపేక్షలేకుండా ఏర్పాటైన సంస్థ ఇది. సరసమైన ధరలకే నాణ్యమైన పుస్తకాలను పిల్లలకోసం రూపొందిస్తోంది. అంతేకాదు స్టోరీ వీవర్ పేరుతో ఆన్ లైన్లోకి కూడా వచ్చేసింది.

బాల బాలికలలకు ఆన్ లైన్లో కథలు చెప్తోంది స్టోరీ వీవర్ సంస్థ. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. 35 భాషల్లో 15 వందల కథలను పెట్టింది. స్టోరీలను చదువుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఒక భాషలోని స్టోరీని మరో భాషలోకి కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఇందులో 2వేల 5 వందల ఫొటోలతో ఒక ఇమేజ్ బ్యాంక్ కూడా ఉంది.

స్థానికంగా దొరికే కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ చాలా ఉంది. వివిధ భాషల్లో కథలు, సాహిత్యం చదవడానికి ఎలాంటి అడ్డుగోడలను పెట్టలేదు. కంటెంట్ అంతా ఫ్రీగా చదువుకోవచ్చు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు.

గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ 2013లో మల్టీలింగ్వల్ చిల్డ్రన్ కంటెట్ విభాగంలో ప్రథమ్ బుక్స్ మొదటి బహుమతి పొందింది. స్టోరీ వీవర్ ను 2015 సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డే నాడు ప్రారంభించారు.

స్టోరీ వీవర్ ఎలా పనిచేస్తుంది?

రచయితలు, ట్రాన్స్ లేటర్స్ లాంటి కంటెంట్ క్రియేటర్స్ పిల్లల, తల్లిదండ్రులు, కంటెంట్ యూజర్స్ మధ్య వారధిలా పనిచేస్తోంది స్టోరీ వీవర్.

ఆన్ లైన్ లో పెట్టే కంటెంట్ క్రియేషన్ ను ఆన్ లైన్, ఆఫ్ లైన్లో చదువుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్స్ స్టోరీ వీవర్ నుంచి కథలను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. విద్యార్థులకు బోధిస్తున్నారు.

గొప్ప ఆలోచన

గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలను సైతం దృష్టిలో పెట్టుకుని స్టోరీవీవర్ ను డిజైన్ చేశారు. మొబైల్ ఫోన్లలో సైతం చదువుకోవచ్చు. సరళమైన అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీని ఉపయోగించారు. డాటా వినియోగం తగ్గించడానికి వివిధ రిజల్యూషన్స్ లో స్టోరీస్ , పిక్స్ పెట్టారు. అందుకే తమ వెబ్ సైట్ ను అందరూ ఇష్టపడుతున్నారని యాజమాన్యం చెబుతోంది.

మైనార్టీ భాషల్లోనూ

స్టోరీ వీవర్ కంటెంట్ యూనీకోడ్ లో ఉంది. ఖమేర్, కురుఖ్, మండారి, సాండ్రి లాంటి గిరిజన భాషల్లోనూ స్టోరీ వీవర్ ఉంది. కొంతమంది యూజర్స్ అతి తక్కవగా మాట్లాడే భాషల్లోనూ స్టోరీలు పోస్ట్ చేస్తున్నారు.

ఆరు వందల స్టోరీల్లో దాదాపు మూడు వందల స్టోరీలను గత ఆర్నెలల్లోనే రాశారు. వాటిని 24 భాషల్లోకి తర్జుమా చేశారు.చాలా మంది యూజర్స్ అత్యంత ఉత్సాహంతో తమ స్టోరీలను అప్ లోడ్ చేస్తున్నారు. తెలుగు, సంస్కతం, మళయాలంల్లోకి ఎక్కువగా స్టోరీలు ట్రాన్స్ లేట్ అవుతున్నాయి. త్వరలో సంతాలి, ఫార్సి, కురుక్, కొరియన్, వెల్ష్, జపనీస్ , నార్వేజియన్, బర్మీస్ భాషల్లోనూ స్టోరీ వీవర్స్ అందుబాటులోకి రానుంది. మంచి ట్రాన్స్ లేటర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందీ వెబ్ సైట్.

image


పబ్లిక్ లో క్వాలిటీ కంటెంట్

స్టోరీ వీవర్ టార్గెట్ ఆడియన్స్ చిన్నారులే. స్కూల్ పిల్లల కోసమే స్టోరీలు పెడుతున్నాయి. పెద్దవారుకూడా వాటిని చదువుతున్నారు. యూజర్స్ పెట్టిన స్టోరీస్ వారే చూసి బాగుంటే వెంటనే పబ్లిష్ చేసేస్తారు. అదే వారి సక్సెస్ సీక్రెట్. 

స్టోరీలు చదివిన పిల్లలు వాటికి రేటింగ్స్ కూడా ఇవ్వొచ్చు. దీనివల్ల క్వాలిటీ కూడా పెరుగుతుంది. చిన్నారులు కథలు రాస్తే వాటికి మరింత ప్రాధాన్యతనిచ్చి మెరుగులు దిద్ది పబ్లిష్ చేస్తారు. వివిధ భాషల్లో ఎడిటర్స్, ట్రాన్స్ లేటర్స్ ను పూర్తిస్థాయిలో నియమించుకుంటున్నారు.

ప్రథమ్ సంస్థకు ఒరాకిల్ కంపెనీ కొంత ఆర్థిక సాయం చేసింది. రెండు వందల స్టెల్ డిజిటల్ టెక్నాలజీ బుక్స్ తయారుచేసి ఇచ్చింది. పిల్లలకు సమాచారం ఇవ్వడం, విద్యను అందించడానికి మంచి గుర్తింపు వచ్చింది. పిల్లల్లో చదువుపై ఆసక్తిని రగులుస్తోంది. అప్పుడప్పుడు పాపులర్ రైటర్స్ ను గెస్ట్ ఎడిటర్లుగా తెస్తోంది స్టోరీవీవర్. రూపా పై, బిజాల్, పాయల్ ధర్, విద్యామణి తదితరులు ఎడిట్ చేస్తుంటారు.

ప్రచారం

స్టోరీవీవర్ సైట్ కు ప్రథమ్ బుక్స్ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. వీవ్ ఎ స్టోరీ అంటూ పలు నగరాల్లో ప్రదర్శనలు చేపట్టింది. బాగా పాపులరైన ఎనిమిది బాలల కథలను 113 భాషల్లోకి అనువదించారు. వాటిలో 91 భారతీయ భాషలే. మండారి, సాండ్రి, కొంకణి, ఖమేర్, పోర్చ్ గీస్ భాషల్లోనూ ప్రచురణలు వెలువడుతున్నాయి. కథలు చెప్పడంలో పిల్లల మధ్య పోటీలను సైతం నిర్వహిస్తోంది.