ప్ర‌యాణంలో ప‌సందైన భోజ‌నానికి కేరాఫ్ 'యాత్రా చెఫ్‌'

ట్రైన్ జ‌ర్నీలో టేస్టీ ఫుడ్ అందిస్తున్న యాత్రచెఫ్‌దేశ‌వ్యాప్తంగా యాత్ర‌చెఫ్ సేవ‌లుఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే కోరుకున్న చోట‌, కోరుకున్న రెస్టారెంట్ల నుంచి భోజ‌నంఅనారోగ్య భోజ‌న స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పిన యాత్ర చెఫ్‌

ప్ర‌యాణంలో ప‌సందైన భోజ‌నానికి కేరాఫ్ 'యాత్రా చెఫ్‌'

Tuesday June 23, 2015,

4 min Read

రైల్ జ‌ర్నీ అంటే ఎవ‌రికి ఇష్ట‌ముండ‌దు చెప్పండి.. మ‌న‌సుకు న‌చ్చిన స్నేహితులు.. అంద‌మైన ప్ర‌దేశాల‌కు ట్రైన్‌లో వెళుతుంటే ఆ ఆనంద‌మే వేరు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని కిటికీలోంచి చూస్తూ స్నేహితుల‌తో స‌ర‌దాగా క‌బుర్లు చెప్తుంటే మ‌న‌సు పుల‌క‌రించిపోతుంది. ట్రైన్ జ‌ర్నీలో ఒక్క విష‌యంలో మాత్రం తీవ్రంగా ఆందోళ‌న క‌లిగిస్తుంది. అదే భోజ‌నం. ట్రైన్‌లో ల‌భించే భోజ‌నం ఏ మాత్రం నాణ్య‌మైన‌ది కాదు. దీంతో ప్ర‌యాణికులంతా ఆందోళ‌న చెందుతుంటారు. ట్రైన్లు, రైల్వే స్టేషన్లలో తీసుకునే ఆహారంతో ప్ర‌యాణికుల పొట్టలో గడబిడ ఖాయం. ఆయిలీ స‌మోసా, వెజిటెబుల్ ప‌లావ్‌, ఎగ్ ప‌ఫ్స్ సీటు వ‌ద్ద‌కే తీసుకొస్తే నోరూరనిదెవ‌రికి. ఐతే అవి నాణ‌మ్యైన‌వి కావ‌క‌పోవ‌డంతో ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య త‌లెత్తుతుంది. కానీ ఈ బాధ‌లు ఇకపై ఉండ‌బోవు. ఎందుకంటే యాత్రా చెఫ్ వ‌చ్చేసింది. మ‌న‌కు న‌చ్చిన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తెచ్చిపెడుతుంది యాత్ర చెఫ్. రైల్వే ప్ర‌యాణికుల కోసం ఆన్‌లైన్ల‌లో ఆర్డ‌ర్ తీసుకుని, ప్ర‌యాణికులు ప్ర‌యాణించే మార్గంలో అంద‌జేస్తుంది.

అనుకోకుండా ఓ రోజు..

యాత్ర చెఫ్ సీఈవో, కో ఫౌండ‌ర్ అరున్ రాజ‌న్‌కు నిజ జీవితంలో ఎదురైన స‌మ‌స్యే ఈ స్టార్ట‌ప్ ఏర్పాటుకు కార‌ణ‌ం. 2013లో అరుణ్ జ‌ర్నీ చేస్తుండ‌గా ఫుడ్ పాయిజ‌నింగ్ అయింది. ఆస్ట్రేలియాలో ఈ-కామ‌ర్స్ కంపెనీలో ప‌నిచేసే అరుణ్ హాలిడేస్ కోసం ఇండియా వ‌చ్చారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను గోవాలో ఎంజాయ్ చేశారు. ఆ త‌ర్వాత గోవా నుంచి ముంబైకి ట్రైన్‌లో వెళుతున్న స‌మ‌యంలో త‌న సీటు వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆహార ప‌దార్థాల‌ను చూసి టెంప్ట‌య్యారు. ఏది న‌చ్చితే అది కొనుక్కుని తినేశారు. దీంతో ఫుడ్‌ పాయిజ‌నింగ్ అయింది. దీంతో క‌నెక్టింగ్ ట్రైన్ ప‌ట్టుకుని సొంత ప‌ట్ట‌ణం కోచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డారు అరుణ్‌. త‌ను అనుభ‌వాల‌ను మిత్రుడు ర‌మీజ్ అష్ర‌ఫ్‌తో పంచుకున్నారు. త‌న‌లాగే స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ భార‌తీయ‌ రైల్వే ప్ర‌యాణికుల‌ను కాపాడేందుకు ఏం చేస్తే బాగుంటుంద‌ని ఆలోచించారు. ఆ త‌ర్వాత యాత్ర చెఫ్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. అరుణ్ త‌న ఉద్యోగాన్ని వ‌దిలి ర‌మీజ్‌తో క‌లిసి సంస్థ‌ను ప్రారంభించారు. 2013 ఫిబ్ర‌వ‌రి నుంచి ప్ర‌య‌త్నాలు సాగించ‌గా, అక్టోబ‌ర్ వ‌ర‌కు ఆన్‌లైన్ పైల‌ట్ వ‌ర్కే కొన‌సాగింది. ట్రైన్‌లో త‌న‌కు ఎదురైన ఆ ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుని అరుణ్ ఇప్ప‌టికీ న‌వ్వుకుంటుంటారు.


యాత్ర చెఫ్ ఫౌండ‌ర్స్ అరుణ్ రాజ‌న్‌, ర‌మీజ్ అష్ర‌ఫ్‌

యాత్ర చెఫ్ ఫౌండ‌ర్స్ అరుణ్ రాజ‌న్‌, ర‌మీజ్ అష్ర‌ఫ్‌


ఆర్డ‌ర్ చేయ‌డం ఎలా ?

ప్ర‌యాణికులు మొద‌ట‌గా యాత్ర చెఫ్ సైట్‌లోకి ఎంట‌రై త‌మ ప్ర‌యాణ వివ‌రాల‌ను తెలియ‌జేయాలి. ఆ మార్గంలో ఉన్న రెస్టారెంట్ల వివ‌రాల‌ను తెలుసుకుని, అందులో ఒక దాన్ని ఎంచుకోవాలి. మీరు కోరుకున్న ప్రాంతంలో స్థానిక రెస్టారెంట్లు, కేట‌ర‌ర్ల నుంచి మీకు ఆహారాన్ని అంద‌జేస్తారు యాత్ర చెఫ్ సిబ్బంది. ఆర్డ‌ర్ చేసేందుకు మ‌ల్టి లింగ్వ‌ల్ హెల్ప్‌లైన్‌ నంబ‌ర్లు కూడా ఉన్నాయి.

"రైలు ప్ర‌యాణ స‌మ‌యంలో కూర్చున్న సీటు వ‌ద్ద‌కే కోరుకున్న రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని అందించాల‌న్న ఐడియా బాగా క్లిక్ అయ్యింది. ప్ర‌యాణికులు వారికి న‌చ్చిన రెస్టారెంట్ల నుంచి కోరుకున్న ఆహారాన్ని తెప్పించుకునే అవ‌కాశం ఉంది. అది కూడా వారు కోరుకున్న స‌మ‌యంలో. అంత‌కుమించి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ తలెత్త‌వు. భోజ‌న ప్రియుడిగా నాకున్న అనుభ‌వం ఏంటంటే.. ఇండియాలో రుచిక‌ర‌మైన, స్థానికంగా ప్ర‌త్యేక‌త సంపాదించిన ప‌దార్థాలు ప్ర‌తి స్టేష‌న్‌లోనూ దొరుకుతాయి. త‌మ జ‌ర్నీ స‌మ‌యంలో ప్ర‌యాణికులు వాటిని రుచి చూస్తే అంత‌క‌న్నా అంద‌మైన ప్ర‌యాణం మ‌రొక‌టి ఉండ‌దు" అంటారు అరుణ్‌.

రెస్టారెంట్ల గురించి పూర్తి స‌మాచారం

ట్రైన్‌లో త‌న‌కు ఎదురైన అనుభ‌వం మ‌రెవ్వ‌రికి ఎదురుకాకుడ‌ద‌న్న ఉద్దేశంతో భోజ‌నం స‌ర‌ఫ‌రా విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు అరుణ్‌. ప్ర‌యాణికులు తాము ఆర్డ‌ర్ చేసే భోజ‌నం గురించి పూర్తిగా స‌మాచార‌మిస్తారు. తాము ఆర్డ‌ర్ చేయ‌బోయే రెస్టారెంట్ ఎలాంటిదో, తినాల‌నుకుంటున్న ప‌దార్థాల్లో ఏమేం క‌లుస్తాయో వివ‌రాలు అందిస్తారు. రెస్టారెంట్ గురించి ఆన్‌లైన్‌లో చెక్ కూడా చేసుకోవ‌చ్చు. "ప్ర‌తి అంశంలోనూ పార‌ద‌ర్శ‌కంగా ఉంటాం. ప‌దార్థాలు, రెస్టారెంట్ల ఎంపిక‌, డ‌బ్బులు. ఇలా అన్ని విష‌యాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. మా యాత్ర చెఫ్ నుంచి అందుతున్న మ‌రో మంచి సౌక‌ర్య‌మేమిటంటే మాది హైలీ ఇంటెలిజెంట్ ఆర్డ‌రింగ్ ప్లాట్‌ఫామ్‌. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌.. ట్రైన్ ఏ స‌మ‌యంలో ఎక్క‌డ ఉంటుందో ముందే తెలుసుకుని మెనూను సిద్ధం చేస్తాం. అందువ‌ల్ల ప్ర‌యాణికులు త‌మ ఆర్డ‌ర్ల‌ను క్యాన్సిల్ చేసుకునే అవ‌కాశాలు అంత‌గా ఉండ‌వు. అందువ‌ల్లే మా స‌క్సెస్ రేట్ 97%నికి పైగా ఉందని అరుణ్ వివ‌రించారు. యాత్ర చెఫ్‌ లాజిస్టిక్స్‌, ఆప‌రేష‌న్ స‌బ్‌డొమైన్‌లో సేవ‌లు పేల‌వంగా ఉన్న‌ప్ప‌టికీ, అరుణ్ టెక్నాల‌జీ, లాజిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ప‌డేలా చేసింది. కానీ ఏ సంస్థ‌కైనా స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. స‌రైన ప్ర‌ణాలిక లేకుంటే ఏదీ స‌రిగా సిద్ధం చేయ‌లేరు.

వెబ్ స్క్రీన్ షాట్

వెబ్ స్క్రీన్ షాట్


మొద‌ట్లో వారు మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు..

  • 1. మంచి రెస్టారెంట్లు యాత్ర చెఫ్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. వారి రెవెన్యూ మోడ‌ల్‌కు అంగీక‌రించ‌లేదు. "సంస్థ‌ను ప్రారంభించిన స‌మ‌యంలో ప్ర‌తి న‌గ‌రంలో ప్ర‌తి రెస్టారెంట్ య‌జ‌మానిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి, క‌లిసి ప‌నిచేసేందుకు ఒప్పించేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది" అని అరుణ్ వివ‌రిస్తారు.
  • 2. భాష‌. ఆరంభంలో లాంగ్వేజ్ పెద్ద స‌మ‌స్య‌గా ఉండేది. క‌స్ట‌మ‌ర్ల‌ను, క్ల‌యింట్ల‌ను క‌మ్యునికేట్ చేయ‌డం స‌మ‌స్య‌గా ఉండేది. బ‌హు భాష‌ల హెల్ప్‌లైన్ ఉన్న‌ప్ప‌టికీ ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. ఉదాహ‌ర‌ణ‌కు కేర‌ళ‌లో వివిధ భాష‌లు మాట్లాడేవారిని వెతికిప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉండేది. కానీ నెమ్మ‌దిగా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాం" అని అరుణ్ చెప్పారు.
  • 3. స‌రైన వ్య‌క్తుల‌ను ఎంపిక‌చేసుకోవ‌డం స‌వాలుగా మారింది. "మాది స్టార్ట‌ప్ కంపెనీ అని తెలిసిన త‌ర్వాత మేం ఎంపిక చేసిన క్యాండిడేట్లు మా ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించేవారు. కానీ మా తొలి టీమ్ మెంబ‌ర్ సుచిత్ర ఎంత‌గానో హెల్ప్ చేశారు. అలాగే ర‌మీజ్ నెట్‌వ‌ర్క్‌, ఎన‌ర్జీల కార‌ణంగానే సంస్థ నిల‌బ‌డ‌గ‌లిగింది" అని అరుణ్ తెలిపారు.

ద‌క్షిణాదిలో ఆరంభం..

యాత్రాచెఫ్‌ను రూ. 15 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఇద్ద‌రు యువ‌కులు స్థాపించారు. ఆరంభంలో కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్ణాట‌క వంటి ద‌క్షిణాది రాష్ట్రాల‌కే త‌మ సేవ‌ల‌ను ప‌రిమితం చేశారు. డిమాండ్ పెరిగిపోవ‌డంతో నార్త్ ఇండియాకు కూడా త‌మ సేవ‌ల‌ను విస్త‌రించారు. "ఇప్పుడు 1500కు పైగా సంద‌ర్శ‌కులు మా సైట్‌ను సంద‌ర్శిస్తున్నారు. ప్ర‌తి రోజు 300-400 వ‌ర‌కు ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి. ఒక్క‌సారి మా సేవ‌ల‌ను ఉప‌యోగించుకున్న క‌స్ట‌మ‌ర్లు త‌మ త‌ర్వాతీ జ‌ర్నీల్లోనూ మ‌మ్మ‌ల్నేసంప్ర‌దిస్తున్నారు. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది" అని అరుణ్ సంతోషంగా చెప్తారు.

అవ‌కాశాలు పుష్క‌లం

భార‌త రైల్వే డిపార్ట్‌మెంట్ చాలా పెద్ద‌ది. ప్ర‌తి ఏటా 8 కోట్ల మంది ప్ర‌యాణికుల‌ను గ‌మ్యం చేరుస్తుంటుంది. ప్ర‌తిరోజూ నాలుగున్న‌ర‌ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు త‌మ టికెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకుంటుంటారు. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఈ రంగంలో ఏ సంస్థ అయినా స‌క్సెస్ అవ‌డానికి అవ‌కాశ‌ముంటుంద‌ని అరుణ్ చెప్తారు. క‌స్ట‌మ‌ర్లు ఎంపిక‌చేసుకునేందుకు మ‌రిన్ని అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో మ‌రింత మంది ఆహార స‌ర‌ఫ‌రాదారుల‌తో ఒప్పందం చేసుకోవాల‌ని యాత్ర చెఫ్ భావిస్తుంది.

మార్కెట్‌లో ఉన్న విస్తృత అవ‌కాశ‌ల దృష్ట్యా త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించాల‌నుకుంటున్నామ‌ని అరుణ్ అన్నారు. యాత్ర చెఫ్ ఏర్పాటు అరుణ్ వ‌ర‌కైతే అనుకోకుండా జ‌రిగింది. "ఈ సంస్థ‌ను ఏర్పాటు చేస్తాన‌ని ఊహించ‌లేదు. అనుకోకుండా జ‌రిగింది. కానీ ఈ ప్ర‌యాణం ఆస‌క్తిక‌రంగా, స‌వాళ్ల‌తో కూడుకున్న‌దిగా ఉంది. అదే నన్ను మ‌రింత ఉత్సాహ‌ప‌రుస్తున్న‌ది" అని అరుణ్ వివ‌రించారు. యాత్ర‌చెఫ్‌వంటి సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని ఆ గంట‌లో అనిపించింద‌ని, అందుకే దాన్ని ప్రారంభించామ‌ని అంటారాయ‌న‌. ఇప్పుడా మోడ‌ల్ విజ‌య‌వంత‌మైంది. సంస్థ‌ను మ‌రింత విస్త‌రించేందుకు పెట్టుబ‌డిదారుల‌తో కూడా అరుణ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అరుణ్ ఆశ‌యాలు నిజ‌మై, దేశ‌వ్యాప్తంగా ట్రైన్ ప్యాసింజ‌ర్స్ ఆరోగ్య‌క‌ర‌మైన‌, రుచిక‌ర‌మైన ఆహారాన్ని భుజించాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..

ఇలాంటి సేవ‌లు అందించాల‌న్న అరుణ్ ఉద్దేశం గురించి మీరేమ‌నుకుంటున్నారు.. మీ అభిప్రాయాల‌ను మాతో పంచుకోండి..