హైదరాబాద్ లో నాస్కాం వేర్ హౌస్

హైదరాబాద్ లో నాస్కాం వేర్ హౌస్

Monday January 18, 2016,

2 min Read

టీహబ్ తో కలసి నాస్కాం మన భాగ్యనగరంలో వేర్ హౌస్ ఏర్పాటు చేసింది. దీన్ని ఐటి మంత్రి కేటీఆర్, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.

“నాస్కాం వేర్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం,”కేటీఆర్

నాస్కాం 10,000 స్టార్టప్స్ దేశంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా మన భాగ్యనగరంలో వేర్ హౌస్ ఏర్పాటు చేయడం ఓ గొప్ప అవకాశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఇది సంతోషకరమైన విషయమని ఆయన చెప్పుకొచ్చారు.

image


స్టార్టప్ లకు హైదరాబాద్ అనుకూలం

మన భాగ్యనగరం స్టార్టప్ కల్చర్ ని ఎడాప్ట్ చేసుకుందని, ఇప్పటికే ఇక్కడ కొన్ని ఇన్నో వేటివ్ ఐడియాలు స్టార్టప్ లకుగా మారాయని, మరింత ముందుకు దూసుకు పోవడానికి నాస్కార్ వేర్ హౌస్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2013లోనే బెంగళూరులో నాస్కాం తన వేర్ హౌస్ ని ఏర్పాటు చేసింది. ఆతర్వాత కోల్‌కతా, నవీ ముంబై, పుణె, కొచ్చీ, గుర్గావ్ లలో కూడా నాస్కాం వేర్ హౌస్ లను ఏర్పాటు చేసింది. ఇప్పుడా నగరాల సరసన మన హైదరాబాద్ చేరింది. మరో వైపు బెంగళూరులో ఏర్పాటు చేసిన పదివేల చదరపు అడుగుల స్టార్టప్ వేర్ హౌస్ ని నలభై వేల చదరపు అడుగుల వేర్ హౌస్ గా ఎక్స్ టెండ్ చేయనుంది. ఈ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలసి వేర్ హౌస్ లను ఏర్పాటు చేసి నాస్కాం సేవలను కొనసాగిస్తోంది. ఇటీవల టీ హబ్ ఏర్పటు చేసి స్థానిక స్టార్టప్ లకు కొత్త బూస్టింగ్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి నాస్కాం ముందుకొచ్చింది.

“స్టార్టప్ ఈకో సిస్టమ్ ని హైదరాబాద్ చాలా తొందరగా అందుకుంది,” బివిఆర్ మోహన్ రెడ్డి

స్టార్టప్ ఇండియా మెమొంటియస్ రైజ్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ లో హైదరాబాద్ అనేది ఓ ప్రధాన నగరమని నాస్కాం చైర్మన్ అయిన మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ లకు చేసిన ప్రమోషన్ తో బెంగళూరు స్టార్టప్ సిటీ గా మారిందని, ఇప్పుడా సమయం హైదరాబాద్ కి వచ్చిందనిచ దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని దూసుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు.

image


టీ హబ్ లో సంబరాలు

హైదరాబాద్ స్టార్టప్ కు పర్యాయ పదంగా మారిన టీహబ్ లో స్టార్టప్ కంపెనీలు సంబరాలు జరుపుకున్నాయి. నాస్కాం వేర్ హౌస్ ఇక్కడే ఏర్పాటు చేయడం తో వారి సంతోషానికి అవధుల్లేవు. హైదరాబాద్ లో పూర్తి స్థాయి ఈకో సిస్టమ్ ఇప్పటికే ఉందని, నాస్కామ్ సంస్థ చూపిన చొరవతో మరింత మార్పులు వస్తాయని స్టార్టప్ జానాలు అభిప్రాయపడ్డారు.

“నాస్కాం వేర్ హౌస్ మా ప్రాంగణంలోనే ఏర్పుట చేయడం ఓ గొప్ప అవకాశం,” జయ్ క్రిష్ణ

టీ హబ్ సీఈఓ అయిన జయ్ క్రిష్ణ వేర్ హౌస్ ఏర్పాటుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేర్ హౌస్ ఏర్పాటు అనేది ఓ అవకాశంగా అభివర్ణించిన ఆయన స్థానిక స్టార్టప్ లకు ఇది అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.

image


నాస్కాం వేర్ హౌస్ వల్ల ప్రయోజనాలు

నాస్కాం వేర్ హౌస్ వల్ల స్థానిక స్టార్టప్ లకు చాలా ప్రయోజనాలుంటాయి. ఇందులో ముఖ్యమైనవి

  1. వేర్ హౌస్ లో స్టార్టప్ టాక్స్ ఏర్పాటు చేసుకొవచ్చు.
  2. కొత్త ఐడియాల కోసం చర్చా వేదికలు ఏర్పాటు చేయొచ్చు.
  3. కొత్త స్టార్టప్ లకు నాస్కాం గుర్తింపు లభించడం సులభతరం అవుతుంది. దీంతో సరికొత్త అవకాశాలు వస్తాయి.
  4. ప్రాడక్ట్ మార్కెట్ వాల్యూమ్, ఫండింగ్ లాంటి చాలా విషయాలపై నాస్కాం గైడ్ లైన్స్ అందుబాటులో ఉంటాయి.

ఇవన్నీ చెప్పుకోడానికి కొన్ని ఉపయోగాలు మాత్రమే. ఒక సారి ఇలాంటి ప్లాట్ ఫాంలోకి ప్రవేశించాక అవకాశాలకు ఆకాశమే హద్దుగా మారుతుంది.

“ మోడీ స్టార్టప్ పిలుపుకి ఉత్సాహంతో ముందడుగేస్తోన్న హైదరాబాద్ స్టార్టప్ లకు నాస్కాం వేర్ హౌస్ ఏర్పుటు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లైంది.”